హనుమకొండ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 87:
 
== ఆర్ధిక స్థితి గతులు ==
[[దస్త్రం:A road in warangal.JPG|thumb|right|వరంగల్లులో ఒక వీధి]]
వరంగల్ ఆర్థికంగా [[వ్యవసాయం]] మీద ఆధాపడి ఉంది. వరంగల్ సమీపంలో [[దేశాయిపేట]] వద్ద ఉన్న [[ఎనుమాముల]] గ్రామం వరంగల్ జిల్లా ధాన్యపు వాణిజ్య కేంద్రంగా ఉంది. ఇక్కడ [[ఎనుమాముల వ్యవసాయ మార్కెట్]] ఉంది. ఈ ప్రాంతం బియ్యపు వ్యాపారానికి ప్రధాన కేంద్రం. ప్రాంతీయ అవసరాలకు, వెలుపలి వాణిజ్యానికి అవసరమైన బియ్యం వ్యాపారం ఇక్కడ ప్రధానంగా జరుగుతుంది. 1990 వరకు ఈ ప్రాంతంలో పత్తి ఉత్పత్తి ప్రధానంగా జరిగింది. ఇటీవలి కాలంలో పత్తి ఉత్పత్తిలో సమస్యలు ఎదురైయ్యాయి. ఈ జిల్లాలో 1997-1998 మధ్య పత్తిరైతుల [[ఆత్మహత్య]]లు అత్యధికంగా నమోదు అయ్యాయి. ప్రస్తుత ప్రభుత్వం ఈ జిల్లాలో పరిశ్రమలకు ముఖ్యత్వం ఇవ్వడంలో శ్రద్ధవహించ లేదు. నిజాం కాలం నుండి సాగుతున్న కొన్ని పరిశ్రమలు మాత్రమే ఉన్నాయి. అజం జాహి క్లోత్ మిల్లు మూతపడింది. జిల్లాలో చిన్నతరహా పరిశ్రమలు మాత్రం నడుస్తున్నాయి. రెండవ స్థాయి నగరాలు సాంకేతిక రంగంలో జరుగుతున్న విప్లవాత్మక ఫలాలని అందునే ప్రయత్నంగా సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్ టి పి ఐ) వరంగల్ జిల్లాలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్థాపించాలని అనుకుంటున్నారు. చక్కని ప్రయాణ వసతులు, నాణ్యమైన విద్యాసంస్థల నుండి విద్యాభ్యాసం చేస్తున్న [[విద్యార్థులు]], మంచి భవనవసతులు, తక్కువగా ఉన్న వాహనాల రద్దీ, [[హైదరాబాదు]]కు అందుబాటు దూరంలో ఉన్న కారణంగా వరంగల్ ఇందుకు తగి ఉంది. విదేశాలలో స్థిరపడిన ప్రవాసభారతీయుల నుండి ఈ జిల్లాకు విదేశీ పెట్టుబడులు అందుతున్నాయి.
 
"https://te.wikipedia.org/wiki/హనుమకొండ_జిల్లా" నుండి వెలికితీశారు