ఏ మాయ చేశావే: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 29:
 
==కథ==
తన ఇంజినీరింగ్ పూర్తిచేసుకున్న కార్తీక్ ([[అక్కినేని నాగ చైతన్య]]) సినిమా దర్శకుడవ్వాలని కలలు కంటుంటాడు. తన స్నేహితుడి ద్వారా ప్రముఖ దర్శకుడు [[పూరీ జగన్నాధ్]] దగ్గర అసిస్టంట్ గా చేరుతాడు. ఇంతలో తన ఇంటి పైపోర్షనులో కేరళ నుంచి వచ్చిన ఒక క్రిష్టియన్ కుటుంబానికి కార్తీక్ ప్రోత్సాహం మీద ఇల్లు అద్దెకి ఇస్తాడు కార్తీక్ తండ్రి. ఐతే వాళ్ళ కూతురు జెస్సీ ([[సమంత]])ని చూసి ప్రేమలో పడతాడు కార్తీక్. తన తండ్రికి భయపడుతున్న కార్తీక్ ఒక రోజు ఎవరూలేని సమయం చూసి జెస్సీకి తన ప్రేమ విషయం చెప్తాడు. దీనికి ఒప్పుకోని జెస్సీ తరువాత తన ఊరికి బయలుదేరిందని కార్తీక్ తెలుసుకుంటాడు. తన స్నేహితుడి ([[కృష్ణుడు (నటుడు)|కృష్ణుడు]])తో కలిసి ఆ ఊరికి .చేరుకున్న కార్తీక్ జెస్సీని కలిసి తన ప్రవర్తనకు క్షమాపణలడిగి, స్నేహితులుగా కొనసాగుదామని చెప్తాడు.కార్తీక్ పై ఎలాంటి ఆలోచనలు లేవని స్పష్టం చేసిన జెస్సీ తన స్నేహానికి ఒప్పుకుని తన ఇంట్లోవారికి తన క్లాస్ మేట్ గా పరిచయం చేస్తుంది.
ఆపై ట్రైనులో హైదరాబాద్ కు వెళ్తున్నప్పుడు కార్తీక్ జెస్సీని ముద్దుపెట్టుకుంటాడు. మళ్ళీ గొడవలు మొదలవుతాయి. వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందనుకున్న జెస్సీ సోదరుడు కార్తీక్ తో గొడవ పెట్టుకుని తన్నులు తింటాడు. జెస్సీ తల్లిదండ్రులకు కూడా అనుమానం రావడంతో పెళ్ళికి ఏర్పాట్లు చేస్తారు. కానీ ఈ పెళ్ళి తనకి ఇష్టం లేదని జెస్సి తేల్చిచెప్పడంతో పెళ్ళి ఆగిపోతుంది. జెస్సీని చూడాలని వచ్చిన కార్తీక్ జరిగింది తెలుసుకుని జెస్సీ ఇంటికి వెళ్తాడు. అక్కడ జెస్సీని కలిసి తనని జెస్సీ గాఢంగా ప్రేమిస్తోందనీ, ఇది తెలిస్తే రెండు కుటుంబాల్లో గొడవలు చెలరేగుతాయనీ తన మాటలను బట్టి తెలుసుకుంటాడు కార్తీక్. ఆపై వారిద్దరు వారి కుటుంబాలకి తెలియకుండా హైదరాబాద్ లో ఒకరినొకరు ప్రేమించుకుంటూ హాయిగా కాలం వెళ్ళదీస్తుంటారు.
అంతా సాఫీగా జరుగుతుండగా పూరీ జగన్నాధ్ గోవాలో షూటింగ్ కి తన యూనిట్ తో కలిసి వెళ్తాడు. 45 రోజులు సాగే ఈ షూటింగ్ లో కార్తీక్ కూడా ఒక భాగం. షూటింగ్ జరుగుతుండగా జెస్సీ ఇంట్లో తన పెళ్ళి గురించి చర్చలు జరుగుతుంటాయి. దానితో భయపడిపోయి జెస్సీ కార్తీక్ కి ఫోన్ చేస్తుంది. తను షూటింగ్ లో పాల్గొంటున్న లోకేషన్లలో సిగ్నల్స్ లేక పోవడం, దర్శకుడైన పూరీ జగన్నాధ్ సెట్స్ లో ఫోన్ల వాడకం నిషేధించడం వల్ల ఇప్పుడు మాట్లాడలేనని, తిరిగి వచ్చాక మాట్లాడుకుందామని ఫోన్ కట్ చేస్తాడు. దానితో జెస్సీ తన తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదనీ, తమ ఇద్దరి జీవిత లక్ష్యాలు వేరనీ చెప్పి కార్తీక్ తో విడిపోతుంది. తన తల్లిదండ్రులు కుదిర్చిన సంబంధం ఒప్పుకుని పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయిందని తెలుసుకుని నివ్వెరబోతాడు కార్తీక్.
"https://te.wikipedia.org/wiki/ఏ_మాయ_చేశావే" నుండి వెలికితీశారు