"సామెతలు" కూర్పుల మధ్య తేడాలు

చి
#WPWP, #WPWPTE, బొమ్మ చేర్చాను
చి (#WPWP, #WPWPTE, బొమ్మ చేర్చాను)
{{తెలుగుభాషాసింగారం}}
'''సామెతలు''' లేదా '''లోకోక్తులు''' (Proverbs) ప్రజల భాషలో మరల మరల వాడబడే వాక్యాలు. వీటిలో భాషా సౌందర్యం, అనుభవ సారం, నీతి సూచన, హాస్యం కలగలిపి ఉంటాయి. సామెతలు ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిని, సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. ''"సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు"'' అంటారు. సామెతలకు ఏ ఒక్కరినీ రచయితగా చెప్పలేము. ప్రజలు తమ అనుభవాల్లోనుంచే సామెతలను పుట్టిస్తారు. ఆంగ్లంలో సామెతను '''byword''' లేదా '''nayword''' అని కూడా అంటారు. సామెతలలో ఉన్న భేదాలను బట్టి వాటిని "సూక్తులు", "జనాంతికాలు", "లోకోక్తులు" అని కూడా అంటుంటారు.
[[దస్త్రం:Large_Ragdoll_cat_tosses_a_mouse.jpg|thumb|పిల్లికి ఇరకాటం ఎలుకకు ప్రాణ సంకటం]]
 
సామెతలు ప్రసంగానికి దీపాల్లాంటివి. అవి సంభాషణకు కాంతినిస్తాయి. సామెతలో ధ్వని ఉంటుంది. ప్రసంగోచితంగా ఒక సామెతను ప్రయోగిస్తే పాలల్లో పంచదార కలిపినట్లుంటుంది. సామెతలు సూత్రప్రాయంగా చిన్న వాక్యాలుగా ఉంటాయి. ఇవి ఒక జాతి నాగరికతను చెప్పకనే చెబుతుంటాయి. ఇవి పూర్వుల అనుభవ సారాన్ని తెలియజేసే అమృత గుళికలు ("ఆకలి రుచి ఎరుగదు. నిద్ర సుఖమెరుగదు"). పండితులకు, పామరులకూ పెట్టని భూషణాలు (''"ఊరక రారు మహానుభావులు"''). సామెతలు ఒక నీతిని సూచింపవచ్చును (''"క్షేత్రమెరిగి విత్తనం వెయ్యాలి, పాత్రమెరిగి దానం చేయాలి"''). ఒక అనుభవ సారాన్ని, భావమును స్ఫురింపజేయవచ్చును (''"ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి", "కడివెడు గుమ్మడి కాయైనా కత్తిపీటకు లోకువే"''). ఒక సందర్భములో సంశయమును నివారించవచ్చును (''"అందానికి కొన్న సొమ్ము అక్కరకు పనికొస్తుంది"''). వ్యక్తులను కార్యోన్ముఖులను చేయవచ్చును (''"మనసుంటే మార్గముంటుంది"'') ప్రమాదమును హెచ్చరించవచ్చును (''"చిన్న పామునైనా పెద్దకర్రతో కొట్టాలి"''). వాదనకు ముక్తాయింపు పాడవచ్చును (''"తాంబూలాలిచ్చేశాను తన్నుకు చావండి"''). హాస్యాన్ని పంచవచ్చును (''"ఆత్రపు పెళ్ళికొడుకు అత్తవెంట పడ్డాడట"'').<ref name="krishna">'''లోకోక్తి ముక్తావళి అను తెలుగు సామెతలు''' (షుమారు 3400 సామెతలు)- సంకలనం: విద్వాన్ పి.కృష్ణమూర్తి - ప్రచురణ: మోడరన్ పబ్లిషర్స్, తెనాలి - [http://www.archive.org/details/lokokthimukthava021013mbp ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం]</ref>
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3280220" నుండి వెలికితీశారు