"పొన్నూరు" కూర్పుల మధ్య తేడాలు

519 bytes added ,  12 సంవత్సరాల క్రితం
చి (యంత్రము కలుపుతున్నది: vi:Ponnur)
 
 
ప్రముఖ గాంధేయవాది, స్వాతంత్ర్య సమర యోధుడు, స్వర్గీయ [[ఎన్.జి.రంగా|ఎన్‌జీ రంగా]] (గోగినేని రంగనాయకులు) పొన్నూరునే కార్యస్థలంగా చేసుకుని తమ కార్యక్రమాలు నిర్వహించే వారు. ఆంధ్ర ప్రదేశ్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి వీరి పేరిటే [[ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయము]] అని పేరు పెట్టారు.ఆంధ్ర విశ్వవిద్యాలయం చే కళాప్రపూర్ణ బిరుదాన్ని అందుకున్న తుమ్మల సేతారామ మూర్తి , కొందవీటి వెంటకవి , కొత్త సత్యనారాయణ చౌదరి వంటి కవులు , దళిత సాహిత్య, ఉద్యమ నిర్మాత కత్తి పద్మారావు , ప్రముఖ కవి యేటుకూరి వెంకట నరసయ్య , పండిత శ్రీ కృష్ణభగవాన్ వంటి వారు యిక్కద సాహితీ వ్యాసంగాన్ని కొనసాగించారు.గుంటూరు జిల్లా విద్యారంగం లో పురోగమించడానికి మూలపురుషుడు , అప్పటి గుంటూరు జిల్లా బోర్డు అద్యక్షులు పాములపాటి కృష్ణయ్య చౌదరి ,ఎందరినో రక్షణ శాఖలో చేర్పించి , రాష్ట్రంలో ఎన్.సి.సి ని తీర్చి దిద్దిన కల్నల్ పి .ల్.న్ .చౌదరి నిడుబ్రోలు గ్రామస్తులే.మాజి కేంద్రమంత్రి పాములపాటి అంకినీడు ప్రసాద రావు, చేనేత ఉద్యమ పితామహులు, నాయకులు ప్రగడ కోటయ్య, మాజి శాసన సభ్యులు సజ్జా చంద్ర మౌళి , టి.వెంకయ్య , గోగినేని నాగేస్వర రావు ,చిట్టినేని వెంకట రావు వంటి ఎందరో నాయకులకు స్వగ్రామం . కేంద్ర కేబినెట్ కార్యదర్శి పదవిని నిర్వహించిన తొలి తెలుగు ఐ.ఎ.యస్ అధికారి శ్రీ టి.ఆర్.ప్రసాద్ నిడుబ్రోలు వాస్తవ్యులు కావటమే గాక, ఇక్కడి జిల్లా బోర్డు హైస్కూలు పూర్వ విద్యార్ధి కావటం విశేషం.
 
స్థానికంగా మంచి వ్యాపార కేంద్రంగా పొన్నూరు ప్రసిద్ధి చెందింది. చుట్టుపక్కల గల గ్రామాల నుండి వచ్చే వ్యవసాయ ఉత్పత్తులు పొన్నూరు ద్వారానే ఇతర ప్రాంతాలకు తరలుతూ ఉంటాయి. [[ధాన్యం]], [[తమలపాకులు]], [[అరటి పళ్ళు]], [[కూరగాయలు]] మొదలైనవి ఈ ఉత్పత్తులలో ప్రముఖమైనవి. [[కృష్ణా నది]]పై [[విజయవాడ]] వద్ద గల [[ప్రకాశం బ్యారేజి|ప్రకాశం బారేజి]] నుండి పొన్నూరుకు, చుట్టుపక్కల గ్రామాలకు [[బకింగ్‌హాం కాలువ]] ద్వారా సాగు నీరు సరఫరా అవుతుంది.
68

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/325830" నుండి వెలికితీశారు