రంగస్థలం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:సమంత నటించిన సినిమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
→‎కథ: అక్షర దోషాల సవరణ మరియు పాత్రల ఇళ్ల పేర్లు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 25:
 
== కథ ==
“రంగస్థలం” అనే గ్రామంలో 1980ల్లో జరిగే ఈ కథ చెల్లుబోయిన చిట్టిబాబు ([[రాం చరణ్ తేజ|రాంచరణ్]]) లారీ ప్రమాదానికి గురైన దక్షిణామూర్తి ([[ప్రకాష్ రాజ్]])ని ఆసుపత్రిలో చేర్చి తన గతాన్ని గుర్తుచేసుకోవడంతో మొదలవుతుంది.
 
చిట్టిబాబు రంగస్థలం గ్రామంలో వ్యవసాయ పొలాలకు నీరు పడుతూ జీవితం సాగిస్తుంటాడు. ఇతడికి వినికిడి సమస్య ఉంటుంది. ఎవరైనా గట్టిగా మాట్లాడితే తప్ప వినబడదు. తండ్రి కోటేశ్వరరావు ([[విజయ_నరేష్|నరేష్]]) ఒక దర్జీ. తల్లి కాంతమ్మ ([[రోహిణి (నటి)|రోహిణి]]), చెల్లి (యానీ/ [[Baby Annie]] ) ఉంటారు. పొలానికి నీరు పట్టేపెట్టే మోటరుమోటారును తన అత్త కొల్లి రంగమ్మ ([[అనసూయ భరధ్వాజ్|అనసూయ]]) ద్వారా పొందుతాడు. ఊరిలో తిరుగుతూ అందరిని ఇబ్బందిపెడుతూ ఓసారి తనను కూడాకూడ కాటేసిన ఓ నల్లత్రాచు పాముని చంపడం కోసం చిట్టిబాబు తిరుగుతుంటాడు.
 
ఇదిలావుండగా, రంగస్థలానికి పంచాయితీ ఎన్నికలు వస్తాయి. ముప్పైయేళ్ళుగా ఎదురులేకుండా ప్రెసిడెంటుగా ఉన్న ఫణీంద్ర భూపతి ([[జగపతిబాబు]]) ఈసారి కూడా ఎన్నికలకు నామినేషన్ వేస్తాడు. మరో ప్రక్క గ్రామంలోని సొసైటీ నుండి అప్పు తీసుకున్న రైతుల దగ్గర ఆ సొసైటీ వారు అడ్డగోలుగా వడ్డీలు వసూలు చేస్తుంటారు. కట్టలేని వారి పొలాలు జప్తు చేస్తుంటారు. ఆ సొసైటీ చేసే ఆకృత్యాలన్నింటి వెనుక ఫణీంద్ర భూపతే ఉంటాడు.
 
దుబాయిలో ఉన్న చిట్టిబాబు సోదరుడు కుమారబాబు ([[ఆది పినిశెట్టి]]) గ్రామానికి తిరిగొస్తాడు. ప్రతి శనివారం పట్నంలో తన ప్రియురాలు పద్మ (పూజిత పొన్నాడ)ను కలిసి వస్తుంటాడు కుమారబాబు. నల్లత్రాచు కోసం వెతికే క్రమంలో చిట్టిబాబుకి రామలక్ష్మి ([[సమంత]]) తారసపడుతుంది. మొదటి చూపులోనే రామలక్ష్మితో ప్రేమలో పడిపోతాడు చిట్టిబాబు. కానీ అతడికున్న వినికిడి సమస్యను రామలక్ష్మి ఎదుట తన స్నేహితుడు మహేష్మహేశ్ (మహేష్మహేశ్ ఆచంట) సాయంతో కప్పిబుచ్చే ప్రయత్నం చేస్తుంటాడు. రామలక్ష్మి పొలానికి ఓసారి నీరు పట్టి, ఆ తరువాత ఓ జాతరలో ఆమెని ఎగతాళి చేసిన కాశి (శతృశత్రు) తమ్ముళ్ళను కొట్టి ఆమెకి దగ్గరవుతాడు.
 
