అహల్య: కూర్పుల మధ్య తేడాలు

→‎మూలాలు: Added citations
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
→‎శాపము: Added more info in ahalya curse, citation from vavikolanu subbarao
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 21:
[[File:Rama_releasing_Ahalya_from_curse.jpg|thumb|ఎడమ|రాముని పాదము రాయిని తాకిన తరువాత అహల్యగా మారుచున్నరాయి]]
ఒకరోజు అహల్య భర్తయైన [[గౌతముడు]] ఉదయాన్నే నదీ స్నానానికి వెళ్ళగా ఆమె మీద కోరికతో [[దేవేంద్రుడు]] ఆమె భర్త రూపంలో వచ్చి కోరిక తీర్చమని అడుగుతాడు. ఇంద్రుడి మోసం తెలిసీ అహల్య అందుకు అంగీకరిస్తుంది.(मुनि वेशम् सहस्राक्शम् विज्ञा रघुनन्दना - సంస్కృత రామాయణం, బాలకాండ, 48వ సర్గ, 19వ శ్లోకము). అదే సమయానికి గౌతముడు తిరిగివచ్చి ఆమెని శపిస్తాడు. “ ఇహవర్ష సహస్రాణి బాహూని నిసిశ్యసి.వాయు భక్ష్యా నిరాహారా తప్యాని భస్మశాయినీ. అదృశ్య సర్వ భూతానాంఆశ్రమే అస్మిన్ నివసిష్యసి” (సంస్కృత రామాయణం, బాలకాండము, 48వ సర్గ,30వ శ్లోకము.) అనగా, “బహు సంవత్సరాలునీవు గాలిని భక్షిస్తూ ఆహారము లేక తపస్సు చేసుకుందువు. నీపైన పరాగము(బూడిద) కప్పబడుతుంది. నీవెవరికీ కనబడవు. అదృశ్య రూపమున ఇక్కడనే తపస్సు చేసికొనుము. “ , [[త్రేతా యుగం]]లో మహా విష్ణువు [[శ్రీరాముడు|రాముని]] అవతారమెత్తి ఆయన పాదధూళిచే (ఆయన రాక వలన, దర్శనము వలన) ఆమెకు శాపవిమోచనం అవుతుందని తెలియబరుస్తాడు. (శ్రీమత్ ఆంధ్ర వాల్మీకి రామాయణము, యదాతథ అనువాదము, వావికొలను సుబ్బారావు గారు, 1932). అలాగే ఇంద్రుణ్ణి తన శరీరమంతా స్త్రీ జననేంద్రియాలతో నిండిపోయేలాగా శపిస్తాడు. వృషణాలు నేలరాలిపోయేటట్లు చేస్తాడు. కానీ ఇంద్రుడు ఇతర దేవతల సాయంతో ఒక జీవాన్ని బలి ఇచ్చి దాని వృషణాలను అతికించేటట్లు చేస్తాడు. అమ్మవారిని గురించి తపస్సు చేసి తన శరీరంపై ఉన్న స్త్రీ జననేంద్రియాలను కన్నులులాగా కనిపించేటట్లు వరం పొందుతాడు. అందుకనే ఆయన్ను సహస్రాక్షుడు అని కూడా వ్యవహరిస్తారు.
“ఇట్లు అహల్య శిలగానయ్యెనని కొన్ని గ్రంధములయందు గలదు. కానియది వాల్మీకి మతముగాదు. దుఃఖభావము లేక శిలవలె యుండిన, పాపఫలమేమి అనుభవించినట్లు? కావున నహల్య స్త్రీగానుండియే తపమాచరించెను. “ - వావికొలను సుబ్బారావు గారు, వాల్మీకి రామాయణ ఆంధ్ర అనువాద కర్త.
 
==విమోచనం==
"https://te.wikipedia.org/wiki/అహల్య" నుండి వెలికితీశారు