దువ్వూరి సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు

+ వర్గాలు
విస్తరణ
పంక్తి 1:
[[భారతీయ రిజర్వ్ బాంక్]] గవర్నర్‌గా నియమితుడైన దువ్వూరి సుబ్బారావు [[పశ్చిమ గోదావరి]] జిల్లా [[ఏలూరు]]కు చెందిన తెలుగు వ్యక్తి. [[అమెరికా]]లోని ఓహియో విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఎస్.పట్టా పొందిన సుబ్బారావు [[1972]]లో సివిల్ సర్వీసు పరీక్షలో టాపర్‌గా నిలిచాడు. [[నెల్లూరు]] జాయింట్ కలెక్టర్‌గా, [[ఖమ్మం]] జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించాడు. ఆ తరువాత కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖలో జాయింట్ సెక్రటరీగాను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శిగాను పనిచేశాడు. ఇటీవలి వరకు ఆర్థిక కార్యదర్శిగా పనిచేసి ప్రస్తుతం [[భారతదేశం|భారతదేశపు]] కేంద్రబ్యాంకు అయిన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా నియమితులైనాడు.
==బాల్యం, విద్యాభ్యాసం==
దువ్వూరి సుబ్బారావు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జన్మించాడు. పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేసిన తండ్రి మల్లికార్జునరావుకు ఇతడు మూడవ సంతానం. కోరుకొండ సైనిక పాఠశాలలో హైస్కూలు విద్య పూర్తిచేసి బిఎస్సీకై సీఆర్ఆర్ కళాశాలలో ప్రవేశించాడు. [[1972]]లో సివిల్ సర్వీసు పరీక్షలో టాపర్‌గా నిలిచి <ref> ఈనాడు దినపత్రిక, పేజీ 2, తేది 02-09-2008 </ref> ఐఏఎస్ ఆమ్ధ్రా కేడర్ అధికారిగా తొలుత నెల్లూరు జాయింట్ కలెక్టర్‌గా, ఆ తరువాత ఖమ్మం జిల్లా కలెక్టర్‌గా పనిచేశాడు.
 
==మూలాలు==
 
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:రిజర్వ్ బ్యాంక్ గవర్నర్లు]]
[[వర్గం:పశ్చిమ గోదావరి జిల్లా ప్రముఖులు]]