కాళోజీ నారాయణరావు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
పంక్తి 44:
కాళోజీ తెలుగు, [[ఉర్దూ భాష|ఉర్దూ]], [[హిందీ భాష|హిందీ]], [[మరాఠీ భాష|మరాఠీ]], [[కన్నడ భాష|కన్నడ]], [[ఆంగ్ల భాష|ఇంగ్లీషు]] భాషల్లో [[రచయిత]]గా ప్రఖ్యాతిగాంచాడు. రాజకీయ వ్యంగ్య కవిత్వం వ్రాయడంలో కాళోజీ దిట్ట. ‘నా గొడవ’ పేరిట సమకాలీన సామాజిక సమస్యలపై నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా, కటువుగా స్పందిస్తూ పాలకులపై అక్షరాయుధాలను సంధించి ప్రజాకవిగా కీర్తిగడించాడు. [[తెలంగాణ]] ప్రజల ఆర్తి, ఆవేదన, ఆగ్రహం అతను గేయాల్లో రూపుకడతాయి. [[విజాపుర|బీజాపూర్]] నుంచి [[వరంగల్ జిల్లా]]కు తరలివచ్చిన కాళోజీ కుటుంబం [[మడికొండ (గ్రామీణ)|మడికొండ]]లో స్థిరపడింది.<ref name="kaloji">{{Cite news|url=http://www.teluguwishesh.com/animuthyalu/212-andhra-great-people-animutyalu/55978-kaloji-narayana-rao-biography.html|title=Kaloji Narayana Rao Biography {{!}} Aanimuthyalu|last=Jagadeesh|date=2014-09-15|access-date=2018-01-20}}</ref>
 
ప్రాథమిక విద్యానంతరం [[హైదరాబాదు]] పాతబస్తీలోని [[చౌమహల్లా పాలస్|చౌమహల్]] న్యాయపాఠశాలలో కొంతకాలం చదివిన కాళోజీ, అటు తరువాత సిటీ కాలేజీ లోనూ, [[హనుమకొండ|హన్మకొండ]] లోని [[వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్|కాలేజియేట్ ఉన్నత పాఠశాల]] లోనూ చదువు కొనసాగించి మెట్రిక్యులేషను పూర్తిచేశాడు. [[1939]]లో [[హైదరాబాదు]]లో హైకోర్టుకు అనుబంధంగా ఉన్న న్యాయ కళాశాల నుంచి [[న్యాయశాస్త్రం]]లో పట్టా పొందాడు. [[1930]] నుంచే కాళోజీ [[గ్రంథాలయోద్యమం]]లో ఎంతో చురుగ్గా పాల్గొన్నాడు. తెలంగాణలోని ప్రతి గ్రామంలో ఒక గ్రంథాలయం ఉండాలన్నది కాళోజీ ఆకాంక్ష. సత్యాగ్రహోద్యమంలో పాల్గొని 25 సంవత్సరాల వయసులో జైలుశిక్ష అనుభవించాడు. నిజామాంధ్ర మహాసభ, హైదరాబాదు స్టేట్ కాంగ్రెసుతో కాళోజీ అనుబంధం విడదీయరానిది. [[1940]]లో రుక్మిణీబాయితో [[పెళ్ళి|వివాహం]] జరిగింది.<ref name="kaloji"/>
 
[[మాడపాటి హనుమంతరావు]], [[సురవరం ప్రతాపరెడ్డి]], [[జమలాపురం కేశవరావు]], [[బూర్గుల రామకృష్ణారావు]], [[పి.వి.నరసింహారావు]] వంటి వారితో కలిసి కాళోజీ అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడు. విద్యార్థి దశలోనే నిజాం ప్రభుత్వ నిషేధాజ్ఞలను ఉల్లంఘించి వరంగల్లులో గణపతి ఉత్సవాలు నిర్వహించాడు. తెలంగాణలో అక్షరజ్యోతిని వ్యాపింపజేయాలన్న తపనతో [[ఆంధ్ర సారస్వత పరిషత్తు]]ను స్థాపించిన ప్రముఖుల్లో కాళోజీ ఒకడు. రజాకార్ల దౌర్జన్యాన్ని ప్రతిఘటిస్తూ [[1945]]లో పరిషత్తు ద్వితీయ మహాసభలను దిగ్విజయంగా నిర్వహించడంలో కాళోజీ ప్రదర్శించిన చొరవ, ధైర్యసాహసాలను అతను అభిమానులు ఇప్పటికీ గుర్తుచేసుకుంటుంటారు. [[వరంగల్]] కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నించినందుకు అతనుకు నగర బహిష్కరణశిక్ష విధించారు. స్వరాజ్య సమరంలో పాల్గొని [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] విద్యార్థులు బహిష్కరణకు గురైనప్పుడు, వారిని [[నాగపూర్]] విశ్వవిద్యాలయంలో చేర్పించి ఆదుకోవడంలో కాళోజీ పాత్ర అనన్యం. [[1953]]లో తెలంగాణ రచయితల సంఘం ఉపాధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు. [[1958]]లో ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి శాసనమండలికి ఎన్నికయ్యాడు. [[కాకతీయ విశ్వవిద్యాలయం]] గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయగా, [[భారత ప్రభుత్వము|భారత ప్రభుత్వం]] [[పద్మ విభూషణ్ పురస్కారం|పద్మవిభూషణ్]] అవార్డుతో సత్కరించింది. ‘హింస తప్పు, రాజ్యహింస మరీ తప్పు’ అంటూ "సామాన్యుడే నా దేవుడు" అని ప్రకటించిన కాళోజీ [[2002]] [[నవంబరు 13]] న తుదిశ్వాస విడిచాడు. అతని మరణానంతరం అతను పార్థివ శరీరాన్ని కాకతీయ మెడికల్ కళాశాలకు అందజేసారు.<ref name="etelangana">{{Cite web|url=http://etelangana.org/tg_floks/poet_details/5|title=Kaloji Narayana Rao|website=etelangana.org|language=en|access-date=2018-01-20}}</ref>
"https://te.wikipedia.org/wiki/కాళోజీ_నారాయణరావు" నుండి వెలికితీశారు