లోహాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 97:
==పూర్వకాలంలో==
 
రాతియుగంలో సహజసిద్ధంగా లభించే లోహపు కణికలు మానవుడి కంటికి కనబడినప్పుడు రాళ్ళకీ, ఆ కణికలకి మధ్య తేడా స్పుటంగా ఉండడం గమనించి వాటిని పదిలంగా భద్రపరచి ఉంటాడు. ఆకుపచ్చగా ఉండే తామ్ర కర్బనితం (copper carbonate) రాళ్ళనీ, నల్లగా ఉండే అంజన గంధకిదము (antimony sulphide) లేదా [[సుర్మా]] రాళ్ళనీ గుండ చేసి [[ఈజిప్టు]]లోని పురాతన (సా. శ. పూ. 3500) రాజవంశీయులు సౌందర్య సామగ్రులుగా ఉపయోగించినట్లు దాఖలాలు ఉన్నాయి. వీటిని బొగ్గుల కొలిమిలో వేడి చేస్తే తేలికగా క్షయీకరణ పొంది, వాటిలోని లోహం బయటకి వచ్చెస్తుంది కనుక మూడొంతులు ప్రాచీనులకి రాగి, అంజనం లేదా సుర్మా (antimony) పరిచయమైన లోహాలే అయి ఉండవచ్చు. రోమను సామ్రాజ్యం వెల్లివిరిసేనాటికి (సా. శ. పూ. 200) [[ఇనుము]], [[రాగి]], [[సీసము|సీసం]], [[తగరం]], [[పాదరసం]], [[వెండి]], [[బంగారం]] విస్తారంగా వాడుకలోకి వచ్చేసేయి కనుకనే “లోహం” అనగానే ఈ ఏడు మూలకాలు ఠకీమని స్పురణకి వస్తాయి. ఇవన్నీ ఎక్కువ సాంద్రత కలిగినవి, మెరుగు పెడితే మెరిసేవి, తాకగానే చేతికి చల్లగా తగిలేవీను. ఒక్క పాదరసాన్ని మినహాయిస్తే ఇవన్నీ సుతిమెత్తనివి (malleable), సుత్తితో బాదితే గట్టిబడేవీ, వేడి చేస్తే మెత్తబడేవీ. వీటిని వేడి చేసి కరిగించవచ్చు, ఒకదానితో మరొకదానిని కలిపి, కరిగించి సంయోగధాతువులు (alloys) గా చెయ్యవచ్చు.
 
మన పూర్వులు సంయోగధాతువులతో విశేషంగా పని చేసేరు కాని లోహములకీ, సంయోగధాతువులకీ మధ్య ఉన్న తేడాలు వారికి పరిపూర్ణ అవగాహనలోకి వచ్చిన దాఖలాలు మాత్రం లేవు; ఏదో గుడ్డి గుర్రపు తాపులా వారికి కొన్ని సంయోగధాతువులు తారసపడి ఉండొచ్చు. ఇలాంటి సందర్భాలలో అప్పటివరకు ఎరికలో లేని మూలక లోహాలు (metal elements) వారు చూసినా అవి లోహాలని వారి గ్రహింపుకి వచ్చి ఉండకపోవచ్చు. ఒక గనిలో దొరికిన ఖనిజపు రాయిని ఒక విధంగా ”ప్రక్షాళిస్తే” వచ్చిన లోహం మరొక చోట దొరికిన ఖనిజం మీద అదే పద్ధతి ప్రయోగిస్తే పని చేసేది కాదు. ఉదాహరణకి రోమనులకి మూడు రకాల “సీసం” లు గురించి తెలుసు: సాధారణ సీసం (Plumbum nigrum), తగరం (Plumbum candidum అనగా, బ్రిటన్ నుండి వచ్చిన సీసం), [[బిస్మత్]] (Plumbum cinereum). అలాగే వారు రాగిని aes cyprium (అనగా సైప్రస్ లో దొరికే కంచు) అనేవారు. పదిహేను వందల సంవత్సరాల తరువాత కూడ, జెర్మనీలోని రాగి కమ్మటాలలో (copper smelters) [[కోబాల్ట్]] కీ [[నికెల్]] కీ మధ్య తేడా తెలియక తికమకలు పడ్డారనడాని వాటి పేర్లే సాక్ష్యం (జెర్మన్ భాషలో నికెల్ అన్నా కోబాల్ట్ అన్నా భూతం అనీ డాకినీ అని అర్థం!).
"https://te.wikipedia.org/wiki/లోహాలు" నుండి వెలికితీశారు