ఇడ్లీ: కూర్పుల మధ్య తేడాలు

→‎పుట్టు పూర్వోత్తరాలు: వ్యాకరణం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
→‎పుట్టు పూర్వోత్తరాలు: అక్షర దోషం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 29:
[[చైనా]] యాత్రికుడు [[హుయాన్ త్సాంగ్]] (7వ శతాబ్దము) రచనల వలన [[భారత దేశము]]లో ఆ కాలములో ఆవిరిపట్టే పాత్రలు లేవని తెలుస్తున్నది కానీ భారతీయులు మరుగుతున్న గిన్నెపై బట్టకప్పి ఆవిరిపట్టి ఉండవచ్చని భావిస్తారు. ఇండొనేషియన్లు అనేకరకాల పులియబెట్టే వంటకాలు వండేవారు. అందులో ఇడ్లీకి పోలికలున్న కేడ్లీ అనే వంటకము కూడా ఉంది. 800 - 1200 మధ్య కాలములో [[ఇండోనేషియా]]కు హిందూ రాజులతో పాటు వెళ్లిన వంటవాళ్లు, పులియపెట్టే పద్ధతులూ, అవిరిపెట్టే పద్ధతులతో పాటు వాళ్ల వంటకము కేడ్లీని దక్షిణ భారతదేశానికి తెచ్చారని ఒక భావన కానీ కచ్చితముగా నిర్ధారించుటకు ఆధారములు లేవు.
 
ఇడ్డెన అని తెలుగు దేశ్యపదం ఉన్నది. ఇప్పటికీ పల్లెటూరివాళ్ళు ఇడ్డెన, ఇడ్డెన్లు, ఇడ్నీలు అంటుంటారు. పల్లెటూరి వాడుక ప్రకారం ఇడ్నీ క్రమంగా ఇడ్లీ అయి ఉండవచ్చును. నలారానికి లకారం వాడుకలో ఉన్నది. తెనుగు;తెలుగు, మునగ;ములగ, లంజ;నంజ, చాలా;చానా ఇట్లాంటివి కొన్నుకొన్ని చూపవచ్చును. ఈ పద్దతిలో ఇడ్లీ ఏర్పడి ఉండాలి. ఇంతకీ ఇడ్డెన ఎలా ఏర్పడినది అన్న ప్రశ్నకి దువ్వెన, ఈర్చెన, నిచ్చెన, బచ్చెన వంటి పదాలతో ఇడ్డెనకు సామ్యం చూపవచ్చును. దువ్వు+ఎన దువ్వుటకు ఉపయుక్తమైన సాధనమని శబ్దరత్నాకరం అర్థం ఉన్నది. ఉబ్బు=ఉప్పు, ఉప్పు+ఎన= ఉప్పెన, దువ్వు+ఎన=దువ్వెన, వడ్డించు=వడ్డెన, వడ్డి+ఎన=వడ్డెన. కావున ధాతువుల ప్రకారం "ఎన" అనే కృత్ ప్రత్యయం వచ్చి కృదంతరూపం ఏర్పడుతుంది. దువ్వు అనే మాట క్రియ. దువ్వడం అనే పనిని తెలుపుతుంది. దీని మీద సదరు ప్రత్యయం వచ్చి దువ్వెన అయింది. దువ్వే సాధనము అని అర్ధం ఏర్పడింది. ఇట్లానే ఇడ్డెన ఏర్పడుతుంది? ఇడ్డెన అంటే వాసెన కుడుము అని అర్ధం. అనగా ఆవిరి కుడుము ఆని అర్ధమన్నమాట. సారాంశ మేమిటంటే ఇడ్లీ అనేది ఆవిరి గుడ్డమీద పెట్టి (ఇడి) ఉడికించిన పదార్ధం అన్నమాట.
 
ఇడు అంటే ఉంచు, పెట్టు అన్న అర్ధం. ఇడ్లీ పెట్టారు అంటాము. పెట్టడం (ఇడుట) ఇక్కడ ముఖ్యమన్నమాట. ఆవిరి గుడ్డపై పెడ్డనడినది (ఇడ్డ-) కాబట్టి ఇడు+ఎన అయివుంటుందని భావించవచ్చును. ఊతకోసం ఇడు డకారానికి ద్విత్వం చెప్పుకోవాలి. అప్పుడు ఇడ్డు+ఎన=ఇడ్డెన ఏర్పడుతుంది.
"https://te.wikipedia.org/wiki/ఇడ్లీ" నుండి వెలికితీశారు