స్వర్ణకమలం: కూర్పుల మధ్య తేడాలు

→‎పురస్కారాలు: తేదీ సవరణ
ట్యాగు: 2017 source edit
→‎నిర్మాణం: అభివృద్ధి
ట్యాగు: 2017 source edit
పంక్తి 48:
== నిర్మాణం ==
ఈ సినిమాలో కీలక భాగం కథానాయిక చుట్టూనే తిరుగుతుంది. ఈ పాత్రను భానుప్రియ పోషించగా, ఆమెకు స్ఫూర్తి కలిగించే పాత్రలో కథానాయకుడి పాత్రలో వెంకటేష్ నటించాడు.<ref>{{Cite news|url=https://www.thehindu.com/entertainment/movies/not-easy-to-be-at-centre-stage/article17456492.ece|title=Not easy to be at centre stage|last=Sripada|first=Krishna|date=2017-03-13|work=The Hindu|access-date=2021-04-15|language=en-IN|issn=0971-751X}}</ref><ref>{{Cite book|url=https://books.google.co.in/books?id=XAT4AgAAQBAJ&lpg=PT124&ots=wpZdKJNKg7&dq=Story%20behind%20swarnakamalam%20movie&pg=PT124#v=onepage&q=Story%20behind%20swarnakamalam%20movie&f=false|title=History of Indian Cinema|last=Saran|first=Renu|date=2014-03-04|publisher=Diamond Pocket Books Pvt Ltd|isbn=978-93-5083-651-4|language=en}}</ref>
ఈ సినిమాలో కథానాయికకు స్ఫూర్తిని కలిగించే నర్తకి పాత్రలో షారన్ లోవెన్ తన నిజ జీవిత పాత్రలో నటించింది.<ref>{{Cite news|url=https://www.thehindu.com/features/friday-review/sharon-lowen-an-envoy-of-indian-culture/article8649957.ece|title=Sharon Lowen, an envoy of Indian culture|last=Kumar|first=Ranee|date=2016-05-26|work=The Hindu|access-date=2021-04-12|language=en-IN|issn=0971-751X}}</ref> మొదట్లో ఈ పాత్రకు [[యామినీ కృష్ణమూర్తి|యామిని కృష్ణమూర్తి]], సంయుక్త పాణిగ్రాహి మొదలైన వారిని అనుకున్నారు. ఈమె ఒడిస్సీ గురువు కేలూచరణ్ మొహాపాత్రా శిష్యురాలు.<ref>{{Cite web|url=https://scroll.in/reel/836013/telugu-filmmaker-k-vishwanath-reinvented-the-song-and-dance-film-like-no-other|title=Telugu filmmaker K Vishwanath reinvented the song and dance film like no other|last=Sai|first=Veejay|website=Scroll.in|language=en-US|access-date=2021-09-27}}</ref> ఒకసారి షారన్ దూరదర్శన్ కి ఇచ్చిన ముఖాముఖిలో ఆమెను చూసిన చిత్రబృందం ఆ పాత్ర ఈమెకు సరిపోతుందని భావించారు. ఆమెకు తర్వాత వేరే సినిమాల్లో నటించడానికి అవకాశాలు వచ్చినా మళ్ళీ నటించలేదు.<ref>{{Cite web|url=https://www.deccanchronicle.com/lifestyle/viral-and-trending/020517/dance-without-frontiers-k-viswanath-director-who-aims-to-revive-classical-arts.html|title=Dance without frontiers: K Viswanath – Director who aims to revive classical arts|last=Lowen|first=Sharon|date=2017-05-02|website=Deccan Chronicle|language=en|access-date=2021-04-12}}</ref> ఈమె స్వతహాగా ఒడిస్సీ కళాకారిణి. కాబట్టి ఆమెకు కూచిపూడి గురువైన వెంపటి చిన్నసత్యం తో ఒక నెలరోజుల పాటు ఆ నృత్యం నేర్పించి సినిమా కోసం చిత్రీకరిద్దామనుకున్నారు. కానీ ఆమె స్వల్ప సమయంలో తాను అందులో మెలకువలు పూర్తిగా ఆకళింపు చేసుకోలేకపోవచ్చుననీ, ఇంకా ఈ సినిమా తర్వాత ఆమెను ఎవరైనా కూచిపూడి ప్రదర్శన కోసం ఆహ్వానించడం తనకు ఇష్టం లేదని తెలిపింది. దర్శకుడు ఆమె అభిప్రాయాన్ని గౌరవించి ఒడిస్సీ నృత్యాన్నే సినిమాలో ఉంచడానికి అంగీకరించాడు. ఈ చిత్రం కోసం భారతదేశంలోని పలు ప్రాంతాల నృత్యకళాకారులు ప్రత్యక్షంగా పరోక్షంగా పనిచేశారు.
 
