"వికీపీడియా:రచ్చబండ" కూర్పుల మధ్య తేడాలు

 
సభ్యులకు అందరకూ నమస్కారం. కొంతకాలంగా వికీలో కొత్త సభ్యూల రచనలు గమనిస్తూ వచ్చిన నాకు ఒక విషయంలో అసంతృప్తి ఉంది. కొత్త వాడుకరులకు ప్రోత్సాహం ఇవ్వడం వికీలో మొదటి ప్రాధాన్యతా అంశం గా అనుకొనే స్థాయి నుండి నేడు అది కొరవడి ఆరోపణ, అనుభవాధికారం పెరుగుతున్నదిగా అనుకుంటున్నాను. వాటిలో రచన మొదలైన వెంటనే కొందరు సభ్యులు ఆ వ్యాసంలో మార్పులు చేయడం అనేది. సరాసరి వ్యాసంలో మార్పులు చేయకుండా వ్యాసం రాస్తున్న వాడుకరినిదానిపై వివరణ కోరి, లేదా సలహా అడిగి ఆపై వాడుకరి రాసిన దానినిబట్టి నిర్ణయం తీసుకోవాలి. కాని ఇక్కడ వాటికి వ్యతిరేకంగా వాడుకరి వ్యాసం రాస్తూ ఉన్నపుడు అత్యుత్సాహంతో అందులో మార్పులు చేయడం తగని పనిగా అనుకుంటాను. ఒకవేళ వ్యాసంలో పైన వ్యాసం పూర్తి కాలేదని కాని, సమయం కావాలి అని గాని ఇస్తే కూడా దానిపై మార్పులు చేయడం అంతే ఒక రకమైన అధికార భావం, లేదా అహంకార భావం ప్రదర్శించడంగా అనుకోవచ్చు.
అందుకే ఇలాంటి కొన్ని విషయాలపై పాలసీకొంతకాలంగా వికీకి సేవలు అందిచిన అనుభవంతో, అంతకు మించిన భాద్యతతో పాలసీలో కొన్ని మార్పులు కావాలని కోరుతున్నాను. అనగా
* కొత్త వాడుకరి లేదా అనుభవం ఉన్న వాడుకరి అయినా రాస్తున్నపుడు మద్యలో అ వ్యాస భాగాలను తొలగించరాదు
* కొంత సమయం అడిగినా లేదా వ్యాసంలో మార్పులు పూర్తి కాలేదని గాని ఉదహరింపు ఇచ్చిన తరువాత వ్యాసంలో బలవంతపు మార్పులు చేయరాదు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3313488" నుండి వెలికితీశారు