ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి AWB తో సవరణలు
పంక్తి 30:
'''ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం''' (1946 జూన్ 4 - 2020 సెప్టెంబరు 25) నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు, టెలివిజన్ వ్యాఖ్యాత. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ లాంటి భాషల్లో సుమారు 40 వేలకు పైగా పాటలు పాడాడు. అతడి పూర్తి పేరు '''శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం.''' అతన్ని ఎస్పీబీ అని కూడా పిలవడం కద్దు. అభిమానులు ఆయనను ముద్దుగా '''బాలు''' అని పిలుస్తారు. 1966 లో పద్మనాభం నిర్మించిన [[శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న]] చిత్రంతో సినీ గాయకుడిగా అతని ప్రస్థానం ప్రారంభమైంది. తర్వాత మరిన్ని అవకాశాలు తలుపు తట్టాయి. మొదట్లో ఎక్కువగా తెలుగు, తమిళ చిత్రాల్లో పాటలు పాడే అవకాశాలు వచ్చాయి. చాలా మంది నటులకు వారి హావభావాలకు, నటనా శైలికి అనుగుణంగా పాటలు పాడేవాడు.
 
1969 లో మొదటిసారిగా నటుడిగా కనిపించిన ఈయన తర్వాత కొన్ని అతిథి పాత్రల్లో నటించాడు. తర్వాత అనేక తమిళ, తెలుగు చిత్రాల్లో సహాయ పాత్రలు పోషించాడు. [[ప్రేమ (1989 సినిమా)|ప్రేమ]] (1989), [[ప్రేమికుడు]] (1994), [[పవిత్ర బంధం (1996 సినిమా)|పవిత్రబంధం]] (1996), [[ఆరో ప్రాణం]] (1997), [[రక్షకుడు]] (1997), [[దీర్ఘ సుమంగళీ భవ]] (1998) మొదలైనవి ఆయన నటించిన కొన్ని సినిమాలు. బాలు డబ్బింగ్ ఆర్టిస్టుగా అనేకమంది కళాకారులకు గాత్రదానం చేశాడు. [[కమల్ హాసన్]], [[రజినీకాంత్|రజనీకాంత్]], [[సల్మాన్ ఖాన్]], [[విష్ణువర్ధన్(నటుడు)|విష్ణువర్ధన్]], [[జెమినీ గణేశన్|జెమిని గణేశన్]], [[గిరీష్ కర్నాడ్]], [[అర్జున్ సర్జా|అర్జున్]], [[నగేష్]], [[రఘువరన్]] లాంటి వాళ్ళకి గాత్రదానం చేసాడు.
 
సినిమాల్లోనే కాక టి.వి రంగంలో ఆయన [[పాడుతా తీయగా (ధారావాహిక)|పాడుతా తీయగా]], పాడాలని ఉంది లాంటి కార్యక్రమాలను నిర్వహించి ఎంతోమంది నూతన గాయనీ గాయకులను పరిచయం చేశాడు. ఇవి కాకుండా ఈటీవీలో ప్రసారమైన స్వరాభిషేకం లాంటి కార్యక్రమాల్లో తన గానాన్ని వినిపించాడు.
 
అతను కేంద్ర ప్రభుత్వం నుండి 2001 లో [[పద్మశ్రీ పురస్కారం|పద్మశ్రీ]] పురస్కారాన్ని, 2011 లో [[పద్మభూషణ్ పురస్కారం|పద్మభూషణ్]] పురస్కారాన్ని అందుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 25 సార్లు వివిధ విభాగాల్లో నంది పురస్కారం అందుకున్నాడు. ఇంకా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రప్రభుత్వాల నుంచి కూడా పలు పురస్కారాలు అందుకున్నారు. 2021లోమరణానంతరం కేంద్ర ప్రభుత్వం బాలుకు [[పద్మ విభూషణ్ పురస్కారం|పద్మ విభూషణ్]] పురస్కారాన్ని ప్రకటించింది.
పంక్తి 39:
 
===బాల్యం, విద్యాభ్యాసం===
బాలసుబ్రహ్మణ్యం 1946, జూన్ 4 న నెల్లూరు జిల్లా కోనేటమ్మపేట గ్రామంలో సాంప్రదాయ వీరశైవ ఆరాధ్య బ్రాహ్మణ కుటుంబానికి చెందిన [[శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి]], శకుంతలమ్మ దంపతులకు జన్మించాడు.<ref>{{Cite web|url=https://www.eenadu.net/cinema/latestnews/sp-balasubrahmanyam-actor-to-singer-life-journey/0201/120112193|title=బహుముఖ ప్రజ్ఞాశాలి..ఎస్పీబీ|website=www.eenadu.net|language=te|access-date=2020-09-25}}</ref> అతని స్వగ్రామం మొదట గోల్కొండ పాలకుల ఆధీనంలో ఉండేది. ఆ తరువాత 1825 నుండి మద్రాసు ప్రెసిడెన్సీలో భాగమయ్యింది.<ref>{{Cite web|url=https://tiruvallur.nic.in/about-district/|title=About District {{!}} Tiruvallur District {{!}} India|language=en-US|access-date=2020-09-25}}</ref> అతని తండ్రి పేరొందిన హరికథా కళాకారుడు. ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు కల పెద్ద కుటుంబములో బాలసుబ్రహ్మణ్యం రెండవ కుమారుడుగా జన్మించాడు. తండ్రి భక్తిరస నాటకాలు కూడా వేస్తుండేవాడు. సాంబమూర్తితో ఇంట్లో పండితులు, కవులు భాషా, సాహిత్య పరమైన చర్చలు జరుపుతూంటే విని, బాలసుబ్రహ్మణ్యానికి బాల్యం నుంచే భాషపై ఆసక్తి పెరిగింది. <ref>ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం - మార్గదర్శి, ఈటీవీ (మార్గదర్శి) 2013 టీవీ కార్యక్రమం, స్థానం:3:55 ని - 4:38 ని, publisher=ఈటీవీ2</ref> తండ్రి హరికథా కళాకారుడు కావడంతో బాలుకు చిన్నప్పటి నుంచే సంగీతం మీద ఆసక్తి ఏర్పడింది.
 