ఈ చిత్రంలో మీనాక్షి తండ్రి పాత్రను పోషించిన ఘంటా కనకారావు నిజజీవితంలో నాట్యాచార్యుడే. ఆయనది ఏలూరు. ఈ చిత్రంలో నాట్యం చేస్తూ వేదిక మీదే మరణించినట్లుగానే నిజజీవితంలో కూడా మరణించడం యాధృచ్చికం. మీనాక్షి అక్కపాత్ర పోషించిన నటి దేవిలలిత. ఈమెను ఓ టీవీ సీరియల్ లోచూసిన తర్వాత ఈ పాత్రకి ఎంపిక చేశారు దర్శక నిర్మాతలు. ఇంటి యజమాని పాత్ర పోషించింది కె. ఎస్. టి. సాయి. ఆయన కుమారుడు, వయొలిన కళాకారుడిగా పోషించిన నటుడు కూడా నిజజీవితంలో వయొలిన్ కళాకారుడే. వీరెవరూ అప్పటికి పేరున్న కళాకారులేమీ కాదు. కానీ దర్శకుడు విశ్వనాథ్ తాను రాసుకున్న పాత్రల కోసం వీరైతేనే బాగుంటుందని ఎన్నుకున్నాడు. హాస్యం కోసం సృష్టించిన ఓంకారం, అఖిలం పాత్రలను సాక్షి రంగారావు, శ్రీలక్ష్మి పోషించారు.<ref>{{Cite web|url=https://www.sakshi.com/news/movies/swarna-kamalam-film-as-25years-old-2025|title=ఎంతో మందికి నాట్యంపై మక్కువ పెంచిందీ సినిమా|date=2013-07-15|website=Sakshi|language=te|access-date=2021-05-04}}</ref><ref>{{Cite web|url=https://www.iqlikmovies.com/movies/legendmovie/2014/04/08/Swarnakamalam/675|title=Swarnakamalam Telugu Movie Review Venkatesh Bhanu Priya K. Vishw|last=Movies|first=iQlik|website=iQlikmovies|language=en|access-date=2021-09-27}}</ref>
 
== విడుదల ==
ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద విజయవంతమైన చిత్రంగా నిలిచింది.<ref>{{Cite web|url=http://www.idlebrain.com/news/2000march20/venkatesh-centers.html|title=Venkatesh Daggubati film's box office result - Telugu cinema news - idlebrain.com|website=www.idlebrain.com|access-date=2021-09-27}}</ref><ref>{{Cite web|url=https://www.mirchi9.com/movienews/venkatesh-hits-and-flops-list-1/|title=Venkatesh Hits and Flops list|last=Kakarala|first=Ravi|date=2013-06-05|website=mirchi9.com|language=en-US|access-date=2021-09-27}}</ref> ఈ చిత్రం 12వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ఇండియన్ పనోరమా విభాగంలో ప్రదర్శించబడింది.<ref>{{Cite web|url=https://filmyfocus.com/best-telugu-movies-of-venkatesh/|title=12 Best Telugu Movies of Venkatesh Daggubati Filmy Focus|last=Focus|first=Filmy|language=en-US|access-date=2021-09-27}}</ref>
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/స్వర్ణకమలం" నుండి వెలికితీశారు