పరిటాల రవి: కూర్పుల మధ్య తేడాలు

→‎హత్యలు: పంక్చువేషన్ సవరణలు
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 25:
}}
 
'''పరిటాల రవి''' ([[ఆగష్టు 30]], [[1958]] - [[జనవరి 24]], [[2005]]) (పరిటాల రవీంద్ర) ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, [[అనంతపురం జిల్లా]] [[పెనుగొండ]] మాజీ శాసన సభ సభ్యుడు, [[తెలుగు దేశం|తెలుగుదేశం]] పార్టీలో ప్రముఖ నాయకుడు.<ref>{{Cite book|url=http://sathyakam.com/pdfImageBook.php?bId=679#page/6|title=అస్తమించని రవి|last=ఖాదర్|first=మొహియుద్దీన్|publisher=నారాయణమ్మ ప్రచురణలు|year=2007|isbn=|location=అనంతపురం|pages=|access-date=2018-12-07|archive-url=https://web.archive.org/web/20190110172119/http://sathyakam.com/pdfImageBook.php?bId=679#page/6|archive-date=2019-01-10|url-status=dead}}</ref> 2005 లో ప్రత్యర్థుల దాడిలో మరణించాడు. ఆయన భార్య [[పరిటాల సునీత]] ,ప్రస్తుతం రాప్తాడు శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నది. రవి తండ్రి [[పరిటాల శ్రీరాములు]] కూడా ఒక ప్రజానాయకుడు. భూపోరాటాల్లో కొద్దిమంది భూస్వాముల చేతుల్లో ఉన్న బంజరు భూములను సాధారణ రైతులకు పంచేలా కృషి చేశాడు. ఈయన కూడా ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురయ్యాడు. పరిటాల శ్రీరాములు జీవితం ఆధారంగా దర్శకుడు [[ఎన్.శంకర్|ఎన్. శంకర్]] [[శ్రీరాములయ్య]] అనే సినిమా తీశాడు. రవి జీవితం నేపథ్యంలోనే [[రామ్ గోపాల్ వర్మ|రాం గోపాల్ వర్మ]] , [[రక్త చరిత్ర (సినిమా)|రక్త చరిత్ర]] (১ & ২)పేరుతో రెండు సినిమాలు తీశాడు.
 
==ఫ్యాక్షన్==
పంక్తి 31:
 
==హత్యలు==
భూస్వాములు, ఫ్యాక్షనిష్టులు పరిటాల రవీంద్ర మీద దృష్టిని సారించారు. అతనని వెంటాడి వేధించటం ప్రారంభంచారు. కష్టకాలంలో విప్లవ శిబిరం పరిటాల రవీంద్ర ఆశ్రయం కల్పించింది. పరిటాల శ్రీరాములు హత్య వెనుక కుట్ర జరిపిన ముఖ్యుడుని గుర్తించిన పీపుల్స్ వార్ పార్టీ [[మద్దెలచెరువు]] గ్రామానికి చెందిన మాజీ శాసనసభ్యుడు నారాయణ రెడ్డిని 1983లో కాల్చి చంపింది. ఈ హత్యకేసులో పరిటాల రవిని ప్రధాన ముద్దాయిగముద్దాయిగా చేర్చారు. అజ్ఞాత జీవితం గడుపుతూనే మొదటినుంచి తన కుటుంబానికి బాసటగా వుంటూ వచ్చిన జనాన్ని సంఘటితం చేసుకుంటూ వచ్చాడు పరిటాల రవీంద్ర. 1983 లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసరిగా కాంగ్రసేతర ప్రభుత్వాన్ని స్థాపించి తెలుగుదేశం పార్టీ చరిత్ర సృష్టించింది. [[ఎన్. టి. రామారావు]] ముఖ్యమంత్రి అయ్యాడు. రాష్ట్ర రాజకీయ వాతావరణంలో ఒక తాజాదనం వెల్లువిరిసింది. 1984లో పరిటాల రవీంద్ర తన స్వగ్రామం చేరుకున్నాడు. 1984 అక్టోబరు 27న ధర్మవరపు కొండన్నగారి పెద్ద కుమార్తె సునీతతో పరిటాల రవి పెళ్ళి జరిగింది. పరిటాల శ్రీరాములు హత్యకసులో ప్రధాన ముద్దాయి సిద్ధప్ప శిక్ష ముగించుకుని జైలునుంచి బైటకి వచ్చాడు. 1986లో పీపుల్స్ వార్ ఆగ్రహానికి గురై దుర్మరణం చెందాడు.
 