ఇదిలావుండగా, రంగస్థలంలో సోమరాజు (శేషు) అనే రైతు పొలాన్ని సొసైటీ వారు జప్తు చేయడంతో అతడు ఆత్మహత్య చేసుకోబోగా, చిట్టిబాబు అతడిని కాపాడతాడు. అతడికి జరిగిన అన్యాయం గురించి సొసైటీలో మాట్లాడడానికి వెళ్తాడు కుమారబాబు. అదే సమయంలో రామలక్ష్మి పొలాన్ని కూడా జప్తు చేశారని తెలుసుకొని లెక్కలు చూపించమని సొసైటీ వారితో గొడవపడతాడు కుమారబాబు. ఆ సమస్య పంచాయితీకి వెళ్తుంది, ఇరవై వేలు జరిమానా విధిస్తాడు ప్రెసిడెంటు. ఆ జరిమానా కట్టడానికి తమ పొలాన్ని అమ్మలేమని కోటేశ్వరరావు అనగా, ప్రెసిడెంటు అనుచరుడు శేషునాయుడుశేషునాయడు (అజయ్ ఘోష్) కోటేశ్వరరావు తల్లిని తూలనాడతడు. ఆ విషయం తెలుసుకున్న చిట్టిబాబు శేషునాయుడితోశేషునాయడితో గొడవపడి అతడిని చితకబాదుతాడు.
 
ఆ మరుసటిరోజు చిట్టిబాబుని పోలీసులు అరెస్టు చేస్తారు. తమ్ముడిని విడిపించడానికి కుమారబాబు ప్రెసిడెంటుని బ్రతిమాలినా లాభం లేకపోవడంతో వాళ్ళ ఎం.ఎల్.ఏ దక్షిణామూర్తి సిఫార్సుతో చిట్టిబాబుని జామీను మీద విడుదల చేయిస్తాడు. దక్షిణామూర్తి అండతో అతడి పార్టీ తరపునతరఫున రంగస్థలంలో ప్రెసిడెంటు ఆగడాలకు అడ్డుకట్ట వేయడానికి రాబోయే ఎన్నికల్లో ప్రెసిడెంటుగా నామినేషన్ వేస్తాడు కుమారబాబు. తమ్ముడు చిట్టిబాబుతో కలిసి తాము గొడవపడ్డ కాశిని కూడా కలుపుకొని ప్రచారం మొదలుపెడతాడు. ఊర్లో అందరూ సహకరిస్తున్నా, రంగమ్మ మాత్రం కుమారబాబుకి సహకరించదు. కారణమేంటని చిట్టిబాబు నిలదీయగా, రంగస్థలంలో ప్రెసిడెంటుకి ఎదురెళ్ళిన వారందరినీ ప్రెసిడెంటు చంపేశాడని, అందులో ఎర్ర శ్రీను (నోయెల్ సేన్), అబ్బులు, తన భర్త ([[రాజీవ్ కనకాల]]) కూడా ఉన్నారని చెబుతుంది. కుమారబాబు కూడాకూడ ప్రెసిడెంటుకి ఎదురెళ్ళి చావకూడదనే తమకువాళ్లకు సహకరించడం లేదని చెబుతుంది. ప్రెసిడెంటు గురించి ఇదివరకే గణపతి (చంద్రశేఖర్) చెప్పిన మాట కూడా నిజమని గ్రహించిన చిట్టిబాబు కుమారబాబుని కాపాడుకొనే ప్రయత్నంలో ఉంటాడు.
 
