రక్తపోటు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 9:
==రక్తపు పోటు అంటే ఏమిటి?==
 
మన గుండె పని చెయ్యాలి కాని ప్రయాస పడుతూ పని చెయ్యకూడదు. రక్తపు పోటు గుండె ఎంత కష్టపడి పనిచేస్తున్నాదో సూచిస్తుంది. రక్తనాళాల్లో ఉరకలు, పరుగులు తీస్తూ ప్రవహిస్తూన్న రక్తం అలల మాదిరి ప్రవహిస్తుంది. ఇలా పారుతున్న రక్తం నాళం గోడల మీద ఒత్తిడి (pressure) పెడుతుంది. ఈ ఒత్తిడి [[గుండె]]కి దగ్గరగా ఉన్నప్పుడు ఎక్కువగా ఉండి, దూరం వెళుతూన్న కొద్దీ క్రమేపీ తగ్గి, కేశనాళికల దగ్గర నెమ్మదిగా ప్రవహించి, ఆఖరున సిరలలో ప్రవేశించి నీరసించి, నెమ్మదిగా కండరాల సహాయంతో మళ్ళా గుండె చేరుకుంటుంది. కనుక శరీరం అంతటా పోటు ఒకేలా ఉండదు. [[వైద్యులు]] 'రక్తపు పోటు' అన్నప్పుడు ధమనులలో ఉన్న పీడనం (pressure). శరీరం అంతా ఈ పీడనం ఒకేలా ఉండదు కనుక సాధారణంగా జబ్బ మీద కొలుస్తారు. ఈ పోటు వేళని బట్టి, అప్పటి వరకు పడ్డ ప్రయాసని బట్టి, మనస్సులో ఉండే ఆరాటాన్ని బట్టీ, వేసుకుంటూన్న మందులని బట్టీ కూడా మారుతూ ఉంటుంది. కొందరికి వైద్యుడి పరికరాలు చూడగానే గుండె దబదబ కొట్టుకుని ఈ పోటు పెరుగుతుంది. ఇవన్నీ లెక్కలోకి తీసుకుని ఆరోగ్యంగా ఉన్న వ్యక్తుల రక్తపు పోటు 120/80 ఉంటుందని వైద్యులు నిర్ణయించేరు{{ఆధారం}}. ఈ విలువలు 135/85 దాటితే ఆ వ్యక్తి అధిక రక్తపు పోటుతో బాధ పడుతూన్నట్లు లెక్క<s>.</s> సాధారణంగా ఈ కొలతలు రెండు మూడు సార్లు తీసి, సంఖ్యలు ఎక్కువగా ఉంటేనే రక్తపు పోటు ఎక్కువయింది అని నిర్ణయిస్తారు.రక్తపోటు చికిత్స కోసం కొత్త ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO మార్గదర్శకం ప్రకారం రక్తపోటు సిస్టోలిక్ రక్తపోటు ≥140 mmHg, డయాస్టొలిక్ రక్తపోటు ≥90 mmHg కంటే అధికంగా ఉన్నపుడు<ref>{{Cite book|url=https://apps.who.int/iris/rest/bitstreams/1365359/retrieve|title=Guideline
for the
pharmacological
treatment of
hypertension
in adults|publisher=World Health Organization|year=2021|pages=19}}</ref> ( 140/90) ఫార్మకోలాజికల్ యాంటీహైపెర్టెన్సివ్ చికిత్సను ప్రారంభించాలని 25 ఆగస్టు 2021 న సిఫార్సు చేసినది<ref>{{Cite web|url=https://www.who.int/news/item/25-08-2021-more-than-700-million-people-with-untreated-hypertension|title=More than 700 million people with untreated hypertension|website=www.who.int|language=en|access-date=2021-08-27}}</ref>
 
ఇక్కడ ఉటంకించిన విషయాన్ని బట్టి రక్తపు పోటు కొలవటానికి రెండు సంఖ్యలు వాడతారని తెలుస్తోంది కదా. ఈ రెండింటిలో మొదటి సంఖ్య (ఎగువ ఉన్న సంఖ్య) సిస్టాలిక్‌ పోటు (systolic pressure), రెండవ సంఖ్య (దిగువ ఉన్న సంఖ్య) డయస్టాలిక్‌ పోటు (diastolic pressure). గుండె ముకుళించుకున్నప్పుడు రక్తం ఒక్క ఉదుటున ముందుకి వస్తుంది. అప్పుడు ఈ పోటు ఎక్కువగా ఉంటుంది. అదే సిస్టాలిక్‌ పోటు అంటే. గుండె వికసించుకున్నప్పుడు ప్రవాహం అంతిమ దశలో ఉంటుంది. అప్పుడు ఈ పోటు తక్కువగా ఉంటుంది. అది డయాస్టాలిక్‌ పోటు. పూర్వపు రోజుల్లో ఉష్ణోగ్రతనీ, రక్తపు పోటుని రస స్తంభం (mercury column) పొడుగుని బట్టి కొలిచేవారు. ఈ రోజుల్లో పాదరస స్తంభం వాడకుండానే కొలవ గలుగుతున్నారు.
"https://te.wikipedia.org/wiki/రక్తపోటు" నుండి వెలికితీశారు