పదహారేళ్ళ వయసు: కూర్పుల మధ్య తేడాలు

చి లింకులు చేర్చాను
→‎చిత్ర విశేషాలు: విస్తరణ పూర్తయింది
పంక్తి 15:
మిద్దే రామారావు తో అంగర సత్యం, అంగర లక్ష్మణ రావు కలిసి తెలుగులో ఈ చిత్రాన్ని నిర్మించారు. దర్శకుడిగా రాఘవేంద్రరావు అయితేనే దీనికి న్యాయం చేస్తాడని నిర్మాతలు భావించారు. అప్పటికే ఆయన అడవి రాముడు విజయంతో అగ్ర దర్శకుల జాబితాలో చేరిపోయాడు. రీమేక్ ని ఒప్పుకుంటాడా లేదా అన్న సందేహంతో నిర్మాతలు ఆయన్ను సంప్రదించారు. అప్పటికీ తమిళ చిత్రం చూసిన ఆయన సినిమా పై ఆసక్తి చూపించి చేశారు. శ్రీదేవినే నాయికగా తీసుకున్నారు. ఆమె 50,000 రూపాయలు పారితోషికం అడిగితే 35,000 రూపాయలు ఇచ్చారు నిర్మాతలు. చంద్రమోహన్ కి 17,000 మోహన్ బాబుకి 10,000 రూపాయలు ఇచ్చారు. సంగీత దర్శకుడు చక్రవర్తి మాతృక నుంచి ఒక్క బాణీనే తీసుకున్నాడు. అదే ''సిరిమల్లె పువ్వా'' అనే పాట. దీనిని [[జానకి]] గానం చేశారు. అప్పట్లో ఈ పాట అత్యంత ప్రజాదరణ పొందింది.
 
చిత్రం ప్రారంభం కాకమునుపే ఈ సినిమా వైపు పలువురు ఆసక్తి చూపించారు. తమిళ చిత్రం చూసి కమల్ చేసిన పాత్రపై [[శోభన్ బాబు]] కూడా మోజు పెంచుకున్నారు. అయితే గోచీ పెట్టుకుని, డీ గ్లామరస్ గా శోభన్ బాబు కనిపిస్తే బాగుండదని సినీ ప్రముఖులు చెప్పడంతో వెనక్కి తగ్గారు. అలాగే రజనీకాంత్ తెలుగులోనూ తానే నటించేందుకు ముందుకొచ్చారు. అయితే దర్శక నిర్మాతలు మాత్రం మోహన్ బాబును తీసుకున్నారు. ఈ సినిమా చేసే సమయానికి శ్రీదేవి వయసు 15 సంవత్సరాలు. దీనికి ముందు ఆమె [[అనురాగాలు]] అనే చిత్రంలో నటించింది. అది అంతగా ఆడలేదు. పదహారేళ్ళ వయసు సినిమాను ఎన్టీఆర్ కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. పూర్తయ్యాక శ్రీదేవిని తమ తదుపరి చిత్రం [[వేటగాడు]] కోసం ఎంపిక చేశారు. హిందీలో ఈ సినిమాకి భారతీరాజా దర్శకత్వం వహించారు. అక్కడా నాయిక శ్రీదేవే. అమాయకుడిగా అమోల్ పాలేకర్ నటించారు. అయితే ఇది అక్కడ అంతగా ప్రజాధరణ పొందలేదు.
<ref>ఆదివారం ఆగస్టు 31, 2008 ఈనాడు సినిమా ప్రచురించిన వార్త ఆధారంగా</ref>
 
"https://te.wikipedia.org/wiki/పదహారేళ్ళ_వయసు" నుండి వెలికితీశారు