అక్కిరాజు వాసుదేవరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
 
== రాజకీయ జీవితం ==
భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరిన వాసుదేవరావు కీలకనేతగా ఎదిగాడు. 1962లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున [[హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం|హుజూర్‌నగర్‌ నియోజకవర్గం]] నుండి పోటిచేసి [[కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సి.పి.ఐ)|భారత కమ్యూనిస్టు పార్టీ]] అభ్యర్థి [[దొడ్డ నర్సయ్య]] పై 2,833 ఓట్ల మెజారిటీతో గెలుపొంది, [[కాసు బ్రహ్మానందరెడ్డి]] మంత్రివర్గంలో సమాచార శాఖ మంత్రిగా పనిచేశాడు. [[హైదరాబాదు|హైద్రాబాద్‌]]<nowiki/>లో [[అన్నపూర్ణ పిక్చర్స్|అన్నపూర్ణ]], [[రామకృష్ణ సినీ స్టూడియోస్|రామకృష్ణ స్టూడియో]]<nowiki/>లకు అనుమతులిచ్చాడు.1967లో జరిగిన ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్ అభ్యర్థిగా అదే నియోజకవర్గం నుండి రెండోసారి పోటిచేసి దొడ్డ నర్సయ్యపై 2,888 ఓట్ల మెజారిటీతో గెలుపొంది, [[పీవీనరసింహారావు|పీవీ నర్సింహారావు]] మంత్రివర్గంలో చిన్న నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశాడు. 1972లో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి [[కీసర జితేందర్‌రెడ్డి]] చేతిలో 14,308 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. కాంగ్రెస్ పార్టీని వీడి జనతా పార్టీలో చేరాడు.
 
1977లో [[కోదాడ అసెంబ్లీ నియోజకవర్గం]] ఏర్పడిన తరువాత 1978లో [[జనతా పార్టీ|జనతాపార్టీ]] అభ్యర్థిగా పోటీచేసి కాంగ్రెస్ఐ అభ్యర్థి కె. లక్ష్మణ్‌రాజుపై 3,695 ఓట్ల మజారిటీతో గెలుపొందాడు.<ref>{{Cite web|url=http://affidavitarchive.nic.in/affidavit/archive/march2004/pollupd/ac/states/s01/partycomp285.htm|title=State Elections 2004 - Partywise Comparision for 285-Kodad Constituency of ANDHRA PRADESH|website=affidavitarchive.nic.in|access-date=2021-09-24}}</ref> ఆ సమయంలో కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో కొంతకాలం తర్వాత మళ్ళీ కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్లాడు. 1983 తరువాత స్వచ్ఛందంగా రాజకీయాల నుంచి తప్పుకున్నాడు. అయుతే, కాంగ్రెస్‌పార్టీ నుండి టికెట్‌ ఇచ్చినప్పటికీ దానిని తన శిష్యుడైన చింతా చంద్రారెడ్డికి ఇప్పించాడు. ఆ సమయంలో కోదాడ ఎన్నికల బహిరంగ సభకు వచ్చిన మాజీ [[భారతదేశ ప్రధానమంత్రి|ప్రధాని]], కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షురాలు [[ఇందిరా గాంధీ|ఇందిరాగాంధీ]] బహిరంగ వేదిక పైనుంచే వాసుదేవరావు నిర్ణయాన్ని అభినందించింది. తరువాత ఆప్కాబ్‌ చైర్మన్, ఖాధీ భాగ్యనగర సమితి చైర్మన్‌ పనిచేశాడు.
 
ఆంగ్లంలో మంచి పట్టున్న వాసుదేవరావుకు జాతీయ స్థాయిలో కూడా మంచి గుర్తింపు వచ్చింది. జాతీయ నాయకులు రాష్ట్రానికి వచ్చినపుడు వారి ప్రసంగాలను తర్జుమా చేసేవాడు.