"వికీపీడియా:రచ్చబండ" కూర్పుల మధ్య తేడాలు

* ఇలా పదే పదే వ్యాసకర్తకు సమయం ఇవ్వకుండా ప్రతి చర్య ద్వారా వ్యాసభాగాల్ను తొలగించే వాడుకరిపై హెచ్చరిక, తదుపరి నిషేదం విధించడం అవసరం అనుకుంటాను.
ఇలాంటి కొన్ని సవరణలను తొలగింపు పాలసీల్లో చేర్చాలని అనుకుంతున్నాను. మీకేవైనా తొస్తే, దీనిపై సహ సభ్యూల అమూల్య అభిప్రాయాలు తెలియచేయాలని కోరుతున్నాను...[[వాడుకరి:B.K.Viswanadh|B.K.Viswanadh]] ([[వాడుకరి చర్చ:B.K.Viswanadh|చర్చ]]) 15:12, 12 ఆగస్టు 2021 (UTC)
 
ఈ దిగువ వ్యాసానికి సంభందించిన చర్చ కనుక వాడుకరి పేజీ నుండి ఇక్కడ చేర్చుతున్నాను..
 
 
[[వాడుకరి:Nskjnv|సాయి కిరణ్]] గారికి,
 
[[వాడుకరి:kalasagary|కళా సాగర్]] గారు ఇటీవలె జరిగిన ఒక వికీ సమావేశంలో [[వాడుకరి:Chaduvari|శిరీష్]] గారిని కలిసి, తన వద్ద స్థానిక కళాకారుల గురించి అపారమైన సమాచారం, ఫోటోలు ఉన్నవి అని, తన వద్ద ఉన్న సమాచారం తో వికీకి తోడ్పడాలని ఉందని, దీనిని నిశానిర్దేశం చేయవలసిందని కోరారు. అంతకు మునుపు కొన్ని ఏళ్ళ క్రితం, [[వాడుకరి:Rajasekhar1961|రాజశేఖర్]] గారి ప్రాజెక్టు [[వికీపీడియా:వికీప్రాజెక్టు/కళాసమాహారం|కళాసమాహారం]] లో భాగంగా [[ప్రాజెక్టు:చిత్రలేఖనం]] మొదలు పెట్టిన నాకు, కళాసాగర్ గారిని శిరీష్ గారు పరిచయం కుదిర్చారు. దీనిపై శిరీష్, రాజశేఖర్, [[వాడుకరి:Pavan santhosh.s|పవన్]] వంటి వారితో ఈ ప్రాజెక్టును, కళాసాగర్ గారి వద్ద ఉన్న సమాచారంతో ఎలా ముందుకు తీసుకువెళ్ళాలో కూలంకుషంగా చర్చించాను. సహ వికీపీడియను, కళాకారుడు అయిన [[వాడుకరి:విశ్వనాధ్.బి.కె.|విశ్వనాథ్]] గారి ఆధ్వర్యంలో వ్యాసరచన మొదలు పెట్టమని సలహా ఇచ్చాను.
 
* కళాసాగర్ గారు వ్రాసిన వ్యాసం ఇంకా పూర్తి కానే లేదు. ఇదే విషయాన్ని తెలుపుతూ వ్యాసం మొదట్లోనే ఆయన ట్యాగు కూడా ఉంచారు.
* వ్యాసం పూర్తి అయ్యి, తగు మూలాలు లేవని అనిపిస్తే, వ్యాసం చర్చా పేజీ లో దానిని సవాలు చేయటం సమంజసం అనుకొంటున్నాను. నిర్ధారిత సమయం లో మూలాలు చూపించలేకపోయిన చో, వ్యాసం తొలగించినా తప్పు లేదు.
* తమ వద్ద ఉన్న సమాచారం, ఫోటో ల పై నకలు హక్కులను ఉపసంహరించుకొని, వికీ కి సేవలను అందించాలని ఉన్నత భావాలతో పని చేసే వారిని నిరుత్సాహ పరచటం, వికీ నియమాలను విరుద్ధం కావచ్చు.
 
పై విషయాలను దృష్టిలో ఉంచుకొని, వ్యాస/వాడుకరుల తొలగింపు విషయం లో వేచి చూచే ధోరణి మంచిదని నా అభిప్రాయం!
 
[[వాడుకరి:Arjunaraoc|అర్జునరావు]] గారిని కూడా స్పందించవలసిందిగా అభ్యర్థిస్తున్నాను! - [[వాడుకరి:Veera.sj|శశి]] ([[వాడుకరి చర్చ:Veera.sj|చర్చ]]) 16:21, 12 ఆగస్టు 2021 (UTC)
 
