కొత్త సత్యనారాయణ చౌదరి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
 
==జీవిత చరిత్ర==
చౌదరి [[గుంటూరు]] జిల్లా [[తెనాలి]] తాలూకా [[అమృతలూరు]] గ్రామంలో బుచ్చయ్య చౌదరి మరియు రాజరత్నమ్మ దంపతులకు [[డిసెంబరు 31]], [[1907]] సంవత్సరంలో జన్మించాడు. ఇతడు ప్రాధమిక విద్య అమృతలూరు సంస్కృత పాఠశాలలో గావించాడు. అక్కడ భాషా ప్రవీణ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులై, [[చిట్టిగూడూరు]]లోని నరసింహ సంస్కృత కళాశాలలో చేరి [[1929]]లో ఉభయ భాషా ప్రవీణ పట్టా ప్రథమ శ్రేణిలో పొందినాడు. శ్రిమత్తిరుమల[[తిరుమల]] [[ గుదిమెళ్ళ వరదాచారి]] , [[దువ్వూరి వెంకటరమణ శాస్త్రి ]] ఇతడి గురువులు. కవిరాజు [[త్రిపురనేని రామస్వామి చౌదరి]] సాంగత్యంలో ఇతడి లోని సంఘ సంస్కరణ భావాలు బలపడ్డాయి. ఇతడు నిడుబ్రోలు ఉన్నత పాఠశాలలో తెలుగు పండితుడిగా, అనంతరం పాములపాటి బుచ్చినాయుడు కళాశాలలో [[తెలుగు]] ఉపన్యాసకులుగా ఉద్యోగం చేస్తూ రచనా వ్యాసంగం కొనసాగించాడు. [[1930]] లోనే భాషా పోషక గ్రంథ మండలి స్థాపించి దాని ద్వారా తన రచనలను ప్రకటించడం ప్రారంబించాడు. [[రామాయణ రహస్యాలు]] లాంటి
ఇతడి విమర్శక రచనలు జనసామాన్యంలోనే కాక, సాహితీలోకంలో సంచలనం సృష్టించాయి. తొలుత తెలుగు విద్యార్ధి మాసపత్రిక లోను, తదుపరి [[1961]] [[జూన్]] నుంచి [[భారతి]] మాసపత్రికలో కవిసామ్రాట్ [[విశ్వనాథ సత్యనారాయణ]] గారి రామాయకల్ప వృక్షం పై విమర్శల పరంపర కొనసాగించాడు. తదనంతరం కల్పవృక్ష ఖండనం గా ప్రచురించాడు.
ఆంధ్ర విశ్వకళా పరిషత్తు ఇతడిని [[1974]]లో [[కళా ప్రపూర్ణ]] పురస్కారంతో సన్మానించింది. పొన్నూరు, నిడుబ్రోలు పట్టణ ప్రజలు గజారోహణ సత్కారం చేశారు. ఇతడికి ఆరుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ఆదర్శ ఉపాధ్యాయులు, ఉత్తమ పండితులు, ఉదాత్త విమర్శకులు అయిన ఇతడు [[డిసెంబరు 15]], [[1974]] సంవత్సరంలో పరమపదించాడు.