ముత్యము: కూర్పుల మధ్య తేడాలు

విస్తరించాను
పంక్తి 2:
'''ముత్యాలు''' ([[ఆంగ్లం]]: Pearl) ప్రకృతిలో లభించే [[నవరత్నాలు|నవరత్నాల]]లో ఒకటి. ఇవి [[మొలస్కా]] జాతికి చెందిన [[ముత్యపు చిప్ప]]లలో తయారవుతాయి. మొదటగా కొన్ని ఇసుక రేణువులు ముత్యపు చిప్పలోకి ప్రవేశిస్తాయి. అవి కలిగించే చలనం వలన ముత్యపు చిప్ప వాటిపైకి ఒక ప్రత్యేక మైన ద్రవ పదార్థాన్ని విడుదల చేస్తుంది. అది గట్టిపడి ముత్యంగా రూపాంతరం చెందుతుంది.ముత్యాలలో మంచి నీళ్ళలో ఏర్పడ్డవి, ఉప్పు నీళ్ళలో తయారైనవి రెండు రకాలున్నాయి. ఇవి చూడడానికి ఒకే రకంగా అనిపించినా వేర్వేరు స్థానాల నుంచి తయారవుతాయి.1900 దశకంలో కృత్రిమ పద్దతిలో ముత్యాలు తయారు చేయడం కనిపెట్టే దాకా ఇవి చాలా అరుదుగా లభ్యమయ్యేవి కాబట్టి సమాజంలో ధనికులు మరియు ఉన్నత వర్గాల వారికి మాత్రమే అందుబాటులో ఉండేవి.<ref>http://www.pbs.org/wgbh/nova/pearl/time.html</ref>. ఎక్కడి నుంచి వచ్చినా ఎలా ఏర్పడినా ఇవి తయారయ్యేది మాత్రం '''కాల్షియం కార్బొనేట్''' అనే పదార్థం తొనే. ఇవి కొన్ని గుండ్రంగానూ, కొన్ని ద్రవ బిందువుల ఆకారంలోనూ, కొన్ని అండాకారంలోనూ, కొన్ని అర్థ వృత్తాకారంలోనూ ఉంటాయి. వీటిలో గుండ్రంగా ఉన్నవి మరియు బిందువు ఆకారంలో ఉన్నవి ఎక్కువ ధర పలుకుతాయి. <ref>http://www.thepearlmarket.com/pearlformed.htm</ref>
 
==కొన్ని విశేషాలు==
ముత్యాల సాగు [[చైనా]], [[జపాన్]], [[మయన్మార్]], [[భారతదేశం]] వంటి దేశాలలో పెద్ద వ్యాపారం. ఇవి చూసేందుకు మృదువుగా కనిపించినా దాని నిర్మాణం పొరలు పొరలు గా ఉండటం చేత నలిపివేయడం లేదా పగులకొట్టడం కష్టమైన పని.<ref>http://www.moneymatters101.com/jewelry/howpearlsform.asp</ref>
==పురాణాలలో ముత్యం గురించి ప్రస్థావన==
ప్రాచీన [[ఈజిప్టు]] లో దీనికి ప్రముఖ స్థానం కల్పించినట్లుగా వారి చరిత్ర చెబుతోంది.<ref>http://www.pearldistributors.com/pearl-history-mythology.php</ref>.అతి ప్రాచీనమైన ముత్యంగా ప్రసిద్ధి గాంచిన '''జోమాన్''' [[జపాన్]] దేశానికి చెందింది. దీనికి 5500 సంవత్సరాల చరిత్ర ఉంది. చైనీయులు కూడా వారి ఆభరణాలలో ముత్యాలు వాడినట్లుగా 4000 సంవత్సరాల చరిత్ర కలిగిన వారి గ్రంధాలు తెలుపుతున్నాయి. ప్రాచీన చైనీయుల సంకేత భాషలో ముత్యము స్వచ్చతకు, విలువకు సంకేతంగా భావించేవారు. అప్పటి ప్రభుత్వాలు ముత్యాలను పన్ను రూపంలో చెల్లించడానికి కూడా అనుమతించేవి. ధనవంతులైన వారు చనిపోయినపుడు వారి నోట్లో ఒక ముత్యాన్ని ఉంచి ఖననం చేసేవారు.
 
==సహజ సిద్ధమైన ముత్యాలు==
పేరుకు తగ్గట్లుగానే ఇవి ఎవరిచేతనైనా పెంచబడకుండా వాటంతట అవే తయారవుతాయి. ఇప్పటికీ చాలాచోట్ల ముత్యాలు సహజంగానే ఏర్పడుతుంటాయి. కానీ వీటిని కనుగొనాలంటే ఎక్కడో సముద్రపు అడుగుభాగాన వెతకాల్సిందే. ఇప్పట్లో సహజ ముత్యాలను సంపాదించి ఒక హారాన్ని తయారు చెయ్యాలంటే దాదాపు అసాధ్యమైన పని.
"https://te.wikipedia.org/wiki/ముత్యము" నుండి వెలికితీశారు