లోహాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 127:
==20 వ శతాబ్దంలో==
 
ఇరవైయవ శతాబ్దం వచ్చేసరికి [[గుళిక వాదం]] (quantum theory) తలెత్తడంతో అణువుల యెడల మన అవగాహన బాగా పెరిగింది. అణువు (atom) అవిచ్ఛిన్నం కాదనిన్నీ, దాని గర్భంలో [[నూట్రానునూట్రాన్]]లు, [[ప్రోటానుప్రోటాన్]]లు అనే పరమాణువులు (subatomic particles) ఉంటాయనిన్నీ, ఈ గర్భం చుట్టూ ఋణావేశం ఉన్న [[ఎలక్ట్రాను]]లు ఉంటాయనిన్నీ తెలిసింది. ఆవర్తన పట్టికలో కుడి చివర నిలువు వరస (కుటుంబం) లో కనిపించే అచేతన (inert) వాయువులైన [[హీలియం|రవిజని]] (helium), [[నియాన్]], ... వగైరాల కర్పరాలు (shells) అన్నీ పూర్తిగా ఎలక్ట్రానులతో నిండిపోయి ఉంటాయి కనుక వాటికి స్థిరత్వం (stability) ఎక్కువ (అనగా, చైతన్యం తక్కువ). ఈ అంశం దృష్ట్యా ఒక మూలకం యొక్క రసాయన లక్షణాలు కేంద్రకం (nucleus) చుట్టూ ఉండే ఎలక్ట్రానుల స్థిరత్వం మీద ఆధారపడి ఉంటాయని తీర్మానించవచ్చు; స్థిరత్వం తక్కువ ఉంటే చురుకుదనం ఎక్కువగా ఉంటుంది. క్షార లోహాలు (ఒకటవ కుటుంబంలో ఉన్న [[లిథియం]], [[సోడియం]], [[పొటాషియం|పొటాసియం]], వగైరాలు) తమ బాహ్య కర్పరాలలో ఉన్న ఏకైక ఎలక్ట్రానుని వదలుకోడానికి సిద్ధపడతాయి కనుక అవి చాలా చురుకైన మూలకాలు అయేయి. అదే విధంగా అచేతన వాయు కుటుంబానికి ఎడం పక్కన 7 వ కుటుంబంలో ఉన్న [[ఫ్లోరిను|ఫ్లోరీను]], [[క్లోరిను|క్లోరీను]], వగైరాల బాహ్య కోష్టికలలో స్థిరత్వానికి కావలసిన సంఖ్య కంటె ఒక ఎలక్ట్రాను తక్కువ కావడంతో ఆ ఒక్క ఎలక్ట్రానుని సంపాదించి స్థిరత్వం పొందడానికి సదా ఆరాటపడుతూ ఉంటాయి కనుక అవి కూడా చలాకీ మూలకాలే. కనుక ఒక క్లోరీన్ (Cl) అణువు సునాయాసంగా ఒక సోడియం (Na) అణువు ఇచ్చే ఒక ఎలక్ట్రానుని స్వీకరించి స్థిరత్వం ఉన్న NaCl అనే సంయోగ పదార్థాన్ని ఇస్తుంది. ఇలా ఎలక్ట్రాను బదిలీ అవడం వల్ల ఇంతవరకు తటస్థం (neutral) గా ఉన్న అణువులు రెండూ ఆవేశం పొందిన Cl- అయాను గాను, Na+ అయాను గాను మారతాయి. ఇలా పరస్పరం వ్యతిరేక ఆవేశాలు ఉండడం వల్ల ఈ రెండు అయానులు ఒకదానిని మరొకటి బలంగా ఆకర్షించుకుంటాయి. అందుకనే NaCl కి స్థిరత్వం ఎక్కువ. ఈ రకం బంధాన్ని "అయానిక" బంధం అంటారు.
ఇలా రసాయనులు చేసిన కృషి వల్ల మనకి తెలిసినది ఏమిటంటే ఆవర్తన పట్టికలో ఎడం పక్కగా ఉన్న నిలువు వరుసలలోనూ (కుటుంబాలలోనూ), దిగువగా ఉన్న అడ్డు వరుసలలోనూ (ఆవర్తులలోనూ) ఉన్న మూలకాలు లోహాలు అయి ఉంటాయి.
"https://te.wikipedia.org/wiki/లోహాలు" నుండి వెలికితీశారు