మైమ్ మధు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 28:
 
==జీవిత విశేషాలు==
[[వరంగల్‌]] జిల్లాలోని [[హన్మకొండ]] మండలానికి చెందిన [[భీమారం]] గ్రామంలో వినాయకచవితి ఉత్సవాలప్పుడు పదిహేడేళ్ల వయసులో ఏకపాత్రాభినయం చేశాడు మధు. అదే మధు మొదటి ప్రదర్శన. ఈ కళనే మైమ్ అంటారనీ అందులో శిక్షణ పొందే ఉద్దేశంతో మైమ్‌ కళలో పేరున్న ఓ వ్యక్తి దగ్గరికెళ్లాడు. శిష్యుడిగా చేరడానికి వెళ్ళాడు. కానీ ఆయన ఇతన్ని తిరస్కరించాడు. ఎలాగైనా మైం లో నైపుణ్యం సంపాదించుకోవాలనే పట్టుదలతో మైమ్‌ గురించి ఆరా తీశాడు. తమ ప్రాంతంలోనే పి. నాగభూషణం, కళాధర్‌ అనే కళాకారులున్నారనే విషయం తెలిసింది. నాగభూషణాన్ని ఒప్పించి ఆయన దగ్గర శిష్యుడిగా చేరాడు. మధుకు ఈయనే తొలి గురువు. మెళకువలు ఒంట పట్టించుకుంటూనే ఆయనతో కలిసి వందల ప్రదర్శనలిచ్చాడు.<ref name="మౌనమే నా భాష..">{{cite news |last1=ఆంధ్రజ్యోతి |first1=తెలంగాణ |title=మౌనమే నా భాష.. |url=https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-110284 |accessdate=24 September 2021 |work=andhrajyothy |date=16 May 2015 |archiveurl=https://web.archive.org/web/20210924180957/https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-110284 |archivedate=24 September 2021 |language=te}}</ref>
 
డిగ్రీలో ఉన్నపుడు అతడి కాలేజీలోని ''ప్రేక్షక సభ'' అనే ఓ సాంస్కృతిక సంస్థ రాష్ట్రస్థాయిలో నిర్వహించిన పోటీల్లో ఉత్తమ కళాకారుడిగా ఎంపికయ్యాడు. సరిగ్గా అదే సమయంలో భారత ప్రభుత్వం కోల్‌కతాలో జరిగే జాతీయ ఐక్యతా సమ్మేళనానికి ఇద్దరు కళాకారులను పంపమని ప్రేక్షకసభను కోరింది. ఆ ఇద్దరిలో ఒకడిగా వెళ్లాడు మధు. కోల్‌కతా లో పేరొందిన మైమ్‌ కళాకారుడు నిరంజన్‌ గోస్వామిని కలిసి ఆయన శిష్యుడిగా చేరాడు. ఆయనతో కలిసి దేశవ్యాప్తంగా ప్రదర్శనలిచ్చాడు.
"https://te.wikipedia.org/wiki/మైమ్_మధు" నుండి వెలికితీశారు