ఓ రోజు, ఊర్లో తనకు సహాయంగా వార్డు మెంబర్లుగా నిలబడడానికి సిద్ధపడ్డ వారందరూ తమ నామినేషన్లు వెనక్కి తీసుకోవడానికి బయలుదేరుతారు. కారణమేమిటని కుమారబాబు ప్రశ్నించగా, చిట్టిబాబు ప్రెసిడెంటు దగ్గర డబ్బు తీసుకున్నాడని, తమ ప్రాణాలకు ముప్పు రాకూడదని నామినేషన్లు వెనక్కి తీసుకోబోతున్నారని చెబుతారు. అందుకు చిట్టిబాబుతో గొడవపడి ఇకపై తన పనికి దూరంగా ఉండమని చెబుతాడు కుమారబాబు. ఓ రోజు తమ ఊర్లో కొత్త మనుషులు వచ్చారని గమనించిన చిట్టిబాబు కుమారబాబు కోసం ఆరా తీయగా, ఆ రోజు శనివారం కావడంతో, పద్మను కలవడానికి వెళ్ళాడని తెలుసుకుంటాడు. అక్కడినుండి తిరిగొస్తున్న కుమారబాబుని ప్రెసిడెంటు మనుషులు చంపబోగా, చిట్టిబాబు వారిని అడ్డుకొని అతడిని కాపాడుకుంటాడు. ఓ దుకాణం దగ్గర ఆగి, తగిలిన దెబ్బలకు రాయడానికి చిట్టిబాబు పసుపు తీసుకొని వచ్చేలోపు కుమారబాబు గొంతుపై కత్తిగాటుతో పడివుంటాడు. చనిపోయేముందు ఏదో పేరు చెబుతాడు కుమారబాబు. అది చిట్టిబాబుకి వినబడదు.
 
కుమారబాబు చావుకి ప్రతీకారంగా గ్రామ ప్రజలందరూ ఫణీంద్ర భూపతిపై తిరగబడతారు. కానీ అప్పటికే అతడు ఊరు వదిలి పారిపోతాడు. మరో ప్రక్క రంగస్థలానికి ప్రెసిడెంటుగా రంగమ్మ ఏకగ్రీవంగా ఎన్నికవుతుంది. ఆ రోజు జరిగే జాతరలో పాడే పాట ఆధారంగా చనిపోయే సమయంలో కుమారబాబు పలికిన పేరు “శ్రీమన్నారాయణ” అని తెలుసుకుంటాడు చిట్టిబాబు. దాని గురించి దక్షిణామూర్తితో మాట్లాడడానికి చిట్టిబాబు బయలుదేరడంతో కథ వర్తమానంలోకి వస్తుంది. ప్రమాదం జరిగి కోమాలోకి వెళ్ళిపోయినావెళ్ళిపోయిన దక్షిణామూర్తికి రెండేళ్ళ పాటు ఆసుపత్రిలోనే చిట్టిబాబు సేవలు చేయగా, ఓ రోజు కోమాలోంచి బయటపడతాడు.
 
ఓ రెండు నెలల తరువాత మంత్రిగా ఎన్నికైన దక్షిణామూర్తిని కలవడానికి రామలక్ష్మితో కలిసి అతడి ఇంటికి వెళ్తాడు చిట్టిబాబు. కుమారబాబు చనిపోయిన తరువాత పారిపోయిన ఫణీంద్ర భూపతిని అంజనం సాయంతో వెతికి చంపేశాననిచంపేసానని చెబుతాడు. కుమారబాబు చావుకి కారణం దక్షిణామూర్తని తనకు తెలిసిపోయిందని కూడాకూడ చెబుతాడు. చనిపోయే సమయంలో కుమారబాబు చెప్పిన శ్రీమన్నారాయణ (అమిత్ శర్మ) దక్షిణామూర్తి మనిషేనని, తన చిన్న కూతురు పద్మను ప్రేమించినందుకే కుమారబాబుని చంపించాడని చెబుతాడు. దక్షిణామూర్తి తన చేతుల్లోనే చావాలన్న ఉద్దేశ్యంతోనే ఇన్నాళ్ళు అతడికి సేవ చేశాననిచేసానని, ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్న దక్షిణామూర్తిని చంపడం సబబని చెబుతూ అతడి గొంతు కోసి చంపేస్తాడు చిట్టిబాబు.
 
రామలక్షిని తీసుకొని ఇంటి నుండి బయటికి వెళ్తూండగా, తన భర్తతో పద్మ లోపలికి అడుగుపెట్టడంతో కథ ముగుస్తుంది.
"https://te.wikipedia.org/wiki/రంగస్థలం_(సినిమా)" నుండి వెలికితీశారు