స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు''' [[పరకాల పట్టాభిరామారావు]] సంపాదకత్వంలో విడుదలైన [[తెలుగు]] పుస్తకం. దీన్ని 2000 సంవత్సరంలో [[విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్]] ప్రచురించింది.<ref>[https://archive.org/details/in.ernet.dli.2015.491591 భారత డిజిటల్ లైబ్రరీలో స్వాతంత్ర సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు పుస్తకం.]</ref>
 
భారత జాతీయోద్యమంలో [[భారత జాతీయ కాంగ్రెస్|కాంగ్రెస్]] వాదులే కృషిచేశారన్న అభిప్రాయం దురదృష్టవశాత్తూ చరిత్ర పుస్తకాలు కలిగిస్తున్నాయి. కమ్యూనిస్టుల ప్రస్తావన వచ్చినా విడిగా రావడమే గానీ స్వాతంత్ర్య సమరంలోని ప్రముఖులుగా చరిత్రలో రాదు. [[భగత్ సింగ్|భగత్‌సింగ్]] వంటి ప్రముఖ స్వాతంత్ర్య విప్లవ యోధులు కమ్యూనిస్టులే. ఐతే 1940ల్లో రెండవ ప్రపంచ యుద్ధాన్ని ప్రజాయుద్ధంగా అభివర్ణించి [[రష్యా]]ను మిత్రదేశమైన [[బ్రిటన్‌]]ను సమర్థించడం, ఆపైన [[భారత జాతీయ కాంగ్రెస్|కాంగ్రెస్]] చేసిన [[క్విట్ ఇండియా]] ఉద్యమాన్ని వ్యతిరేకించడం వంటి పరిణామాలు దీనికి కారణం కావచ్చు. కానీ అనంతర కాలంలో [[బొంబాయి]] నేవీ తిరుగుబాటు వంటి పోరాటాలలో కమ్యూనిస్టులు చురుకుగా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో కమ్యూనిస్టులు దేశ స్వాతంత్ర్యం కోసం చేసిన ప్రయత్నాలు, పోరాటాలను ఈ గ్రంథంలో వ్యక్తుల వారీగా రాశారు.
 
ఇందులో ఎక్కువ భాగం " నేనెలా స్వాతంత్ర్యోద్యమంలోకి, కమ్యూనిష్టు ఉద్యమంలోకి వచ్చాను " అన్న సంక్షిప్త స్వీయ కథనాలు. మరికొన్ని కామ్రేడ్లు మరణానంతరం ఇతరులు వ్రాసినవి. వీనిలో ఎక్కువభాగం 1995, 1996 [[కమ్యూనిజం]] ప్రత్యేక సంచికలలో ప్రచురించబడినవి.
 
==ఇందులోని దేశభక్తులు==
# కీ.శే. [[అమీర్ హైదర్ ఖాన్]] (స్వాతంత్ర్య సమరయోధులు - దక్షిణ భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ సంస్థాపకులు)
# కీ.శే. [[కంభంపాటి సత్యనారాయణ]] (సీనియర్) (స్వాతంత్ర్య సమరయోధులు - ఆంధ్రదేశంలో తొలి కమ్యూనిస్టు, మార్క్సిస్టు మేధావి, చరిత్రకారులు)
# కీ.శే. [[పుచ్చలపల్లి సుందరయ్య]] (స్వాతంత్ర్య సమరయోధులు - దక్షిణ భారతదేశంలోను, ఆంధ్రదేశంలోను కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత)
# కీ.