వినాయక చవితి: కూర్పుల మధ్య తేడాలు

→‎వినాయక చతుర్థి- జ్యోతిర్వేదం: అక్షర దోషం స్థిరం, వ్యాకరణం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 100:
భూభ్రమణం మొదలగు అనేక కారణములవలన ఒకనాటి సూర్యోదయానికు ముందు ఉదయించిన నక్షత్రం మరునాడు నాలుగు నిముషాల ముందు ఉదయించును. పదునైదు దినాలలో 15 X 4 =60 నిముషాలు, అనగా ఒక గంటకు ముందు ఉదయించును. నెలరోజులలో రెండుగంటలు ముందు ఉదయించును. 6 నెలలో 12 గంటలముందు ఉదయించును. అనగా సూర్యస్తమానం వేళకు తూర్పున ఉదయించును. కాగా, భాద్రపద శుద్ధచవితినాడు సూర్యోదయానికు ముందు తూర్పున ఉదయించిన విఘ్నేశ్వర నక్షత్రం చైత్రశుద్ధ చవితినాడు సూర్యాస్తమైన తరువాత తూర్పున కనబడును. కాబట్టి ఆనాడు వేదాలలో గణేశపూజ చేయమని చెప్పబడింది.
 
==== మాఘశుద్ధ చతుర్ధిచతుర్థి ====
లెక్క ప్రకారం చైత్రశుద్ధ చవితినాడే వినాయక నక్షత్రం సూర్యాస్తమయం కాగానే తూర్పున లభించవలసింది.కానీ విఘ్నేశ్వర నక్షత్రాలు, సప్తఋషువులును ధ్రువసమీపాన కానవస్తారు.ధ్రువునకును, ధ్రువుని చుట్టు అతిసమీపంలో ప్రదిస్ఖిణం చేయు లఘుఋక్షపు చుక్కలకును ఉదయాస్తమానాలు లేవు. అనక్షత్రాలకు సప్తఋషులును, విఘ్నేశ్వరనక్షత్రములును ఎంతో దూరమందు లేవు.క్రాంతి వృత్త స్థలమగు అశ్విని, భరణి, కృత్తిక మొదలగు నక్షత్రాలవలె తూర్పున ఉషఃకాల ప్రథమ దర్శనం మొదలు సాయం సమయ ప్రథమదర్శనంనకు మధ్య ఈ విఘ్నేశ్వరనక్షత్రంలకు 6 నెలలు గడిచిపోనక్కర్లేదు; సప్తఋషులు మఘనక్షత్రంతోనే ఉదయమగుదురు. ఆ ప్రక్కనున్న విఘ్నేశ్వరుడు అంతకుముందే ఉదయమగును.కనుక మాఘశుద్ధ చతుర్ధినాటికే ప్రత్యక్షంగా విఘ్నేశ్వరుని సాయంకాలాన సూర్యాస్తమానం కాగానే చూడగలుగుదుం.ఈ కారణం చేతనే మన పంచాంగకర్తలు గతానుగతకంగా మాఘశుద్ధ చతుర్ధినాడు గణేశపూజ విధించారు. కీ.శే. జ్యోతిశ్శాస్త్రపండితులు డి.స్వామికణ్ణుపిళ్ళై- దివాన్ బహుదూర్ ఈ మాఘశుద్ధ చవుతి గణేశచతుర్ధియని రాసారు
 
"https://te.wikipedia.org/wiki/వినాయక_చవితి" నుండి వెలికితీశారు