లోహాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 138:
మరొక ఉదాహరణగా [[వజ్రం]]లో [[కర్బనం]] (carbon) అణువుల అమరికని పరిశీలించి చూద్దాం. కర్బనం అణువు యొక్క బాహ్య కర్పరం (outer shell) లో నాలుగు ఎలక్ట్రానులే ఉంటాయి కాని ఈ కర్పరంలో ఎనిమిది ఎలక్ట్రానులు పట్టడానికి సరిపడా చోటు ఉంది. కనుక ప్రతి కర్బనం అణువు తన పొరుగున ఉన్న కర్బనం అణువుతో నాలుగు ఎలక్ట్రానులని ఉమ్మడిగా పంచుకోగలదు. ఇప్పుడు ఒకొక్క కర్బనం అణువు పొరుగున నాలుగేసి ఇతర కర్బనం అణువులు ఉండేటట్లు అమర్చితే, ప్రతి కర్బనం అణువుకి తనవి నాలుగు, తన పొరుగున ఉన్న నాలుగు కర్బనం అణువుల నుండి ఒకొక్కటి చొప్పున మొత్తం నాలుగు తీసుకుని తన కర్పరాన్ని ఎనిమిది ఎలక్ట్రానులతో నింపుకుని స్థిరత్వం, దృఢత్వం పొందగలదు. ఈ రకం అమరిక కావాలంటే కర్బనం అణువులని మూడు దిశలలో వ్యాపించి ఉన్న చతుష్ఫలకం (tetrahedron) ఆకారంలో అమర్చాలి. వజ్రంలో ఉన్న కర్బనం ఈ అమరికలోనే ఉంటుంది కనుక అది అంత దృఢం (hard) గా ఉంటుంది. (పెళుసుగా కూడా ఉంటుంది కాని అది వేరే విషయం!) ఈ రకం బంధాన్ని నిరూపక బంధం (co-ordinate bond) అంటారు.
 
పైన ఉదహరించిన ఉప్పు, వజ్రం లోహాలు కావు. ఇప్పుడు లోహపు సోడియం (metallic sodium) లో అణువుల అమరిక ఎలా ఉంటుందో చూద్దాం. సోడియం అణువులు తమ బాహ్య కర్పరంలో ఒంటరిగా ఉన్న ఎలక్ట్రానుని వదలుకోగా మిగిలిన అయానులు, ఒకదానికి మరొకటి సమాన దూరంలో ఉండేటట్లు, మూడు దిశలలోనూ బారులు తీర్చిన ఇటికలులా అమరిపోతాయి. ఒంటరి ఎలక్ట్రానులన్నీ జారుడుగా ఉన్న ఉమ్మడి బెందడిలా సోడియం అణువుల మధ్య విశృంఖలంగా తిరుగాడుతూ విద్యుత్ పరంగా తటస్థతని ప్రదర్శిస్తాయి. ఈ రకం అమరికని దేహ-కేంద్ర ఘనస్వరూపం (body-centered cubic) అంటారు (బొమ్మ 3 లో ఎడం పక్క చూడండి). ఈ అమరికలో ఒక ఘనచతురస్రం లేదా ఘనం (cube) కి ఉన్న ఎనిమిది మూలలోనూ ఒకొక్క అణువు, ఘనం మధ్య ఒక అణువు ఉంటాయి. రాగిలో ఉండే అణువులని ఇంతకంటే కుదిమట్టం (compact) గా అమర్చవచ్చు. ఈ రకం అమరికని ముఖ-కేంద్ర ఘనస్వరూపం (face-centered cubic) అంటారు (బొమ్మ 3 లో మధ్యన చూడండి). ఈ అమరికలో ఒక ఘనం కి ఉన్న ఎనిమిది మూలలోనూ ఒక అణువు, ఆరు ముఖాల మధ్య ఒకొక్క అణువు ఉంటాయి. యశదం (zinc) లోని అణువులు hexagonal close pack అనే అమరికలో ఉంటాయి (బొమ్మ 3 లో కుడి చివర చూడండి).
 
{| class=wikitable
"https://te.wikipedia.org/wiki/లోహాలు" నుండి వెలికితీశారు