శే. [[పోలేపెద్ది నరసింహమూర్తి]] (స్వాతంత్ర్య సమరయోధులు - రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ ప్రథమ కార్యదర్శులలో ఒకరు)
# కీ.శే. [[చండ్ర రాజేశ్వరరావు]] (స్వాతంత్ర్య సమరయోధులు - భారత కమ్యూనిస్టు పార్టీ అగ్రనాయకులు)
# కీ.శే. [[మద్దుకూరి చంద్రశేఖరరావు]] (స్వాతంత్ర్య సమరయోధులు - రాష్ట్ర కమ్యూనిస్టు నాయకులు)
# కీ.శే. [[రావి నారాయణరెడ్డి]] (స్వాతంత్ర్య సమరయోధులు - తెలంగాణా సాయుధ పోరాట అగ్రనాయకులు)
# కీ.శే. [[ఐదుకల్లు సదాశివన్]] (స్వాతంత్ర్య సమరయోధులు - రాయలసీమ కమ్యూనిస్టు ఉద్యమ పితామహుడు)
# కీ.శే. [[పి. వి. శివయ్య]] (స్వాతంత్ర్య సమరయోధులు - మార్క్సిస్టు మేధావి, అభ్యుదయ రచయిత, గుంటూరు జిల్లా కమ్యూనిస్తు ఉద్యమ నిర్మాత)
# [[నండూరి ప్రసాదరావు]] (స్వాతంత్ర్య సమరయోధులు - ఆంధ్ర రైతు ఉద్యమ అగ్రనాయకులు, మార్క్సిస్టు పార్టీ కురువృద్ధులు)
# [[పి. వి. రాఘవయ్య]] (స్వాతంత్ర్య సమరయోధులు - బెనారస్ కమ్యూనిస్టు గ్రూపు ప్రముఖులు, న్యాయవాది, శాంతి స్నేహ ఉద్యమ ప్రముఖులు)
# [[వై. వి. కృష్ణారావు]] (స్వాతంత్ర్య సమరయోధులు - అఖిల భారత కిసాన్ సభ అధ్యక్షులు)
# [[మోటూరు హనుమంతరావు]] (స్వాతంత్ర్య సమరయోధులు - ఆంధ్రప్రదేశ్ మార్క్సిస్టు పార్టీ అగ్రనాయకులు, ప్రజాశక్తి సంపాదకులు)
# కీ.శే. [[నీలం రాజశేఖరరెడ్డి]] (స్వాతంత్ర్య సమరయోధులు - రాష్ట్ర కమ్యూనిస్టు అగ్రనాయకులు)
# [[రాజ బహదూర్ గౌర్]] (స్వాతంత్ర్య సమరయోధులు - తెలంగాణా కమ్యూనిస్టు అగ్రనాయకులు, ట్రేడ్ యూనియన్ ప్రముఖులు, ప్రముఖ ఉర్దూ రచయిత)
# [[కె. ఎల్. మహేంద్ర]] (స్వాతంత్ర్య సమరయోధులు - తెలంగాణా పోరాట యోధులు, కమ్యూనిస్టు అగ్రనాయకులు, ట్రేడ్ యూనియన్ నాయకులు)
# [[బి. ధర్మభిక్షం]] (స్వాతంత్ర్య సమరయోధులు - తెలంగాణా పోరాట యోధులు, రాష్ట్ర కల్లుగీత కార్మికోద్యమ పితామహులు)
# [[ఎ. గురవారెడ్డి]] (స్వాతంత్ర్య సమరయోధులు - తెలంగాణా కమ్యూనిస్టు నాయకులు)
# కీ.శే. [[దొడ్డా నరసయ్య]] (స్వాతంత్ర్య సమరయోధులు - తెలంగాణా సాయుధ పోరాట యోధులు)
# [[పిల్లలమర్రి వెంకటేశ్వర్లు]] (స్వాతంత్ర్య సమరయోధులు - ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ యూనియన్ ఉద్యమ నాయకులు, తొలి కమ్యూనిస్టు శాసన సభ్యులు)
# [[వై. విజయకుమార్]] (స్వాతంత్ర్య సమరయోధులు - విశాఖ జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు)
# [[వేములపల్లి శ్రీకృష్ణ]] (స్వాతంత్ర్య సమరయోధులు - గుంటూరు జిల్లా కమ్యూనిస్టు నాయకులు, అభ్యుదయ రచయిత)
# [[ఎన్. శివరామిరెడ్డి]] (స్వాతంత్ర్య సమరయోధులు - రాయలసీమ కమ్యూనిస్టు ఉద్యమ సీనియర్ నాయకులు)
# కీ.