సపోటా: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి #WPWPTE,#WPWP
పంక్తి 27:
సపోటా చెట్లు సంవత్సరానికి రెండు కాఫులు కాస్తాయి. [[పూవు]]లు సంవత్సరం పొడవునా ఉంటాయి. పచ్చి కాయలో latex (జిగురు లేదా పాలు అంటారు.) ఎక్కువ ఉంటుంది. ఈ కాయలు చెట్టున ఉన్నపుడు పండవు. కోశిన తరువాతనే పండుతాయి. ఇదివరకు సపోటా (Sapodilla)ను ''Achras sapota'' అనేవారు కాని ఇది సరైన పేరు కాదు. భారతదేశంలో "చిక్కూ" లేదా "సపోటా' అంటాఱు. బెంగాల్ ప్రాంతంలో "సొఫెడా" అంటారు. దక్షిణాసియా, పాకిస్థఅన్‌లలో "చికో" అని, ఫిలిప్పీన్స్‌లో "చికో" అని, ఇండినేషియాలో "సవో" (''sawo'') అని, మలేషియాలో "చికు" అని అంటారు. వియత్నాంలో ''hồng xiêm'' (''xa pô chê'') అని, గుయానాలో "సపోడిల్లా' అని, శ్రీలంకలో "రత-మి"అని, థాయిలాండ్‌, కంబోడియాలలో ''లమూత్'' (ละมุด) అంటారు. కొలంబియా, నికరాగ్వే వంటి దేశాలలో ''níspero'' అని, క్యూబా వంటి చోట్ల ''nípero'' అని, Kelantanese Malayలో "sawo nilo" అంటాఱు..
==రకాలు : ==
[[File:സപ്പോട്ട.jpg|thumb|సపోటా పండు]]
మన రాష్ట్రంలోని సపోటా కొనుగోలుదారులు పాల రకాన్ని బాగా ఇష్టపడతారు. మహారాష్ట్రలో కాలి పత్తి రకాన్ని, కర్ణాటకలో క్రికెట్ బాల్ రకాల్ని ఇష్టంగా తింటారు. పాల రకంలో దిగుబడి ఎక్కువ. పండు కోలగా, చిన్నదిగా ఉంటుంది. పలచని తోలుతో కండ మృదువుగా ఉంటుంది. పండ్లు బాగా తీయగా ఉంటాయి. అయితే ఈ పండ్లు నిల్వకు, రవాణాకు, ఎగుమతికి అనుకూలంగా ఉండవు. క్రికెట్ బాల్ రకం సపోటా పండ్లు గుండ్రంగా, పెద్దగా ఉంటాయి. ఒక మోస్తరు తీపి కలిగి ఉంటాయి. సముద్ర మట్టం నుండి వెయ్యి అడుగుల ఎత్తు వరకూ ఉన్న ప్రాంతాల్లోనూ, పొడి వాతావరణంలోనూ దిగుబడి బాగా వస్తుంది. కాలి పత్తి రకం పండ్లు కోలగా, మధ్యస్త పరిమాణంలో ఉంటాయి. తోలు మందంగా, కండ తీయగా ఉంటుంది. ఈ రకం పండు నిల్వ, రవాణా, ఎగుమతికి అనుకూలమైనది. అయితే ఈ రకం సపోటాలో దిగుబడి తక్కువ. ఇవి కాక ద్వారపూడి, కీర్తి బర్తి, పీకేయం-1, 3, డీహెచ్‌యస్ 1, 2 రకాలు కూడా అనువైనవే. వీటిలో డీహెచ్‌యస్ 1, 2 హైబ్రిడ్ రకాలు.
==వైద్యపరముగా ఉపయోగాలు :==
"https://te.wikipedia.org/wiki/సపోటా" నుండి వెలికితీశారు