సురేంద్ర (కార్టూనిస్ట్): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 43:
పోసా రామకృష్ణా రెడ్డి, చిన్నమ్మ దంపతులకు జూన్ 6 న [[1962]] లో [[హనుమానగుత్తి]], [[వైఎస్‌ఆర్ జిల్లా]] లో జన్మించిన సురేంద్ర చదివింది బియస్సీ. వీరి పూర్తి పేరు పోసా సురేంద్రనాద్.
 
సురేంద్ర కార్టూనిస్టుగా మారడం అన్నది యాదృచ్ఛికంగా జరిగింది. ఆంధ్రజ్యోతి వారపత్రికలో సబ్ఎడిటర్‌గా ఉద్యోగం రావడంతో సురేంద్ర తండ్రి రామకృష్ణారెడ్డి తన కుటుంబాన్ని [[1978]] లో కడపనుండి [[విజయవాడ]] కు తరలించారు. అప్పటికి ఇంటర్మీడియట్ చదువుతున్న సురేంద్రకు మామూలు పాఠ్యాంశాల కంటే పాఠ్యేతర విషయాలపైనే ఎక్కువగా దృష్టి వుండేది. తన తండ్రి రామకృష్ణారెడ్డి మంచి రచయితే కాక [[ఆంధ్రజ్యోతి]] వారపత్రికకు సర్ఎడిటర్సబ్ఎడిటర్‌ కూడా కావడంతో విజయవాడలోని వారింటికి [[చాగంటి సోమయాజులు]], [[పెద్దిభొట్ల సుబ్బరామయ్య]] , [[వేగుంట మోహన ప్రసాద్]] ఇత్యాది ప్రఖ్యాతకవులు, సాహితీవేత్తలు వస్తుండడంతో వారిని చూడడమే కాక వారి యొక్క సంభాషణలను వినే అవకాశం కూడా సురేంద్ర కు కలిగింది. అంతేకాక కార్టూనిస్టుల నుండి ప్రచురణకు వచ్చే కార్టూన్లను సురేంద్ర తండ్రిగారైన రామకృష్ణారెడ్డి సెలక్ట్ చేస్తూ వుండడంతో ప్రత్యక్షంగా ఎంతోమంది కార్టూనిస్ట్ ల ఒరిజనల్ కార్టూన్లను చూసే అవకాశం కూడా కలగడంతో క్రమక్రమంగా సురేంద్రకు కార్టూన్లపై ఆశక్తి ఏర్పడింది.
 
==కార్టూన్ కళలో స్ఫూర్తి==