ఆర్యభట్టు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి AWB తో సవరణలు
పంక్తి 18:
}}
'''ఆర్యభట''' భారతదేశ అత్యున్నత గణిత, ఖగోళ శాస్త్రవేత్తలలో అగ్రగణ్యుడు. ఇతను క్రీ.శ. 426-550 ప్రాంతంలో నివసించినట్లు అంచనా. ఆర్యభట్టు కుసుమపురము (ఈనాటి [[పాట్నా]]) లో నివసించాడు. ఇతను [[ఆర్యభట్టీయం]], ఆర్య సిధ్ధాంతం, [[సూర్య సిద్ధాంతం]], గోళాధ్యాయం, సంస్కృత గణిత సంఖ్యా శాస్త్రాన్ని రచించాడు. ఇవే కాక ఆర్యభట్టు ''[[పై]]'' విలువను సుమారుగా కనుక్కున్నట్లు చెప్తారు. ఆధునిక [[గణితము|గణితం]]లోని సైన్, కొసైన్ లను ఇతను "జ్యా" ,"కొ జ్యా"గా నిర్వచించాడు. భారతదేశపు తొలి కృత్రిమ ఉపగ్రహానికి ఇతని పేరు ([[ఆర్యభట్ట (కృత్రిమ ఉపగ్రహం)|ఆర్యభట్ట]]) పెట్టారు.
 
 
 
 
ప్రపంచ వ్యాప్తంగా ఆధునిక శాస్త్రజ్ఞులంతా ఆర్యభట్టు ఖగోళ శాస్త్రానికి, గణిత శాస్త్రానికి చేసిన సేవలు ఎనలేనివని గుర్తించారు. గ్రీకులు ఆయన్ను ఆర్డువేరియస్ అనీ, అరబ్బులు అర్జావస్ అనీ వ్యవహరించే వారు. ఒకానొక కాలంలో ఆయన సిద్ధాంతాల గురించి భారతీయ పండితులు విరివిగా చర్చించుకొనే వారు. సుమారు వేయి సంవత్సరాల క్రితం [[భారత దేశము|భారత్]] ను సందర్శించిన అల్-బెరూనీ అనే అరబ్బు పండితుడు ఆయన రచనల్లో ఆర్యభట్టు గురించి ప్రస్తావించాడు. ఆ రచనల్లో ఒక చోట "కుసుమపురానికి చెందిన ఆర్యభట్టు తన పుస్తకంలో మేరు పర్వతం హిమాలయాల్లో సుమారు యోజనం ఎత్తున ఉందని ప్రతిపాదించాడు" అని రాశాడు. దీన్ని బట్టి ఆర్యభట్ట అతను సూత్రీకరించిన కొన్ని సమీకరణాల సాయంతో పర్వతాల ఎత్తును కొలిచాడని అర్థమవుతుంది.
Line 84 ⟶ 81:
ఆర్యభట్టుడు '''భూగోళః సర్వతోవృత్తః''' అని వ్రాసాడు.భూగోళ మనే మాటలో ఇమిడి ఉంది, భూమియొక్క వర్తులత్వం (Sphericity). భూమి నక్షత్రగోళానికి మధ్యగా నిరాధారంగా ఉందని చెప్పాడు. ఆర్యభట్టుడు భూభ్రమణం, భూమి తనచుట్టూ తాను తిరుగుతూ సూర్యునిచుట్టూ తిరుగుతోందని ఈ క్రింద శ్లోకంలో చెప్పాడు.
 
" భప్ంజరః స్థిరో భూరేవావృత్యావృత్య ప్రాతిదైశికా ఉదయాస్తమయో సంపాదయతి నక్షత్రగ్రహణాం"
 
నక్షత్రగోళం స్థిరంగా ఉంది. ఈ భూమే తిరుగుతూ నక్షత్రాల యొక్క, గ్రహాల యొక్క ఉదయాస్తమయాల్ని కలగజేస్తోంది అని దీని అర్థం. కాని ఈ సిద్ధాంతం అప్పటి ప్రజాభిప్రాయానికి, ప్రాచీన సిద్దంతాలకూ వ్యతిరేకంగా ఉండడం చేత భయపడో, లేక ఊరికే గణితానికి అనుకూలంగా ఉండే కొరకో, ఎందుకోగానీ వెంటనే మళ్ళీ భూమి తిరక్కుండా మధ్యనుందనీ, నక్షత్రాలూ, గ్రహాలూ భూమిచుట్టూ తిరుగుతున్నాయనీ వ్రాసాడు. ఆర్యభట్టుని భూభ్రమణ సిద్ధాంతం ఆ రోజుల్లోనే బ్రహ్మగుప్తునిచే ఆక్షేపింపబడింది.
Line 116 ⟶ 113:
[[వర్గం:ఖగోళ శాస్త్రవేత్తలు]]
[[వర్గం:గణిత శాస్త్రవేత్తలు]]
[[వర్గం:ఈ వారం వ్యాసాలు]]
"https://te.wikipedia.org/wiki/ఆర్యభట్టు" నుండి వెలికితీశారు