వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 225:
:: ఇకపై ఎవరి పట్లనైనా వ్యవహరించేప్పుడు నిర్వహణ వికీపీడియా విధానాలు, మార్గదర్శకాల ప్రకారమే కానియ్యండి, కాకపోతే "సదుద్దేశమేనని భావించడం" మాత్రం మరచిపోకండి. మరోమాటు చెప్తున్నాను - మీరు నిర్వహణ విషయంలో పాలుపంచుకోవడం తెలుగు వికీపీడియాకు నిస్సందేహంగా శుభసూచకం.
:: {{ping|B.K.Viswanadh}} గారూ, కొత్తవారిని ప్రోత్సహించాలన్నది చాలా సరైన ఆలోచన. కాకపోతే, కళాసాగర్ గారు వికీపీడియా రచనకు ఎలాగైతే కొత్తవారో, ఈ Nskjnv గారు వికీపీడియా నిర్వహణకు అలానే కొత్తవారు. పోనీ వికీపీడియా రచన వరకే చూసినా కూడా నాకు తెలిసినంతవరకూ గత డిసెంబరులోనే రాయడం మొదలుపెట్టారు. ఆయన చేసిన పొరబాటల్లా పైన వివరించినట్టు సదుద్దేశాన్ని ఆపాదించుకోకుండా కళాసాగర్ గారి విషయంలో వ్యవహరించడం. అది కూడా బహుశా ఆయనకు ఇంతకుముందు ఈ సదుద్దేశం ఆపాదించుకోవడం అన్న నియమం తెలిసివుండకపోవడం కారణం అనుకుంటున్నాను. ఎంతైనా కొత్త వ్యక్తి కాబట్టి.
::* ఐతే, దురదృష్టవశాత్తూ ఇంతటి నిర్వహణ అనుభవం ఉన్న మీరు కూడా Nskjnv విషయంలో సదుద్దేశమేనని భావించండి అన్న నియమాన్ని పాటించలేదు. ఒకవేళ పాటించి ఉంటే - మొదట Nskjnv చర్చా పేజీలోకి వెళ్ళి కళాసాగర్ గారి ఉద్దేశాల విషయంలో Nskjnv రాసింది ఫలానా నియమం ప్రకారం సరికాదని చెప్పివుండేవారు. అలానే, మీరు రాసిన వ్యాసంపై ఆయన తీసుకున్న చర్యల విషయంలో వికీపీడియా నియమాలను ప్రస్తావిస్తూ మీ అభ్యంతరం ఏమిటో తెలియపరిచేవారు.
::* అందుకు భిన్నంగా రచ్చబండలో నేరుగా చర్చకు పెట్టడం ఒక ఎత్తు అయితే "మీకు ముందుగా ఈ వాడుకరిపై వ్యక్తిగత స్పర్ధలేవైనా ఉన్నాయా, దానిపై తదుపరి వాడుకరి యొక్క జాల పత్రిక వ్యాసంపై దాడి జరుగుతున్నదా అనుకొనే అవకాశాలు నాకు కలిగాయి." అంటూ ఆయనకు దురుద్దేశాన్ని ఆపాదించారు. ఆఫ్‌కోర్స్ అది నాకు కలిగిన అభిప్రాయం మాత్రమేనని కూడా రాశారు. అసలు, అవతలి వ్యక్తి చర్యలు, వ్యాఖ్యలు సక్రమం కాకున్నా వికీ నియమం ప్రకారం మొట్టమొదట సదుద్దేశాన్ని ఆపాదించుకోవాలి కదా అది చేయలేదు.
::ఇకపైన అయినా మీరు Nskjnv గారు, అలాంటి భవిష్యత్ వాడుకరుల విషయంలో "సదుద్దేశమేనని భావించడం" అన్నది పాటిస్తారని ఆశిస్తున్నాను. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 07:38, 15 ఆగస్టు 2021 (UTC)
 
== Invitation for Wiki Loves Women South Asia 2021 ==
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు