శ్రీశ్రీ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
==జీవిత గమనం==
[[బొమ్మ:SriSri.jpg|right|thumb|శ్రీశ్రీ విగ్రహం, హైదరాబాదులోని ట్యాంకుబండ్ పై, విగ్రహ వ్యాఖ్య: అభ్యుదయ కవితా యుగప్రయోక్త, సమసమాజ సంస్థాపనా ప్రవక్త]]
'''శ్రీశ్రీ''' 1910 ఏప్రిల్ 30 న పూడిపెద్ది వెంకటరమణయ్య, అప్పలకొండ దంపతులకు జన్మించాడు.<ref name="budaraju">{{cite booksfn|last1=రాధాకృష్ణ|first1=బూదరాజు|title=మహాకవి శ్రీశ్రీ|date=1999|publisher=కేంద్ర సాహిత్య అకాడమీ|location=న్యూఢిల్లీ|isbn=81-260-0719-2|edition=ప్రథమ ముద్రణ|url=https://archive.org/details/in.ernet.dli.2015.491503}}</ref> శ్రీరంగం సూర్యనారాయణకు దత్తుడగుట వలన ఇతను ఇంటిపేరు శ్రీరంగంగా మారింది. ప్రాథమిక విద్యాభ్యాసం [[విశాఖపట్నం]]లో చేసాడు. 1925లో ఎస్ ఎస్ ఎల్సి పాసయ్యాడు. అదే సంవత్సరం వెంకట రమణమ్మతో పెళ్ళి జరిగింది. 1931 లో [[మద్రాసు]] విశ్వ విద్యాలయంలో బియ్యే (జంతుశాస్త్రము) పూర్తి చేసాడు.
 
1935లో విశాఖ లోని మిసెస్‌ ఎ వి ఎస్‌ కాలేజీలో డిమాన్స్ట్రేటరుగా చేరాడు. 1938లో మద్రాసు [[ఆంధ్ర ప్రభ]]లో సబ్‌ ఎడిటరుగా చేరాడు. ఆ తరువాత [[ఆకాశవాణి]], [[ఢిల్లీ]] లోను, మిలిటరీ లోను, నిజాము నవాబు వద్ద, [[ఆంధ్ర వాణి]] పత్రికలోను వివిధ ఉద్యోగాలు చేసాడు. 1933 నుండి 1940 వరకు అతను రాసిన [[మహాప్రస్థానం]], జగన్నాథుని రథచక్రాలు, గర్జించు రష్యా వంటి గొప్ప కవితలను సంకలనం చేసి మహాప్రస్థానం అనే పుస్తకంగా ప్రచురించాడు. తెలుగు సాహిత్యపు దశనూ, దిశనూ మార్చిన పుస్తకం అది.
పంక్తి 57:
శ్రీశ్రీ వ్యక్తిత్వంలో ఎన్నో విరుధ్ధమైన భావాలు, విచిత్రమైన సంఘర్షణలు కనిపిస్తాయి. అతను మొత్తంగా బహిర్ముఖుడు. తీవ్రవిమర్శలకు, పసితనపు మాటలకు సమంగా ప్రసిద్ధుడు. సిద్ధాంతాల గురించి, తోటి కవుల గురించి అతను అభిప్రాయాలు అత్యంత వేగంగా, అతితక్కువ హేతుబద్ధంగా మారుతూండేవి. ఉద్యోగాల్లో ఇమడలేకపోవడం, మొదటి వివాహంలో పిల్లలు కలగకపోవడం, చివరి దశలో దాదాపు 50 ఏళ్ళ వయసు దగ్గరపడ్డాకే రెండో భార్యతో పిల్లలు పుట్టడం, సినిమాల్లో సంపాదించి, మొత్తం కోల్పోవడం, తన అస్థిరత వల్ల సాహితీసంఘాల్లో వివాదాలు రావడం ఇలా ఎన్నెన్నో ఒడిదుడుకులు అతను జీవితాన్ని తాకాయి. అతను గురించి జీవితచరిత్రకారుడు [[బూదరాజు రాధాకృష్ణ]] "శ్రీశ్రీతో ఏ కొంతకాలమైనా పరిచయం గల వారెవరైనా అతడు వయసొచ్చిన పసివాడనీ, అమాయకుడైనా చురుకైనవాడనీ, అహంకారి అయినా తలవంచుతుంటాడనీ, విచారణశీలి అయినా తప్పించుకు తిరుగుతాడనీ, ఆకర్షకుడైనా ఏడిపించనూగలడనీ అంగీకరిస్తారు. కొన్ని అభిప్రాయాల విషయంలో అతడు జగమొండి. సరదా పడ్డప్పుడు అతణ్ణి అదుపుచేయడం కష్టం. విపరీతాలోచనా ధోరణిలో ఉన్నప్పుడు అతడు క్రమశిక్షణకు లొంగడు. దాపరికం లేకపోవడం, ఆలోచనలోనూ స్వభావంలోనూ చాటూమరుగూ లేకపోవడం విస్పష్టం. మాటల్లో మాత్రమే అతడు భయంకరుడు. మరో విధంగా పోరాడలేడు. వాస్తవజీవితంలో అతడు సమస్త సాంప్రదాయిక పద్ధతులకూ కట్టుబడ్డాడు. కానీ తన విప్లవభావాలతో వాటినెప్పుడూ వ్యతిరేకిస్తుండేవాడు" వ్యాఖ్యానించాడు.
 
దాపరికంలేని స్వభావం వల్ల, అదొక చమత్కార ధోరణి అనుకోవడం వల్ల శ్రీశ్రీ స్వపర భేదం లేకుండా కఠోరమైన విమర్శలు, అనవసర వివాదాలకు కారణమైన వ్యాఖ్యలు ఎన్నో చేశాడు. పైగా అతను రాసిన ఆత్మకథ [[అనంతం]] సాధారణ పరిస్థితుల్లో ఎవరూ ఊహించని, పాఠకులకు మింగుడు పడని విడ్డూరమైన ప్రసంగాలతో నింపాడు. సమాచారం కూడా ఏ సందర్భశుద్ధీ లేకుండా నింపిన రచన అది. ఇవన్నీ కలిసి అతని వ్యక్తిత్వంపై ఎటువంటి వ్యతిరేక ప్రభావాలు వేసినా అతను ఆకర్షణను ఇసుమంతైనా తగ్గించలేదు. <ref name{{sfn|బూదరాజు|1999|p="budaraju"18}} />
 
=== విశ్వనాథ సత్యనారాయణ తో స్పర్థ ===
పంక్తి 85:
* "కొవ్వొత్తిని రెండువైపులా ముట్టించాను. అది శ్రీశ్రీలా వెలిగింది" - [[పురిపండా అప్పలస్వామి]]
* "తెలుగు కవిత్వ చరిత్రలో తిరుగు లేని మలుపు మహాప్రస్థానం" - డా. పాపినేని శివశంకర్.
* ''కనీసం వేయి సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగు సాహిత్యంలో కవితను ఇలా నిర్వచించి,ఇంత కవితాత్మకంగా వర్ణించి, ఇంత అద్భుత సృష్టి చేసిన మరో కవి లేనే లేడు. ఇదే అతణ్ణి సాహితీ శిఖరాగ్రాన నిలిపింది'' - [[బూదరాజు రాధాకృష్ణ]] <ref{{sfn|బూదరాజు|1999}} name="budaraju" />
* శ్రీశ్రీ పుట్టుకతో మనిషి, వృద్దాప్యంలో మహార్షి, మధ్యలో మాత్రమే కవి, ఏప్పటికీ ప్రవక్త. - వేటూరి ( శ్రీశ్రీ గారి మరణానంతరం ఈనాడు దిన పత్రికకు వేటూరి గారు వ్రాసిన వ్యాసం నుండి.)
 
పంక్తి 91:
<references />
 
{{cite book|last1=బూదరాజు|first1=రాధాకృష్ణ |title=మహాకవి శ్రీశ్రీ|year=1999|publisher=కేంద్ర సాహిత్య అకాడమీ|location=న్యూఢిల్లీ|isbn=81-260-0719-2|edition=ప్రథమ ముద్రణ|url=https://archive.org/details/in.ernet.dli.2015.491503}}
==ఇవి కూడా చూడండి==
* [[శ్రీశ్రీ రచనల జాబితా]]
"https://te.wikipedia.org/wiki/శ్రీశ్రీ" నుండి వెలికితీశారు