దశావతారములు: కూర్పుల మధ్య తేడాలు

బొమ్మ చేర్చాను
పంక్తి 11:
 
[[భగవద్గీత]] నాల్గవ అధ్యాయము - జ్ఙాన, కర్మ సన్యాస యోగముల లోని ఈ రెండు శ్లోకములు ప్రసిద్ధములు. హిందూ విశ్వాసముల ప్రకారము లోకపాలకుడైన [[శ్రీ మహా విష్ణువు]] అనేక అవతారములు దాల్చును. అందు కొన్ని అంశావతారములు (ఉదా: [[వ్యాసుడు]]). కొన్ని పూర్ణావతారములు (ఉదా: నరసింహుడు). కొన్ని అర్చావతారములు (ఉదా: [[తిరుపతి]] [[వేంకటేశ్వరుడు]]).
 
[[బొమ్మ:Dasavatar, 19th century.jpg|center|thumb|500px|19వ శతాబ్దికి చెందిన దశావతారాల చిత్రం]]
పూర్ణావతారములలో దశావతారములు ముఖ్యమైనవి. చాలాకాలము నుండి విష్ణువు అవతారాలలో పది ముఖ్యమైనవి అని చెప్పుచున్నప్పటికీ. ఆ పది అవతారాలు ఏవి అన్న అంశంపై ఏకాభిప్రాయం లేదు. హరివంశమునందు నారాయణ, విష్ణు, వరాహ, నారసింహ, వామన, దత్తాత్రేయ, జామదగ్న్య, రామ, కృష్ణ, కల్కి అవతారములు పది ప్రధానావతారాలని పేర్కొనబడింది (హరి వంశం పూర్వ 1.42). ఇందులో మత్స్య, కూర్మ, బుద్ధ, బలరామావతారాలు లేవు. మహాభారతమునందు శాంతిపర్వములో చెప్పబడిన అవతారములలో బుద్ధావతారం లేదు (శాంతి పర్వం అ.339). మత్స్య పురాణంలో ధర్మ, నరసింహ, వామనావతారములు సంభూత్యవతారములని, దత్తాత్రేయ, మాంధాతృ, పరశురామ, రామ, వేదవ్యాస, బుద్ధ, కల్కి అవతారాలు మానుషావతారములని దశావతారాలను ఏకరువు పెట్టినది.
 
"https://te.wikipedia.org/wiki/దశావతారములు" నుండి వెలికితీశారు