మన దేశం: కూర్పుల మధ్య తేడాలు

2,944 బైట్లు చేర్చారు ,  1 సంవత్సరం క్రితం
 
కాంగ్రెస్ సమావేశానికి మధు అధ్యక్షత వహిస్తాడు. పోలీసులు ఆ సభను భగ్నం చేస్తారు. మధుకు దెబ్బలు తగులుతాయి. ఆగష్టు విప్లవంలో దెబ్బలు తగిలిన స్థితిలోనే మధు అరెస్ట్ అవుతాడు. దేశ స్వాతంత్ర్యం కోసం యువకులుపడే కష్టాలను ప్రత్యక్షంగా చూసిన శోభకు కనువిప్పు కలిగి తనూ రంగంలోనికి దూకుతుంది. తెగువగా సాహసాలు చేస్తుంది. పోలీసుల చేతికి చిక్కకుండా మెలుగుతుంది. రామనాథం కుటుంబం తిరిగి అగ్రహారం చేరుతారు. పోలీసులు శోభ కోసం రామనాథం ఇంటిని సోదా చేసి రామనాథాన్ని విద్రోహిగా అరెస్టు చేస్తారు. ఈ అన్యాయాన్ని చూస్తూ ఆవేశంతో యశోద కూడా అరెస్టు అవుతుంది.
 
పోలీసుల అత్యాచారాలు, లంచగొండి తనం పెరిగిపోతాయి. నెహ్రూ వంటి పిల్లలు కూడా పోలీసు లాఠీలకు గురవుతారు. ఆస్తులన్నీ కరిగిపోతాయి. జానకి ఎంత నిబ్బరంగా ఉన్నా ఈ యాతనతో చితికి పోయింది. రామనాథం, యశోద విడుదలై వచ్చే సరికి జానకి అపాయ స్థితిలో ఉంది. వదినను చూడడానికి మధు పెరోల్ మీద బయటికి వస్తాడు. వదినను విడిచిపోలేక గడువు ముగిసినప్పటికీ మధు ఖైదు కాకపోవడంతో పోలీసులు అతన్ని బలవంతంగా లాక్కొని పోతారు. ఆ సమయంలో జానకి మరణిస్తుంది. యశోద నిర్వేదంతో తీర్థయాత్రలకు వెళుతుంది.
 
కాంగ్రెస్ అధికార స్వీకారం, రాజకీయాలలో మార్పులు, డిటెన్యూల విడుదల, మధు పిచ్చివాడై తిరిగిరావడం జరుగుతాయి. శోభకూడా తిరిగి వస్తుంది. మధుకు స్వస్థత చేకూర్చడానికి శోభ, రామనాథం శాయశక్తులా ప్రయత్నించి విఫలమౌతారు. తీర్థయాత్రలనుండి తిరిగి వచ్చిన యశోద కొడుకు దుస్థితిని చూసి రామనాథాన్ని నిందిస్తుంది. రామనాథం మారుమాటాడక, కొడుకు నెహ్రూను చంకనెత్తుకుని ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. ఇంతలో తుఫాను రావడంతో మధు పరిస్థితిని జ్ఞప్తికి తెచ్చుకుని రామనాథం ఇంటికి తిరిగి వస్తాడు. మతి తప్పి మేడమీది నుండి క్రిందకు పడిపోయే మధును రక్షించుకుంటాడు. ఈ సంఘటనతో మధుకు తిరిగి పూర్వ జ్ఞానం వస్తుంది. స్వాతంత్ర్య దినోత్సవంలో కుటుంబ సభ్యులందరూ సంతోషంగా పాల్గొన్నారు.
 
==పాటలు==
74,503

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3354977" నుండి వెలికితీశారు