రామోజీరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 52:
రామోజీరావు తనకు పరిచయస్తుడు, అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో పనిచేసేవాడైన తహశిల రామచంద్రరావు ప్రోత్సాహంతో అడ్వర్టైజింగ్ రంగంపై ఆసక్తితో ఆ రంగాన్ని గురించి నేర్చుకోవాలని ఆశించాడు. అందుకోసం చదువు పూర్తయ్యాకా [[ఢిల్లీ]]<nowiki/>లో ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో ఆర్టిస్టుగా ఉద్యోగంలో చేరాడు. మూడు సంవత్సరాల పాటు ఆ రంగంలో పనిచేసి 1962లో [[హైదరాబాదు|హైదరాబాద్]] తిరిగివచ్చాడు.{{sfn|గోవిందరాజు చక్రధర్|2020|p=21}}
 
రామోజీరావు 1962 అక్టోబరులో హైదరాబాద్‌లో [[మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్|మార్గదర్శి చిట్ ఫండ్]] ప్రారంభించాడు. ఇది అతని జీవితంలో తొలి వ్యాపారం. 1965లో [[కిరణ్ యాడ్స్]] అన్న అడ్వర్టైజ్‌మెంట్ ఏజెన్సీ ప్రారంభించాడు. 1967 - 1969 మధ్యకాలంలో [[ఖమ్మం]] ప్రాంతంలో వసుంధర ఫెర్టిలైజర్స్ పేరిట ఎరువుల వ్యాపారాన్ని సాగించాడు. 1969లో రామోజీరావు ప్రారంభించిన మొట్టమొదటి పత్రికగా వ్యవసాయ సమాచారంతో సాగే [[అన్నదాత (పత్రిక)|అన్నదాత]] ప్రారంభించాడు.{{sfn|గోవిందరాజు చక్రధర్|2020|p=22}} 1970లో ఇమేజెస్ అవుట్‌డోర్ అడ్వర్టైజ్‌మెంట్ ఏజెన్సీ ప్రారంభించాడు. దీని బాధ్యతలు అతని భార్య రమాదేవి చూసుకోసాగింది.{{sfn|గోవిందరాజు చక్రధర్|2020|p=2223}}
 
రామోజీ గ్రూపు క్రింద ఉన్న సంస్థలలో మార్గదర్శి చిట్ ఫండ్స్, [[ఈనాడు]] వార్తాపత్రిక, [[ఈటీవీ|ఈటీవి]], ప్రియా ఫుడ్స్, ఉషాకిరణ్ మూవీస్, [[రామోజీ ఫిల్మ్ సిటీ]], కళాంజలి షోరూములు ముఖ్యమైనవి.<ref name="ramojibio">{{Cite web |title=తెలుగుకి వెలుగు రామోజీరావు |url=http://emagazine.teluguvelugu.in/flip_book.php?year=2016&month=3#page/11 |date=2016-03-01|publisher=తెలుగువెలుగు|access-date=2020-07-05}}</ref><ref name="caravan">{{Cite web |title=Chairman Rao, How Ramoji Rao of Eenadu wrested control of power and politics in Andhra Pradesh|author=Praveen Donthi|url=http://www.caravanmagazine.in/reportage/chairman-rao?page=0,16|date=2014-12-01|archiveurl=https://web.archive.org/web/20141231184649/http://www.caravanmagazine.in/reportage/chairman-rao?page=0,16|archivedate=2014-12-31}}</ref>
"https://te.wikipedia.org/wiki/రామోజీరావు" నుండి వెలికితీశారు