వి. వి. గిరి: కూర్పుల మధ్య తేడాలు

Corrected as per English version
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 3:
'''వి.వి.గిరి'''గా ప్రసిద్ధుడైన '''వరాహగిరి వేంకటగిరి''' ([[ఆగష్టు 10]], [[1894]] - [[జూన్ 24]], [[1980]]), [[భారతదేశం|భారతదేశ]] నాలుగవ [[రాష్ట్రపతి]].
 
ఈయన అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలోని [[గంజాం జిల్లా]]కు చెందిన [[బెర్హంపూర్]] పట్టణంలోని [[వరాహగిరి వెంకట జోగయ్య]] ,సుభద్రమ్మ దంపతులకు ఒక [[తెలుగు]] నియోగి బ్రాహ్మణ కుటుంబములో జన్మించాడు. ఈ జిల్లా, పట్టణం ఇప్పుడు [[ఒడిషా]] రాష్ట్రములో ఉన్నాయి. వీరి తండ్రి [[వరాహగిరి వెంకట జోగయ్య]] ప్రసిద్ధిచెందిన న్యాయవాది. ఈయన తండ్రి తూర్పుగోదావరి జిల్లాలోని [[చింతలపూడి]] నుండి బరంపురానికి వలస వెళ్ళాడు.
 
1913లో ఈయన [[యూనివర్శిటీ కళాశాల డబ్లిన్]] లో న్యాయశాస్త్రం అభ్యసించడానికి వెళ్లాడు కానీ [[ఐర్లండ్]] లో [[సీన్‌ఫెన్ ఉద్యమము]]<nowiki/>లో పాల్గొని గిరి దేశ బహిష్కరణకు గురయ్యాడు. ఈ ఉద్యమకాలములోనే ఈయనకు [[ఈమొన్ డి వలేరా]], [[మైఖెల్ కోలిన్స్]], [[పాట్రిక్ పియర్సె]], [[డెస్మండ్ ఫిట్జెరాల్డ్]], [[ఈయోన్ మెక్‌నీల్]], [[జేమ్స్ కాన్నలీ]] తదితరులతో సన్నిహితము యేర్పడినది.
 
భారతదేశము తిరిగివచ్చిన తర్వాత క్రియాశీలముగా కార్మిక ఉద్యమములో పాల్గొని అఖిల భారత రైల్వే ఉద్యోగుల సమాఖ్యకు ప్రధాన కార్యదర్శి, ఆ తరువాత అధ్యక్షుడు అయ్యాడు. రెండు పర్యాయాలు అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రేసుకు అధ్యక్షునిగా కూడా పనిచేశాడు.
"https://te.wikipedia.org/wiki/వి._వి._గిరి" నుండి వెలికితీశారు