కాంటెంపరరీ ఆర్ట్: కూర్పుల మధ్య తేడాలు

→‎ఫోటో రియలిజం: కాన్సెప్చువలిజం
పంక్తి 15:
=== కాన్సెప్చువలిజం ===
కళను ఒక అమ్మదగిన వస్తువు గా పరిగణించటాన్ని కాన్సెప్చువలిజం తిరస్కరించింది. కళాఖండం కంటే, దాని నేపథ్యంలో ఉండే ఆలోచనకు కాన్సెప్చువలిజం మొదటి ప్రాధాన్యతను ఇచ్చింది. డామియెన్ హిర్స్ట్, ఐ వెయ్ వెయ్, జెన్నీ హోల్జర్ వంటి వారు కాన్సెప్చువలిజం ను అంది పుచ్చుకొన్నారు. 60వ దశకంలో పురుడు పోసుకొన్న ఈ శైలి ఇప్పటికి కూడా ఒక కాంటెంపరరీ కళా ఉద్యమంగానే పరిగణింపబడుతోంది.<ref name=":0" />
 
=== మినిమలిజం ===
కాన్సెప్చువలిజం వలె, మినిమలిజం కూడా 60వ దశకంలో నే మొదలు అయ్యింది. టాటె మ్యూజియం ప్రకారం మినిమలిజం, కాన్సెప్చువలిజం ఈ రెండూ కళను సృష్టించటనికి, పంచటానికి, చూడటానికి అప్పటి వ్యవస్థలను తిరస్కరించాయి. అయితే మినిమలిజం ఒక కళాఖండం దేనిని సూచిస్తోందో ఆలోచించమని కాకుండా; సారళ్యం, నైరూప్యం లోని అందం (abstract aesthetic) వీక్షకులను తాము చూసిన దానికి ప్రతిస్పందించమని ఆహ్వానిస్తుంది. డొనాల్డ్ జుడ్, సోల్ లెవిట్, డాన్ ఫ్లావిన్ లు మినిమలిజం శైలిలో చిత్రకళ చేశారు.<ref name=":0" />
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/కాంటెంపరరీ_ఆర్ట్" నుండి వెలికితీశారు