ఈ హత్యకేసులోను పరిటాల రవిని ముద్దాయి చేశారు. మళ్ళీ అజ్ఞాతంలో వెళ్ళిపోయి, [[కర్ణాటక రాష్ట్రం]]లోని వివిధ ప్రాంతాల్లో రహస్య జీవితం గడిపాడు. నక్సలైటు ఉద్యమ నిర్మాతల్లో ప్రముఖుడు కొండపల్లి సీతారామయ్యతో సన్నిహిత సాంగత్యం ఏర్పడింది. కేసు నుంచి బయటపడి తిరిగి వెంకటాపురం చేరాక, తన తండ్రి తమ్ముడు సాగించిన భూస్వామ్య వ్యతిరేక పోరాటాన్ని ఏదో ఒక రూపంలో ముందుకు తీసుకువెళ్ళటమే సరైన మార్గమని భావించాడు. ముఠాకక్షలను నిర్మూలించటమే తన జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాడు. అందుకు అవసరమైన సాధన సంపత్తులను సమకూర్చుకునే మార్గాల మీద దృష్టిని కేంద్రీకరించాడు. అనతికాలంలోనే పరిటాల రవికి తనదైన ఒక ప్రత్యేక రక్షణ వ్యవస్థ ఏర్పడింది. ప్రజానాయకుడుగా పరిటాల రవీంద్ర తొలి అడుగులు వేయటం ప్రారంభించాడు. రాష్ట్రంలో జరిగిన తొలి మండల వ్యవస్థ ఎన్నికలలో పరిటాల రవి మద్దతుతో [[రామగిరి]] మండల అధ్యక్షపదవికి రంగంలోకి దిగిన దళితుడు ఓబన్న అత్యధిక మెజారిటీతో ఘన విజయం సాధించాడు. అదే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలలో పరిటాల శ్రీరాములు హత్య, పరిటాల హరి బూటకపు ఎన్-కౌంటర్ ల వెనుక కీలకమైన వ్యక్తి సానే చెన్నారెడ్డి పెనుగొండ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలోకి దిగాడు. భారీ పోలీస్ బందోబస్తుతో ఎన్నికలు ప్రచారానికి వస్తున్నా చెన్నారెడ్డిని రామగిరి మండలంలో అడుగు పెట్టకుండా ఆత్మాహుతి దళంతో అడ్డుకున్నాడు పరిటాల రవీంద్ర. ఈ సంఘటన ఆ ప్రాంతంలోని బడుగు వర్గాల ప్రజలకు బలాన్నిచ్చింది. ఏడుసంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళి అధికారంలోకి వచ్చింది. కనుముక్కల గ్రామానికి చెందిన సానే చెన్నారెడ్డి శాసనసభ్యుడు అయ్యాడు. శాసనసభ్యుడిగా చెన్నారెడ్డి కక్షకట్టి తనకు వ్యతిరకంగా పనిచేసిన వారి మీద, ప్రధానంగా పరిటాల రవి మద్దతుదారుల మీద పెద్దఎత్తున దాడులు ప్రారంభించాడు. కుంటిమద్ది, గడిగకుంట, ఏడుగుర్రాలపల్లి వంటి అనేక గ్రామాల మీద మారణాయుధాలతో దాడులు జరిపించి బీభత్సం సృష్టంచాడు. అనేక కుటుంబాలను గ్రామాలనుండి తరిమేశాడు.
"https://te.wikipedia.org/wiki/పరిటాల_రవి" నుండి వెలికితీశారు