"విష్ణువు" కూర్పుల మధ్య తేడాలు

→‎మత సాంప్రదాయాలు: వ్యాకరణం స్థిరం
(→‎పురాణేతిహాసాలలో విష్ణువు: అక్షర దోషం స్థిరం)
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
(→‎మత సాంప్రదాయాలు: వ్యాకరణం స్థిరం)
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
 
 
=== విశిష్టాద్వైతంలో విష్ణువు ===
విశిష్టాద్వైత ప్రవర్తకుడైన [[రామానుజాచార్యుడు]] క్రీ.శ. 1017లో జన్మించాడు. 1049లో సన్యాసం స్వీకరించాడు. [[విశిష్టాద్వైతం]] లేదా [[శ్రీవైష్ణవం]] ప్రకారం [[భగవంతుడు]] ఒక్కడే. అతడు సాకారుడు. అతడే నారాయణుడు. నిత్యానపాయిని అయిన [[లక్ష్మీదేవి]] నారాయణునినుండి వేరు కాదు. నిర్మలజ్ఞానానంద స్వరూపుడు. ఆ దేవదేవుడొక్కడే స్వతంత్రుడు. జీవి, ప్రకృతి పరతంత్రులు. పరమాత్మ నుండి ఆత్మ జన్మిస్తుంది. జీవాత్మ పరమాత్మ సన్నిధి చేరడమే మోక్షం. మోక్షానికి సాధనం అచంచలమైన విష్ణుభక్తి. భక్తితో పాటు ప్రపత్తి, అనగా మనసా వాచా కర్మణా భగవంతుని శరణాగతి పొందడం కూడా అత్యవసరం. మానవులందరూ సమానులు. మోక్షానికి అందరూ అర్హులు. కుల, లింగ విచక్షణ లేకుండా లక్ష్మీనారాయణులను పూజించి చక్రాంకితాలు చేయించుకొని, మంత్రోపదేశం పొంది ఊర్ధ్వపుండ్ర ధారణ చేసినవారందరూ శ్రీవైష్ణవులే.<ref name="krovi"/>
 
నారాయణుడే సృష్టి స్థితి లయాలకు మూలము. చిత్తు జీవుడు. అచిత్తు ప్రకృతి. ఇవి రెండూ ఆయన శరీరము. సూక్ష్మ చిదచిద్విశిష్టుడుగా ఉన్న పరమేశ్వరుడు స్థూల చిదచిద్విశిష్టుడు కావడమే సృష్టి. ప్రకృతి మూలంగానే ఈ జగత్తు అంతా సృజింపబడుతున్నది. శ్రీ మహావిష్ణువు వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ అనే [[చతుర్వ్యూహాలు]] దాల్చుతాడు. వాసుదేవుడు తన భక్తులపట్ల వాత్సల్యంతో ఐదు మూర్తులుగా గోచరిస్తాడు. అవి
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3324916" నుండి వెలికితీశారు