కోరాడ రామచంద్రశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

చి జనన మరణ తిథులు తారీఖులు చేర్చబడినవి. లింకు చేర్చబడినది.
చి డూప్లికేట్ citation deleted
పంక్తి 20:
 
==జీవిత విశేషాలు==
ఈయన యువ నామ సంవత్సర ఆశ్వయుజ శుద్ధ దశమి,  12అక్టోబర్  1815 లో [[అమలాపురం]] తాలూకాలోని [[కేశనకుఱ్ఱు]] గ్రామంలో జన్మించారు<ref name=":0" /><ref>{{Cite book|url=http://archive.org/details/korada-vamsa-prashasti|title=కోరాడ వంశ ప్రశస్తి - Korada Vamsa Prashasti|last=కోరాడ రామకృష్ణయ్య Korada Ramakrishnaiah|date=1951}}</ref>. తండ్రి పేరు లక్ష్మణశాస్త్రి. ఈయన నివాసమున్నది [[బందరు]]లో. శార్వరి నామ సంవత్సర శ్రావణ బహుళ పాడ్యమి, 11 ఆగస్టు 1900<ref name=":0" /> <ref>[రంగస్థల కరదీపిక-కంపా చెన్నకేశవరావు, శ్రీ [[పొట్టి శ్రీరాములు తెలుగువిశ్వవిద్యాలయం]] ప్రచురణ]</ref> నిర్యాణం చెందారు. ఈయన చాలా మంచి కవి అని మిత్త్రులు వివాహార్థ మెచ్చరించిరట. ఆసమయమున చిరపరిచయులగు శిష్టుకవిగారు [[రామచంద్రపురము]] రాజుగారికి "ఇతని నాస్థాన పండితునిగా గౌరవింపు" డని [[ఉత్తరము]] వ్రాసి ఇవ్వగా వారు దేశమున క్షామము వలన నీకవిని రెండు నెలలకంటే నెక్కువ పోషింపలేమని చెప్పిరట. ఆమాట రామచంద్రశాస్త్రికి నచ్చలేదు. [[మదరాసు]] పోయి యేదో యుద్యోగము సంపాదించుటకు సంకల్పించి ప్రయాణము సాగించెను. త్రోవలో [[మచిలీపట్టణము]]న ఆగవలసివచ్చి [[ఇంగువ రామస్వామి శాస్త్రి]] గారియొద్ద మంత్ర శాస్త్రమభ్యసించెను. అప్పుడు వఠ్ఠెం అద్యైత పరబ్రహ్మశాస్త్రి పాండిత్యశక్తి పరీక్షకు వాక్యార్దము చేయగా నందాయనను ధిక్కరించి పెళ్ళిచెడదీసికొని యింటికి బోయెను. ఆయన స్వస్థలము [[నడవపల్లి]]. ఆయూరివారు రామచంద్రశాస్త్రి సామర్ద్యము పరీక్షించుటకు శతావధానము చేయమనిరి. మహాకవితాధార కలిగిన వీరి కదియొక లెక్కా ! పద్యములు తడువుకొనకుండ నవధానమున జెప్పెనట. ఆపద్యములు మాత్ర మనుపలబ్ధములు.
 
క్రమముగా శాస్రిగారి పాండితీకవితా ప్రతిభలు నుతికెక్కినవి. [[బందరు]] నోబిల్ పాఠశాలలో నుద్యోగము లభించింది. అక్కడ 43 వత్సరములు పనిచేసిరి. దొరలు వీరి నైష్టికతకు నివ్వెఱపోయెడివారు. ఇత డెవ్వరిని లెక్కసేయలేదు. ఉద్యోగించిన నలువది మూడేండ్లలో ' ఈతప్పుచేసితి ' వని యధ్యక్షునిచే నాక్షేపింపబడలేదు. కళాశాలధ్యక్షుకు నీయనకు నొక శ్లోకార్దములో వ్యతిరేకాభిప్రాయములు వచ్చినవి. శాస్త్రులుగారు ముక్తకంఠమున "మీయర్ధము పొరపా"టని త్రోసివైచిరి. తాత్కాలికముగా అధికారికి క్రోధావేశము కలిగినను శాస్త్రులు గారి యధార్ధవాదిత కాయన తలయొగ్గక తప్పినదికాదు. వెనుక శ్రీ [[వీరేశలింగం పంతులు]]గారు [[రాజమహేంద్రవరము]]న ఆర్ట్సు కాలేజిలో తెలుగు పండితులు నుండునపుడు [[కస్తూరి శివశంకర శాస్త్రి]] గారిది సంస్కృతపండిత స్థానము. శాస్త్రిగారు పరీక్షాపత్రము సెస్సగా వ్రాసినవారికి నూటికి నూటపది మార్కులు వేయుచుండువారట. ప్రిన్సిపాలు ఇదేమి పాపమని యడుగగా, ఆ విద్యార్థి పుణ్యమని నిరంకుశముగా సమాధానించుచుండు వారట. మన రామచంద్ర శాస్రిగారి నైరంకుశ్య మాతీరులోనిదే.