లోహాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 49:
మానవుడు సాంకేతికంగా అభివృద్ధి చెందే ప్రయాణంలో లోహములు (metals) కీలకమైన పాత్ర వహించేయనడంలో సందేహం లేదు. అందుచేత చాల మందికి లోహములంటే ఏమిటో, వాటి గుణగణాలు ఏమిటో అనుభవపూర్వకంగా తెలిసే ఉంటుంది. సర్వసాధారణంగా లోహాలకి ఉండే లక్షణాలు: (1) వాటికి ఒక రకమైన "మెరుపు" లేదా "తళుకు" (lustre) ఉంటుంది; లేకపోతే మెరుగు పెట్టి మెరుపు తెప్పించవచ్చు. (2) అవి ముట్టుకుంటే చేతికి చల్లగా తగులుతాయి. (3) అవి త్వరగా వేడెక్కుతాయి లేదా, వాటి ఉష్ణ వాహకత (heat conductivity) ఎక్కువ. (4) వాటి విద్యుత్ వాహకత (electrical conductivity) కూడా ఎక్కువే! (5) ఈ వస్తువులని సుత్తితో కొడితే ఖంగు మని మోగుతాయి. (6) ఒంచితే ఒంగుతాయి, సాగదీస్తే తీగలా సాగుతాయి. ఈ లక్షణాన్ని "తాంతవత" (ductility) అంటారు. (7) సుత్తితో బాదితే పలచబడి గట్టిబడతాయి. ఈ లక్షణాన్ని "అఘాత వర్ధనీయత" (malleability) అంటారు. (8) ఇవి సర్వసాధారణంగా బరువుగా ఉంటాయి. (9) ఇవి వేడి చేస్తే కరుగుతాయి. ఇలా ఈ జాబితాని పొడిగించుకుంటూ పోవచ్చు.
 
అన్ని లోహాలూ, అన్ని వేళలలోనూ ఈ లక్షణాలన్నిటిని ప్రదర్శించక పోవచ్చు. అలాగే ఈ లక్షణాలు ఉన్నంత మాత్రాన అవి లోహాలవాలని నియమం ఏమీ లేదు. ఉదాహరణకి గాజుని గోటితో మీటితే టింగు మని శబ్దం చేస్తుంది కదా; [[గాజు_(పదార్థం)|గాజు]] (glass) లోహం కాదని అందరికీ చెప్పకనే తెలుసు! [[సీసము|సీసం]] (lead), [[తగరం]] (tin) లోహాలయినప్పటికీ అవి టింగు మనవు, ఖంగు మనవు. పోత ఇనుము (cast iron) పెళుసుగా ఉంటుంది. [[అల్యూమినియం|అల్లూమినం]] (aluminum), [[మెగ్నీషియం|మగ్నం]] (magnesium) తక్కువ సాంద్రత కలవి కనుక తేలికగా ఉంటాయి. [[గ్రాఫైట్|గ్రేఫైట్]] (graphie) కి - లోహం కాకపోయినా - వాహక శక్తి ఎక్కువ అవడమే కాకుండా మెరుగు పెట్టి తళుకు తెప్పించవచ్చు. ఇలా మినహాయింపులు చెప్పుకుంటూ పోతే ఒక వస్తువు లోహమా, కాదా అని నిశ్చయించడానికి ఏయే లక్షణాలని పరిశీలించాలో నిర్ధిష్టంగా చెప్పడం కష్టం అయిపోతుంది!! ఇదే విధంగా మన అనుభవ పరిధిలో ఏది లోహం, ఏది సంయోగధాతువు (alloy) అని నిర్ధారించి చెప్పడం కూడ కష్టమే!
 
==రసాయన మూలకాలలో రకాలు==
"https://te.wikipedia.org/wiki/లోహాలు" నుండి వెలికితీశారు