ధన్వంతరి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
 
== భాగవతంలో గాధ==
[[భాగవతం]] అష్టమ స్కంధంలో [[క్షీరసాగర మధనం]] సమయాన ముందుగా హాలాహలం ఉద్భవించింది. దానిని మహాదేవుడు హరించాడు. కామధేనువు, ఉచ్ఛైశ్రవం, ఐరావతం, పారిజాతం, అప్సరసలు అవతరించారు. తరువాత [[లక్ష్మి|రమాదేవి]] అవతరించి [[విష్ణువు]] వక్షోభాగాన్ని అలంకరించింది. తరువాత ధన్వంతరి ఇలా అవతరించాడు.
 
"అప్పుడు సాగర గర్భంనుండి ఒక పురుషుడు, పీనాయుత బాహు దండాలను, కంబుకంఠాన్ని, పద్మారుణ లోచనాలను, విశాల వక్షఃప్రదేశాన్ని, సుస్నిగ్ధ కేశజాలాన్ని, నీల గాత్ర తేజాన్ని కలిగి, పీతాంబరం కట్టి, మణికుండలాలు ధరించి, పుష్పమాలా సమలంకృతుడై, హస్తతలాన అమృత కలశాన్ని దాల్చినవాడు ఆవిర్భవించాడు. అతని విష్ణుదేవుని అంశాంశ వలన పుట్టినవాడని, యజ్ఞభాగ భోజనుడు, ఆయుర్వేదజ్ఞుడు, మహనీయుడని బ్రహ్మాదులు గ్రహించి అతనికి "ధన్వంతరి" అని పేరు పెట్టినారు."<ref>"శ్రీమద్భాగవతము - సరళాంధ్ర పరివర్తన" - రచన:ఏల్చూరి మురళీధరరావు - ప్రచురణ: శ్రీరామకృష్ణమఠము</ref>
 
== మొట్టమొదటి వైద్యుడు ==
"https://te.wikipedia.org/wiki/ధన్వంతరి" నుండి వెలికితీశారు