కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడు.
"Kusukuntla Prabhakar Reddy" పేజీని అనువదించి సృష్టించారు
(తేడా లేదు)

12:10, 11 ఆగస్టు 2021 నాటి కూర్పు

కూసుకుట్ల ప్రభాకర్ రెడ్డి (జననం 1965) తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడు. 2014-2018 మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ[1][2] తరపున మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు.[3]

తొలి జీవితం

ప్రభాకర్ రెడ్డి 1965లో జంగారెడ్డి, కమలమ్మ దంపతులకు నల్గొండ జిల్లా, సంస్థాన్ నారాయణపూర్‌ సమీపంలోని సర్వాయిల్ గ్రామంలో జన్మించాడు. హైదరాబాదులోని వివేక వర్ధిని కళాశాల నుండి బి.ఎడ్. విద్యను, నల్గొండలోని నాగార్జున కళాశాల నుండి బిఎస్సీ విద్యను పూర్తిచేశాడు.[4]

వృత్తి జీవితం

రాజకీయాల్లోకి రాకముందు కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసి, ఒక విద్యాసంస్థను కూడా ప్రారంభించాడు.[5]

రాజకీయ జీవితం

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన తన గురువు కల్లెం యాదగిరి రెడ్డితో కలిసి ప్రభాకర్ రెడ్డి 2002లో తెలంగాణ రాష్ట్ర సమితి చేరాడు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని రాష్ట్ర సాధన కోసం పోరాడాడు. మునుగోడు ప్రాంతంలో రాష్ట్ర సాధనకోసం జరిగిన అనేక ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రభాకర్ రెడ్డి, అక్కడి ప్రజలలో బాగా ప్రాచుర్యం పొందాడు. ప్రభాకర్ తల్లి ఫ్లోరోసిస్ బాధితురాలు. ఈ ప్రాంతంలో ఫ్లోరోసిస్ బాధితులు ఎక్కువగా ఉండేవారు.

ఎమ్మెల్యేగా

2014లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లావ్యాప్తంగా అత్యధికంగా 38,055 ఓట్ల మెజారిటీతో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ద్వారా నీటిలోని ఫ్లోరోసిస్ అంతం చేయడానికి, ఆరోగ్యం, విద్య మొదలైన ప్రధాన కార్యక్రమాల ప్రయోజనాలను మునుగోడు ప్రజలకు అందించడానికి ఆయన చురుకుగా పనిచేశాడు.

2018లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో మరోసారి టిఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 22,552 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

వ్యక్తిగత జీవితం

ప్రభాకర్ రెడ్డికి అరుణతో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.

మూలాలు

 

  1. Falling short of political will - The Hindu
  2. District reorganisation eased administration, says Jagadish Reddy
  3. Job mela in Telangana attracts 2,305 youth, 699 bag government jobs
  4. ‘Water for every house in Nalgonda by 2017 end’
  5. Bathukamma Sarees distribution begins in Telangana; over 1 crore sarees to be distributed