వినాయక చవితి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 96:
సూర్యుడు అస్తమించగానే తూర్పున కొన్ని చుక్కలు ఉదయించును. ఆ చుక్కలు రాత్రియంతయు ఆకాశాన మెరసి, సూర్యోదయమగు వేళకు పడమట అస్తమించును. అదేవేళకు మరికొన్ని చుక్కలు తూర్పున ఉదయించును. పున్నమినాడు సూర్యుడస్తమించే వేళకే చంద్రుడు తూర్పున ఉదయించును. అవేళ చంద్రోదయమప్పుడు తూర్పున ఏచుక్క ఉదయించునో ఆచుక్కను బట్టి ఆనెలకు పేరు ఏర్పడింది. ఈ విధంగా ఆయామాసములనుబట్టియు, కాలగతులనుబట్టియు చుక్కలు మన భూమిచుట్టును తిరుగుచున్నట్లు కనబడును. ఈ పరిభ్రమణ సందర్భాలలో కొన్ని చుక్కలు సుమారు రెండు వారాల కాలం సూర్యునితోనే ఉదయించి, సూర్యునితోనే అస్తమించుచూ, రాత్రులు ఏ వేళప్పుడు చూచినను మనకు కనబడవు. ఆ దినాలు ఆ నక్షత్రమునకు <nowiki>'''కార్తె''' దినం అందురు. సూర్యాస్తమైన తరువాత సూర్యోదయమగువరకును, రాత్రి ఏ వేళ చూచినను ఏ నక్షత్రపు కార్తెలో ఆనక్షత్రం మనకు కనబడదు. గ్రహముల విషయంలో ఈ కాలంను '''మూఢం'''</nowiki> అంటారు. మూఢం పోగానే ఇవి మరలా కనబడును.
 
ఏనుగు తొండం, లంబోదరం, ఎలుక వాహనంతో కూడిన నక్షత్రస్వరూపుడగు విఘ్నరాజు ఉత్తరాకాశాన ఆనాడు సూర్యోదయ పూర్వం తూర్పున ఉదయించును. తొలినాడు విఘ్నేశ్వర చవితి. మరునాడే ఋషిపంచమి. కాబట్టి [[సప్త ఋషులు]] ప్రక్కనే మనం విఘ్నేశ్వర నక్షత్రాలను చూడగలం. సప్త ఋషులు ఏడు కొంగలు ఎగురుచున్నట్లు కనబడునని [[భాసుడు]] వర్ణించాడు.పడమటి దేశాలవారు ఇవి నాగలి వలె ఉన్నవందురు. మరి కొందరు భల్లూకం-పెద్ద ఎలుగుబంటి (The Great Bear or Ursa Major) రూపంలో ఉన్నాయంటారు. ఈ విఘ్నేశ్వర నక్షత్రాలు (ఎలుక-ఏనుగు) కనిపిస్తున్నవని పలు శాస్త్రకారులు నిరూపించారు. Grimaldi రచించిన Catalogue of Zodiacs and Planispheres Etc. అనే గ్రంథంలో 31 పుటలో చీనా నక్షత్రటలముల పట్టికలో నెం146 రు నమోదులో ఎలుక రూపం గ్రంధ్స్థము చేయబడింది.
 
భూభ్రమణం మొదలగు అనేక కారణములవలన ఒకనాటి సూర్యోదయానికు ముందు ఉదయించిన నక్షత్రం మరునాడు నాలుగు నిముషాల ముందు ఉదయించును. పదునైదు దినాలలో 15 X 4 =60 నిముషాలు, అనగా ఒక గంటకు ముందు ఉదయించును.నెలరోజులలో రెండుగంటలు ముందు ఉదయించును.6 నెలలో 12 గంటలముందు ఉదయించును.అనగా సూర్యస్తమానం వేళకు తూర్పున ఉదయించును.కాగా, భాద్రపద శుద్ధచవితినాడు సూర్యోదయానికు ముందు తూర్పున ఉదయించిన విష్నేశ్వర నక్షత్రం చైత్రశుద్ధ చవితినాడు సూర్యాస్తమైన తరువాత తూర్పున కనబడును.కాబట్టి ఆనాడు వేదాలలో గణేశపూజ చేయమని చెప్పబడింది.
"https://te.wikipedia.org/wiki/వినాయక_చవితి" నుండి వెలికితీశారు