ఐదేళ్ళ వయసులో తండ్రితో కలిసి భక్త రామదాసు అనే నాటకంలో నటించాడు. ప్రాథమిక విద్య [[నగరి]] లోని మేనమామ శ్రీనివాసరావు ఇంటిలో ఉంటూ పూర్తి చేశాడు. శ్రీకాళహస్తిలోని బోర్డు పాఠశాలలో స్కూలు ఫైనలు చదివాడు. చదువులోనే కాక, ఆటల్లో కూడా మొదటి వాడుగా ఉండేవాడు. [[శ్రీకాళహస్తి]]<nowiki/>లో చదివేటప్పుడే జి. వి. సుబ్రహ్మణ్యం అనే ఉపాధ్యాయుడు [[చెంచులక్ష్మి (1958 సినిమా)|చెంచులక్ష్మి]] సినిమాలో [[పి.సుశీల|సుశీల]] పాడిన ''పాలకడలిపై శేషతల్పమున'' అనే పాటను ఆలపింపజేసి టేపు మీద రికార్డు చేయించాడు. రాధాపతి అనే మరో ఉపాధ్యాయుడు ఈయనను ''ఈ ఇల్లు అమ్మబడును'', ''ఆత్మహత్య'' లాంటి నాటకాల్లో నటింప జేశాడు. తర్వాత తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలలో పియుసి చదువుతుండగా మద్రాసు ఆలిండియా రేడియోలో ప్రసారమయ్యే ఒక నాటికలో స్త్రీ పాత్ర ధరించాడు. [[ఆకాశవాణి కేంద్రం, విజయవాడ|ఆకాశవాణి విజయవాడ కేంద్రం]]<nowiki/>లో బాలు స్వయంగా రాసి, స్వరపరిచి పాడిన లలిత గీతానికి బహుమతి లభించింది.
పంక్తి 63:
== వ్యక్తిగత జీవితం ==
[[దస్త్రం:P.samabamurthy.JPG|thumb|right| నెల్లూరు లోని శ్రీ కస్తూర్బా కళాక్షేత్రంలో బాలసుబ్రహ్మణ్యం అవిష్కరించిన తన తండ్రి సాంబమూర్తి విగ్రహం]]
బాలుకు సావిత్రితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. పల్లవి, [[ఎస్. పి. చరణ్]]. కొడుకు ఎస్. పి. చరణ్ కొన్ని సినిమాల్లో పాటలు పాడి, తర్వాత సినీ నిర్మాతగా కూడా మారాడు. బాలు సోదరి [[ఎస్.పి.శైలజ|ఎస్. పి. శైలజ]] కూడా సినీ నేపథ్య గాయని. అన్నయ్యతో కలిసి ఈమె పలు చిత్రాల్లో పాటలు పాడింది. నటుడు [[శుభలేఖ సుధాకర్]] ను వివాహమాడింది. బాలు తండ్రి [[శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి]] 1987లో మరణించగా తల్లి శకుంతలమ్మ 2019 ఫిబ్రవరి 4 న 89 సంవత్సరాల వయసులో నెల్లూరులో మరణించింది.<ref>{{Cite web|url=https://timesofindia.indiatimes.com/entertainment/tamil/movies/news/sp-balasubrahmanyam-loses-his-mother/articleshow/67847082.cms|title=SP Balasubrahmanyam loses his mother - Times of India|website=The Times of India|language=en|access-date=2020-08-15}}</ref>
 
==పురస్కారాలు==
పంక్తి 98:
[[వర్గం:నంది ఉత్తమ నేపధ్య గాయకులు]]
[[వర్గం:నంది ఉత్తమ డబ్బింగు కళాకారులు]]
 
[[వర్గం:తెలుగు సినిమా నేపథ్యగాయకులు]]
[[వర్గం:తెలుగు సినిమా సంగీత దర్శకులు]]
Line 108 ⟶ 107:
[[వర్గం:మలయాళ సినిమా నేపథ్యగాయకులు]]
[[వర్గం:తమిళ సినిమా నేపథ్యగాయకులు]]
 
[[వర్గం:నెల్లూరు జిల్లా సినిమా సంగీత దర్శకులు]]
[[వర్గం:నెల్లూరు జిల్లా గాయకులు]]
Line 115 ⟶ 113:
[[వర్గం:భారతీయ హిందువులు]]
[[వర్గం:కరోనా వ్యాధి మరణాలు]]
[[వర్గం:ఈ వారం వ్యాసాలు]]