మూసీ నది: కూర్పుల మధ్య తేడాలు

కాశీయాత్రా చరిత్ర లింకు
పంక్తి 1:
[[Image:Musi River Scene 1895.jpg|right|thumb|1895లో మూసీ నది దృశ్యం]]
'''మూసీ నది''' [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని దక్కన్ ప్రాంతములో [[కృష్ణా నది]] యొక్క ఉపనది. [[హైదరాబాదు]] నగరం మధ్యనుండి ప్రవహిస్తూ చారిత్రక పాత నగరాన్ని, కొత్త ప్రాంతం నుండి వేరుచేస్తూ ఉంటుంది. పూర్వము ఈ నదిని ''ముచుకుందా నది'' అని పిలిచేవారు.<ref>''[[కాశీయాత్రా చరిత్ర]]'' - ఏనుగుల వీరాస్వామయ్య</ref> హైదరాబాదు యొక్క త్రాగునీటి అవసరాలను తీర్చటానికి మూసీ యొక్క ఉపనదిపై [[హుస్సేన్ సాగర్]] సరస్సు నిర్మించబడింది.
 
మూసీనది హైదరాబాదు నగరానికి 90 కిలోమీటర్లు పశ్చిమాన [[రంగారెడ్డి జిల్లా]], [[వికారాబాదు]] వద్ద [[అనంతగిరి (వికారాబాదు)|అనంతగిరి]] కొండల్లో పుట్టి [[నల్గొండ]] జిల్లా, [[వాడపల్లి (దామరచర్ల మండలం)|వాడపల్లి]] (వజీరాబాద్) వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. 2,168 అడుగుల ఎత్తులో పుట్టి తూర్పు దిశగా ప్రవహించి హైదరాబాదు గుండా ప్రవహిస్తుంది. నగరాన్ని దాటిన తర్వాత మూసీలో చిన్నమూసీ నది మరియు అలేరు నదులు కలుపుకొని దక్షిణపు దిశగా మలుపు తిరుగుతుంది. ఆ తరువాత పాలేరు నదిని కలుపుకొని వజీరాబాదు వద్ద కృష్ణానదిలో కలిసేటప్పటికి 200 అడుగుల ఎత్తుకు దిగుతుంది. మూసీ నది యొక్క బేసిన్ వైశాల్యము 4,329 చదరపు మైళ్ళు. ఇది మొత్తం కృష్ణానది యొక్క బేసిన్ వైశాల్యములో 4.35%<ref>http://www.irrigation.ap.gov.in/volume1.pdf</ref> సాధారణంగా చిన్న వాగులాగా ప్రవహించే ఈ నది వరదలు వచ్చినప్పుడు భీభత్సము, అత్యంత జననష్టము కలిగించిన చరిత్ర కలదు.
"https://te.wikipedia.org/wiki/మూసీ_నది" నుండి వెలికితీశారు