అక్కిరాజు వాసుదేవరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
 
1977లో [[కోదాడ అసెంబ్లీ నియోజకవర్గం]] ఏర్పడిన తరువాత 1978లో [[జనతా పార్టీ|జనతాపార్టీ]] అభ్యర్థిగా పోటీచేసి కాంగ్రెస్ఐ అభ్యర్థి కె. లక్ష్మణ్‌రాజుపై 3,695 ఓట్ల మజారిటీతో గెలుపొందాడు. ఆ సమయంలో కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో కొంతకాలం తర్వాత మళ్ళీ కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్లాడు. 1983 తరువాత స్వచ్ఛందంగా రాజకీయాల నుంచి తప్పుకున్నాడు. అయుతే, కాంగ్రెస్‌పార్టీ నుండి టికెట్‌ ఇచ్చినప్పటికీ దానిని తన శిష్యుడైన చింతా చంద్రారెడ్డికి ఇప్పించాడు. ఆ సమయంలో కోదాడ ఎన్నికల బహిరంగ సభకు వచ్చిన మాజీ [[భారతదేశ ప్రధానమంత్రి|ప్రధాని]], కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షురాలు [[ఇందిరా గాంధీ|ఇందిరాగాంధీ]] బహిరంగ వేదిక పైనుంచే వాసుదేవరావు నిర్ణయాన్ని అభినందించింది. తరువాత ఆప్కాబ్‌ చైర్మన్, ఖాధీ భాగ్యనగర సమితి చైర్మన్‌ పనిచేశాడు.
 
ఆంగ్లంలో మంచి పట్టున్న వాసుదేవరావుకు జాతీయ స్థాయిలో కూడా మంచి గుర్తింపు వచ్చింది. జాతీయ నాయకులు రాష్ట్రానికి వచ్చినపుడు వారి ప్రసంగాలను తర్జుమా చేసేవాడు. 
 
== సేవలు ==