ఆపద్బాంధవుడు: కూర్పుల మధ్య తేడాలు

చి ఆపద్భాందవుడు ను, ఆపద్బాంధవుడు కు తరలించాం: అచ్చు తప్పు సవరణ
కొంచెం విస్తరణ
పంక్తి 8:
starring = [[చిరంజీవి]],<br>[[మీనాక్షీ శేషాద్రి]]|
}}
 
'''ఆపద్బాంధవుడు''', 1992లో విడుదలైన ఒక [[తెలుగు సినిమా]]. చిరంజీవి ఇందులో ఒక సున్నితమైన పాత్ర పోషించాడు. ఇది బాక్సాఫీసు వద్ద అంత విజయవంతం కాలేదు. అయితే మంచి కధాచిత్రంగా పేరు తెచ్చుకొంది. చిరంజీవికి ఈ సినిమాలో పాత్రకు నంది అవార్డు లభించింది.
 
 
==చిత్ర కధ==
మాధవుడు (చిరంజీవి) ఒక పల్లెలో పశువుల కాపరి. ఒక ఉపాధ్యాయుడి (జంధ్యాల) ఇంటికి నమ్మకమైన తోడు. ఉపాధ్యాయుని కూతురు హేమ (మీనాక్షి శేషాద్రి)కి మాధవుడు మంచి దోస్తు. మాధవుడు పశువులను కాస్తుంటాడు. నాటకాలలో వేషాలు కూడా వేస్తుంటాడు. హేమ తండ్రి మంచి కవి, కాని కవిత్వానికి ఆదరణ లేనందున ఆతని కవిత్వాన్ని ప్రచురించలేకపోతాడు.
 
 
హేమ అక్క ఒక జమీందారి కుటుంబం కోడలుగా వెళుతుంది. ఆ వివాహానికి మాధవుడు కొంత సహాయం (వారికి తెలియకుండా) చేస్తాడు. తరువాత తన పశువులన్నింటినీ అమ్మేసి (జంధ్యాల) కవితలను ముద్రింపిస్తాడు. అతని అభిమానానికి సంతోషించి ఆ కవి తన రచవలకు మాధవుని కృతిభర్తగా చేస్తాడు.
 
 
అక్కకు సాయంగా వెళ్ళిన హేమ బావ అత్యాచారానికి గురై పిచ్చిదైపోతుంది. ఆమెను కాపాడడానికి మాధవుడు పిచ్చివానిలో నటించి ఆమె ఉన్న పిచ్చాసుపత్రిలో చేరి ఎన్నో బాధలను సహిస్తాడు. పిచ్చి కుదిరిన హేమ తమ మధ్య అంతర్లీనంగా ఉన్న ప్రేమను గ్రహించి అతనిని పెళ్ళాడాలని కోరుకుంటుంది. తమ మధ్య ఉన్న అంతరాల కారణంగా మాధవుడు అది చాలా అనుచితమైనదని భావిస్తాడు. అయితే హేమను పెళ్ళి చేసుకోవాలనుకొన్న డాక్టరు (శరత్ బాబు) వారి మధ్యనున్న ప్రేమను గ్రహించి వారిని ఒప్పిస్తాడు.
 
 
 
 
 
[[en:Aapathbandhavudu]]
"https://te.wikipedia.org/wiki/ఆపద్బాంధవుడు" నుండి వెలికితీశారు