ఎఱ్రాప్రగడ: కూర్పుల మధ్య తేడాలు

→‎రచనలు: వ్యాకరణం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
→‎రచనలు: అక్షర దోషం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 40:
ఎఱ్ఱాప్రగడ [[కవిత్రయం]]లో మూడవ కవి, కాని ఆయన అనువదించినది మధ్య భాగము. నన్నయ మహాభారత అనువాదం [[అరణ్య పర్వం]] మధ్యలో ఆగిపోయింది. ఈ శేషభాగాన్ని మహాకవి [[తిక్కన]] ఏ కారణం చేతనో అనువదించలేదు. అలా మిగిలిపోయిన అరణ్య పర్వాన్ని తెలుగు లోకి ఎఱ్ఱన అనువదించాడు. అరణ్యపర్వములోని మొదటి మూడు ఆశ్వాసాలనూ, నాలుగవ ఆశ్వాసంలో 142 పద్యాలనూ నన్నయ వ్రాశాడు. తరువాత బహుశా నన్నయ మరణం కారణంగా ఆ కార్యం అక్కడితో ఆగిపోయింది. 143వ పద్యంనుండి ఎఱ్ఱన వ్రాశాడు. ఈ రచన బహుశా ప్రోలయ వేమునికాలంలోనే, హరివంశం రచన తరువాత, జరిగినట్లు అనిపిస్తుంది. ఈ విధంగా అరణ్యపర్వ శేషాన్ని కూడా ఆంధ్రీకరించడంతో తెలుగులో మహాభారత సమగ్రతను సాధించిన గౌరవం ఎర్రనకు దక్కింది. ఎర్రనకున్న సౌజన్యమూ, వినయమూ కారణంగా ఈ అరణ్యపర్వశేషాన్ని నన్నయ రచనతో కలిపే వ్రాసి, దానిని రాజరాజనరేంద్రునికే అంకితమిచ్చాడు. "ప్రయత్నించి తత్కవితా రీతియు గొంత దోప దద్రచనయకా నారణ్యపర్వశేషం" పూరించినట్లు చెప్పుకొన్నాడు."నన్నయభట్ట మహాకవీంద్రు సరస సారస్వతాంశ ప్రశస్తి తన్ను జెందుటయే" అందుకు కారణమని కూడా ఎర్రన చెప్పుకొన్నాడు.
 
అరణ్యపర్వశేషం ఎర్రన వ్రాయలేదనీ, నన్నయ పూర్తిగా వ్రాసినదానిలో కొంతభాగం పాడు కాగా దానిని ఎర్రన పూరించాడనీ ఒక వాదం ఉన్నది (ఉత్సన్నవాదము - శతఘంటం వేంకటరంగశాస్త్రి). అలా కాదు నన్నయ వ్రాసినదానిలో కొన్ని పద్యాలు చెదలు తినడంవల్ల లోపించాయనీ, వాటిని ఎర్రన పూరించాడనీ మరొక వాదం ఉన్నది (శిథిల పూరణ వాదము - నడికుదుటి వీరరాజు). కాని ఈ రెండు వాదనలూ నిర్హేతుకమైనవనీ, ఎర్రన నిస్సందేహంగా అరణ్యపర్వాన్ని పూరించాడనీ పండితులు అభిప్రాయానికి వచ్చారు. పైగా శైలి, భాషషావిషయకమైనభాషావిషయకమైన ఆధారాలద్వారా కూడా ఎర్రన స్వతంత్రరచనను కవులు నిర్ణయించారు. మూలరచనను గౌరవిస్తూనే ఎర్రన స్వతంత్ర రచనను సాగించాడు. అతని రచనలలో నన్నయ కథనా గమనాన్ని, తిక్కన నాటకీయతను,, ఎర్రన వర్ణనాత్మకతను గమనింపవచ్చును.
 
=== నృసింహపురాణము ===
"https://te.wikipedia.org/wiki/ఎఱ్రాప్రగడ" నుండి వెలికితీశారు