నమస్కారం [[వాడుకరి:Veera.sj|శశి]] గారు, అయితే [[వాడుకరి:kalasagary|కళా సాగర్]] గారు తమ కృషిని నకలు హక్కులు ఉపసంహరించుకొని వికీలో చేర్చాలనుకున్నందుకు అభినందనలు, ధన్యవాదాలు. అయితే నిర్వాహక స్థాయిలో ఉన్న [[వాడుకరి:విశ్వనాధ్.బి.కె.|విశ్వనాథ్]] గారు లేదంటే [[వాడుకరి:Rajasekhar1961|రాజశేఖర్]] గారు ఈ వ్యాసాలను వికీలో చేర్చేటప్పుడు ఎలా చేర్చాలో , మూలలను చేర్చడం , విశ్వసనీయత గురించి తప్పక సూచించి ఉంటారని నమ్ముతున్నాను. అయితే ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి నిర్మిస్తున్న వ్యాసాలలో విశ్వసనీయత లేదు వీటికి సంబందించిన మూలాలు నేనే స్వయంగా చేరుద్దమని ప్రయత్నించగా ఈ వ్యాస అంశాలు గాని వ్యక్తుల గురించి గాని అంతర్జాలం లో ఎక్కడ దొరకలేదు. అలాగే ఈ వ్యాసాలలో వికీ శైలికి పూర్తి విరుద్దంగా గౌరవ , ప్రముఖ వంటి పదాలు ఉపయోగిస్తున్నారు.
ఈ అంశాలనన్నిటిని దృష్టిలో ఉంచుకొని కనీస ప్రమాణాలతో వ్యాసాలు నిర్మించాలి.
ఇక పోతే ఈ వ్యాసాలు నిర్మించడంలో [[వాడుకరి:kalasagary|కళా సాగర్]] ఉదారభావం ఏమాత్త్రం కనపడకపోగా, కేవలం ప్రచార దృక్పధంతో ఈ వ్యాసాలను నిర్మిస్తున్నట్టుంది.[[వాడుకరి:Nskjnv|కాలవిరాగ్య]] ([[వాడుకరి చర్చ:Nskjnv|చర్చ]]) 16:38, 12 ఆగస్టు 2021 (UTC)
 
::::[[వాడుకరి:Nskjnv|కాలవిరాగ్య]] నిర్వహకస్థాయి వాడుకరి వ్యాసాలు ఎలా చేర్చాలో అని అడిగారు. అంటే వ్యాసం రాస్తున్న 30 నిముషాల్లో మీరు స్పందించారు. అనగా మీకు అరగంటలో వ్యాసం పూర్తిగా అయిపోయి ఉండాలి. మూలాలు, విశ్వసనీయత, వికీశైలికి అనుగుణంగా మారిపోయి ఉండాలి. బహుశా వికీ రూల్స్ నాకు తెలియకుండా మార్పు చేసి ఉన్నారేమో అనుకుంటున్నాను. అలా . చేస్తే మాత్రం అరగంట లోపు పూర్తి వ్యాసం రాయలేకపోవడం నాతప్పే, రాస్తున్న వ్యాసంలో మీరు వచ్చి మీకు నచ్చిన విధంగా దిద్దుబాట్లు మొదలుపెట్తవచ్చు, తొలగింపులు చేయవచ్చు.. రాస్తున్న వ్యాసంలో ఏవైనా సందేహాలు సలహాలు ఉంటే ఆ యొక్క చర్చాపేజీలో రాయనక్కరలేదు. రాస్తున్న వ్యాసంలోనే మార్పులు చేయవచ్చు. సేవ్ చేసేటపుడు ఇద్దరం చేస్తున్నాం కనుక మీకు అవకాశం ఇచ్చి నేను ఉపసంహరించుకోవల్సిందే. వ్యాసంలోనే రాస్తున్న భాగాన్ని కాని భాగాలను కాని మీ ఇష్తప్రకారం తొలగించవచ్చు. పేజీని దారిమార్పులు లేదా వాడుకరి చర్చాపేజీగా మార్చేయవచ్చు. వ్యాసంపై సమయం కావాలని అడిగినా, లేదా వ్యాసభాగం పూర్తి కాలేదని రాసినా పట్టించుకోనక్కరలేదు. పైన ఉదహరింపును లెక్కచేయక మీ దిద్దుబాట్లను అధికారపూర్వకంగా కొనసాగించడం చేయవచ్చు. పూర్తి కాలేదని పెట్టిన నోట్ తొలగించి వ్యాసాన్ని తొలగింపుకు ప్రేతిపాదించవచ్చు. తదుపరి వ్యాసకర్త చర్యలను తోసిపుచ్చవచ్చు.
 
మునుపు జరిగిన ఒక సంగతి నాకు తెలియదు. అది వ్యాసం రాస్తున్న పత్రిక యొక్క సంపాదకుని వాడుకరి పేజీలోనూ "ఈ user page వికీపీడియా సత్వర తొలగింపు ప్రమాణాలకు సరిపోతూ ఉండి ఉండవచ్చు" అని మూస తగిలించారు. అంటే మీకు ముదుగా ఈ వాడుకరిపై వ్యక్తిగత స్పర్ధలేవైనా ఉన్నాయా, దానిపై తదుపరి వాడుకరి యొక్క జాల పత్రిక వ్యాసంపై దాడి జరుగుతున్నదా అనుకొనే అవకాశాలు నాకు కలిగాయి. ఇది ఒక వెబ్ పత్రికగా దీనికి పేజీ ఉండటానికి ఎందుకు తగినది కాదు. [[కూడలి (వెబ్ సైట్)]], [[టెక్ సేతు]], [[ఈమాట]], [[తెలుగు బాట]], [[పొద్దు], [[ప్రాణహిత (జాల పత్రిక)], [[వాకిలి]], [[చిమట మ్యూజిక్]] ఇలాంటి వాటిని పరిశీలించలేదా?, వాటికి వ్యాసాలు ఉన్నపుడు అలాంటి మాస, వార పత్రిక అయిన దీకి ఎందుకు స్థానం లేదు అనిపించింది. ఏదైనా గాని నాకు తెలియని విషయాలు ఏవైనా ఉంటే ఇటీవల అంతగా చురుగ్గ లేని నాకు ఎవరైనా కొంచెం ఓపిక, సహనం ఉన్న వాడుకరులు తెలియచేయప్రార్ధన..ధన్యవాదాలు[[వాడుకరి:B.K.Viswanadh|B.K.Viswanadh]] ([[వాడుకరి చర్చ:B.K.Viswanadh|చర్చ]]) 17:29, 12 ఆగస్టు 2021 (UTC)
 
 
 
::
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3313547" నుండి వెలికితీశారు