విష్ణువు: కూర్పుల మధ్య తేడాలు

పరిమాణంలో తేడా ఏమీ లేదు ,  11 నెలల క్రితం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
[[దస్త్రం:Museum für Indische Kunst Dahlem Berlin Mai 2006 036 2.jpg|right|thumb|13వ శతాబ్దంలో కాంబోడియాకు చెందిన విష్ణువు విగ్రహం]]
 
"విష్" అనే ధాతువునుండి "విష్ణు" అనే పదానికి భాష్యకారులు అర్థం చెబుతారు. "విష్" అంటే సర్వత్ర వ్యాపించి ఉండుట, అంతటినీ ఆవరించి ఉండుట అనే అర్థాలున్నాయి. [[విష్ణు సహస్రనామ స్తోత్రం]] మొదటి శ్లోకంలో "విశ్వం, విష్ణుః, వషట్కారః, భూత భవ్య భవత్ప్రభుః, భూతకృత్, భూతభృత్, భావః, భూతాత్మా, భూత భావనః" అనే నామాలున్నాయి. "యద్ విషితో భవతి తద్ విష్ణుర్భవతి" - అంతటా ప్రవేశించి ఉండేవాడు విష్ణువు - అని నిరుక్తి అర్థం. "వేవేష్టి ఇతి విష్ణుః" అని శంకరాచార్యుల వ్యాఖ్యానం. "విశ్వం" అంటే అంతా తానైనవాడు. "విష్ణువు" అంటే అన్నియెడలా ఉండేవాడు. "భూత భవ్య భవత్‌ప్రభుః" అంటే గడచిన కాలానికి, జరుగుతున్న కాలానికి, రాబోయే కాలానికి కూడా ప్రభువు. భూత కృత, భూత భృత్, భావః, భూతాత్మా, భూత భావనః అంటే అన్ని భూతాలను (జీవులను) సృష్టించి, పోషించి, భరించేవాడు. అన్ని జీవులలోను ఉండేవాడు. ఈ నామ పదాలు హిందూ సంప్రదాయంలో విష్ణువుకు ఉన్న స్థానాన్ని క్లుప్తంగా చెబుతున్నాయనుకోవచ్చును. అనగా విష్ణువు కాలానికి, స్థలానికి, పదార్ధానికిపదార్థానికి అతీతుడు.<ref>Swami Chinmayananda's translation of Vishnu sahasranama pgs. 16-17, Central Chinmaya Mission Trust.</ref>
 
[[భాగవతం]] [[గజేంద్ర మోక్షం]] ఘట్టంలో గజేంద్రుని ప్రార్థన (నిరాకార) పరబ్రహ్మమును ఉద్దేశించి చేసినట్లు కనిపిస్తుంది. కాని విష్ణువు ఆ మొర ఆలకించి గజరాజును రక్షించడానికి పరుగున వచ్చాడు. అనగా ఆ ప్రార్థనలో చెప్పిన లక్షణాలు విష్ణువుకు అన్వయిస్తాయనుకోవచ్చును - అవి -
3,604

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3324878" నుండి వెలికితీశారు