శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి కవీంద్రుడు వీరి శిష్యుడు. వీరితో శాస్త్రిగారికి కొంతకాలము వైరము గడిచినను అటుపై అది సమసినది. గిడుగు రామమూర్తి తోకూడా అదేవైఖరి నడిచినను అటుపై సఖ్యులుగా ఆత్మీయులుగా నడుచుకొనిరి.[[కవిసార్వభౌముడు]] తపస్వి. బాల నారధించిన కవీంద్రుడు.
 
==పదబంధ నేర్పరి శ్రీపాద వారు==
[[దస్త్రం:Sripada Krishnamurty Sastry statue at Rajahmundry.jpg|thumb|రాజమండ్రి పురపాలక సంస్థ ప్రాంగణంలో శ్రీపాద వారి విగ్రహం.]]
గోదావరి తీరం,[[రాజమహేంద్రవరం]] తాలూకు ప్రశస్తిని చాటిన శ్రీపాదవారు తన రచనలో ఎన్నో కొత్త [[పదాలు]] వాడడమే కాదు, ఒకపదం వేస్తే అర్ధం ఎలా మారుతుంది, ఓ పదం తీసేస్తే అర్ధం ఎలా ఉంటుంది వంటి ప్రయోగాలు చేసారని విశ్లేషించారు.'మరందం, మకరందం' వంటి పదాలు అందుకు [[ఉదాహరణ వాజ్మయము|ఉదాహరణ]]. సజాతి,విజాతి, విలోమ పదాలతో పదబంధం చేసిన నేర్పరి శ్రీపాద. శివదండకం, సరస్వతి దండకం ఇలా దండకాలను కూడా పొదిగారు.ముఖ్యంగా వసంతరాత్ర వర్ణన, దమయంతి వర్ణన అమోఘం. శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి ఒంటిచేత్తో [[రామాయణము|రామాయణ]], [[మహా భారతము|మహాభారత]], భాగవతాలను అనువదించడమే కాక శతాధిక గ్రంథాలను రాసారు. [[పద్యం]], గద్యం, లలితపదాలు అన్నీ ఆయన [[రచన]]లో స్పష్టంగా కనిపిస్తాయి. స్మార్తం, వేదం, శ్రౌతం ఈ మూడు నేర్చుకున్న గొప్ప పాండిత్యం గల శ్రీపాద వారు ఆయన తండ్రి నిర్వహించిన యజ్ఞానికి ఆధ్వర్యం వహించారు. ఇంటికి వచ్చినవాళ్ళు చివరకు కోర్టుకేసులు వేసినవాళ్లు వచ్చినాసరే ఆతిధ్యం ఇచ్చి అన్నంపెట్టిన మహోన్నత వ్యక్తిత్వం ఈయనిది.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3261962" నుండి వెలికితీశారు