మైమ్ మధు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 30:
[[వరంగల్‌]] జిల్లాలోని [[హన్మకొండ]] మండలానికి చెందిన [[భీమారం]] గ్రామంలో వినాయకచవితి ఉత్సవాలప్పుడు పదిహేడేళ్ల వయసులో ఏకపాత్రాభినయం చేశాడు మధు. అదే మధు మొదటి ప్రదర్శన. ఈ కళనే మైమ్ అంటారనీ అందులో శిక్షణ పొందే ఉద్దేశంతో మైమ్‌ కళలో పేరున్న ఓ వ్యక్తి దగ్గరికెళ్లాడు. శిష్యుడిగా చేరడానికి వెళ్ళాడు. కానీ ఆయన ఇతన్ని తిరస్కరించాడు. ఎలాగైనా మైం లో నైపుణ్యం సంపాదించుకోవాలనే పట్టుదలతో మైమ్‌ గురించి ఆరా తీశాడు. తమ ప్రాంతంలోనే పి. నాగభూషణం, కళాధర్‌ అనే కళాకారులున్నారనే విషయం తెలిసింది. నాగభూషణాన్ని ఒప్పించి ఆయన దగ్గర శిష్యుడిగా చేరాడు. మధుకు ఈయనే తొలి గురువు. మెళకువలు ఒంట పట్టించుకుంటూనే ఆయనతో కలిసి వందల ప్రదర్శనలిచ్చాడు.<ref name="మౌనమే నా భాష..">{{cite news |last1=ఆంధ్రజ్యోతి |first1=తెలంగాణ |title=మౌనమే నా భాష.. |url=https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-110284 |accessdate=24 September 2021 |work=andhrajyothy |date=16 May 2015 |archiveurl=https://web.archive.org/web/20210924180957/https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-110284 |archivedate=24 September 2021 |language=te}}</ref>
 
డిగ్రీలో ఉన్నపుడు అతడి కాలేజీలోని ''ప్రేక్షక సభ'' అనే ఓ సాంస్కృతిక సంస్థ రాష్ట్రస్థాయిలో నిర్వహించిన పోటీల్లో ఉత్తమ కళాకారుడిగా ఎంపికయ్యాడు. సరిగ్గా అదే సమయంలో భారత ప్రభుత్వం కోల్‌కతాలో జరిగే జాతీయ ఐక్యతా సమ్మేళనానికి ఇద్దరు కళాకారులను పంపమని ప్రేక్షకసభను కోరింది. ఆ ఇద్దరిలో ఒకడిగా వెళ్లాడు మధు. కోల్‌కతా లో పేరొందిన మైమ్‌ కళాకారుడు నిరంజన్‌ గోస్వామిని కలిసి ఆయన శిష్యుడిగా చేరాడు.<ref name="All in good mime">{{cite news |last1=Deccan Chronicle |first1=Telangana |title=All in good mime |url=https://www.deccanchronicle.com/lifestyle/books-and-art/190218/all-in-good-mime.html |accessdate=24 September 2021 |publisher=Jaywant Naidu |date=19 February 2018 |archiveurl=https://web.archive.org/web/20190513064239/https://www.deccanchronicle.com/lifestyle/books-and-art/190218/all-in-good-mime.html |archivedate=13 May 2019 |language=en}}</ref> ఆయనతో కలిసి దేశవ్యాప్తంగా ప్రదర్శనలిచ్చాడు.<ref name="మాటలుండవు కానీ...!">{{cite news |last1=తెలుగు వెలుగు (రామోజీ ఫౌండేషన్) |first1=ముఖాముఖి |title=మాటలుండవు కానీ...! |url=https://www.teluguvelugu.in/vyasalu.php?news_id=MTIwMQ==&subid=NQ==&menid=Mg==&authr_id=NTcz |accessdate=24 September 2021 |work=www.teluguvelugu.in |publisher=దండవేణి సతీష్‌ |archiveurl=https://web.archive.org/web/20210924182259/http://www.teluguvelugu.in/vyasalu.php?news_id=MTIwMQ%3D%3D&subid=NQ%3D%3D&menid=Mg%3D%3D&authr_id=NTcz |archivedate=24 September 2021}}</ref>
 
తర్వాతి ప్రపంచమంతటా పేరున్న మైమ్‌ ఆర్టిస్ట్‌ టోనీ మోంటనారోతో కలిసి పని చేశాడు. యు.ఎస్‌. మైమ్‌ థియేటర్‌ మోంటనారో పేరు మీద ఏటా ఒక్కరికి స్కాలర్‌షిప్‌ ఇస్తుండేవాళ్లు. 2000లో ఆ స్కాలర్‌షిప్‌ ఎంపికయ్యాడు మధు. కానీ వెళ్ళడానికి అతని ఆర్థిక స్థోమత సరిపోలేదు. [[చిన్న జీయర్ స్వామి|చినజీయర్ స్వామి]] ఇతని ప్రదర్శన చూసి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేశాడు. ఈ సహాయంతో అమెరికాలో నెలరోజుల పాటు శిక్షణ పొందాడు. శిక్షణ పూర్తయ్యాక అమెరికాలోని అన్ని నగరాల్లో ప్రదర్శనలిచ్చాడు. మైమ్‌లో పరిపూర్ణత సాధించాలనే ఉద్దేశంతో ఇండియా తిరిగొచ్చాక యోగా నేర్చుకున్నాడు. [[హైదరాబాదు విశ్వవిద్యాలయము|హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం]] నుంచి రంగస్థల కళల్లో స్నాతకోత్తర విద్యను అభ్యసించాడు. కేరళ యుద్ధవిద్యయైన [[కలరిపయట్టు]] నేర్చుకున్నాడు. అప్పట్నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలిస్తూ ఉన్నాడు. ఇప్పటికి ఆ సంఖ్య వెయ్యి దాటింది.<ref name="Mime in the time of memes">{{cite news |last1=Telangana Today |first1=Telangana |title=Mime in the time of memes |url=https://telanganatoday.com/mimicry-in-the-time-of-memes |accessdate=24 September 2021 |publisher=Priyanka Pasupuleti |date=13 September 2021 |archiveurl=https://web.archive.org/web/20210924181818/https://telanganatoday.com/mimicry-in-the-time-of-memes |archivedate=24 September 2021}}</ref>
"https://te.wikipedia.org/wiki/మైమ్_మధు" నుండి వెలికితీశారు