వికీపీడియా:రచ్చబండ (ప్రతిపాదనలు): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 311:
:మరొక్క సంగతి.. తెవికీలో ప్రణయ్ రాజ్ గారిది ఒక ప్రత్యేకమైన ప్రస్థానం. ఐదేళ్ళుగా నిరంతరాయంగా ఆయన రోజుకో వ్యాసం రాస్తూ ఉన్నారు. ఇది తెవికీలోనే కాదు, వికీమీడియా వికీల్లో మరే వికీలోనూ ఎవ్వరూ సాధించని ఘనత. వికీలో కొత్తగా రాసేవారికి స్ఫూర్తి నిచ్చి, ఉత్తేజపరచే అంశం. అంచేత దాన్ని స్వాగతం మూసలో చేర్చవచ్చునని నా అభిప్రాయం. __ [[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 06:47, 7 సెప్టెంబరు 2021 (UTC)
 
:@[[వాడుకరి:Nskjnv|Nskjnv]] గారు, తెవికీలో ఎక్కువ మంది సభ్యులు పెద్దగా పట్టించుకోని స్వాగత సందేశంపై ఆసక్తితో కొత్త ప్రతిపాదన చేయడాన్ని స్వాగతిస్తున్నాను. అయితే మీ ప్రతిపాదనకు నేపథ్యం అనగా స్వాగత సందేశం లక్ష్యాలు, ప్రస్తుత సందేశం బలాలు, బలహీనతలు తెలియపరచలేదు కావున మీ ప్రతిపాదనపై ఇంతకంటే ఎక్కువ వ్యాఖ్యానించలేకపోతున్నాను. మీరు గత పదిహేనేళ్లుగా స్వాగత సందేశం మారినతీరుని విశ్లేషించి, అలాగే ఇంగ్లీషు లేక ఇతర వికీలలో స్వాగత సందేశాలను పరిశీలించి, ప్రస్తుత స్వాగత సందేశంపై కొత్త వాడుకరుల స్పందనలను సమీకరించి, దాని ఫలితంగా ప్రతిపాదన చేసి సభ్యుల స్పందనలతో సవరించి మార్పుచేయటం మంచిదని నా అభిప్రాయం. [[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 06:18, 13 సెప్టెంబరు 2021 (UTC)