శే. [[జోశ్యభట్ల సత్యనారాయణ]] (స్వాతంత్ర్య సమరయోధులు - రాష్ట్ర ట్రేడ్ యూనియన్ ప్రముఖులు)
# [[మహీధర రామమోహన్ రావు]] (స్వాతంత్ర్య సమరయోధులు - ముంగండ విశ్వసాహిత్యమాల సంస్థాపకులు. ప్రఖ్యాత నవలా రచయిత)
# [[చిర్రావూరి లక్ష్మీనరసయ్య]] (స్వాతంత్ర్య సమరయోధులు - ఖమ్మం జిల్లా మార్క్సిస్టు ప్రముఖులు)
# కీ.శే. [[ఏటుకూరి బలరామమూర్తి]] (స్వాతంత్ర్య సమరయోధులు - మార్క్సిస్టు అధ్యయన వేత్త, ప్రఖ్యాత చరిత్రకారులు)
# [[పరకాల పట్టాభిరామారావు]] (స్వాతంత్ర్య సమరయోధులు - విశాలాంధ్ర, కమ్యూనిజం పత్రికలలో సంపాదకులు, రచయిత)
# కీ.శే. [[మోదుమూడి శ్రీహరిరావు]] (స్వాతంత్ర్య సమరయోధులు - కృష్ణా జిల్లా కమ్యూనిస్టు నాయకులు)
# [[ఇందుకూరి సుబ్బరాజు]] (స్వాతంత్ర్య సమరయోధులు - పశ్చిమ గోదావరి జిల్లా కమ్యూనిస్టు నాయకులు)
# [[అల్లూరి వెంకట్రామరాజు]] (స్వాతంత్ర్య సమరయోధులు - తూర్పు గోదావరి జిల్లా కమ్యూనిస్టు నాయకులు)
# [[ముళ్లపూడి సూర్యనారాయణ]] (స్వాతంత్ర్య సమరయోధులు - తూర్పు గోదావరి జిల్లా కమ్యూనిస్టు నాయకులు)
# [[సి. వి. కె. రావు]] (స్వాతంత్ర్య సమరయోధులు - రాష్ట్ర ట్రేడ్ యూనియన్ నాయకులు, జిల్లాలో తొలితరం కమ్యూనిస్టు నాయకులు)
# కీ.శే. [[కొల్లా వెంకయ్య]] (స్వాతంత్ర్య సమరయోధులు - గుంటూరు జిల్లా కమ్యూనిస్టు నాయకులు)
# [[కోడుగంటి గోవిందరావు]] (స్వాతంత్ర్య సమరయోధులు - విశాఖ జిల్లా కమ్యూనిస్టు నాయకులు)
# కీ.శే. [[కారుమూడి సత్యనారాయణరెడ్డి]] (స్వాతంత్ర్య సమరయోధులు - పశ్చిమ గోదావరి జిల్లా కమ్యూనిస్టు నాయకులు)
# కీ.శే. [[మోటూరు పరంధామయ్య]] (స్వాతంత్ర్య సమరయోధులు - నల్లగొండ జిల్లా కమ్యూనిస్టు నాయకులు)
# కీ.శే. [[మహ్మద్ రజబలీ]] (స్వాతంత్ర్య సమరయోధులు - ఎమ్‌.ఎల్.ఎ., ఖమ్మం జిల్లా కమ్యూనిస్టు నాయకులు)
# [[కంభంపాటి మాణిక్యాంబ]] (స్వాతంత్ర్య సమరయోధురాలు - మహిళా నాయకురాలు)
# కీ.శే. [[చండ్ర సావిత్రీదేవి]] (రాష్ట్ర మహిళా ఉద్యమ ప్రముఖురాలు)
# [[ఆరుట్ల కమలాదేవి]] (తెలంగాణా స్వాతంత్ర్య సమరయోధురాలు - మాజీ ఎమ్‌.ఎల్.ఎ.)