మాడర్న్ ఆర్ట్: కూర్పుల మధ్య తేడాలు

ప్రధాన వ్యాసం మూస
→‎చరిత్ర: విస్తరణ
పంక్తి 3:
== చరిత్ర ==
{{ప్రధాన వ్యాసం|చిత్రలేఖన చరిత్ర}}
మాడర్న్ ఆర్ట్ ఎప్పుడు ఉద్భవించింది అనే ప్రశ్నకు నిక్కచ్చి అయిన సమాధానం లేకపోయిననూ, 19వ శతాబ్దం లో [[ఫ్రాన్సు]] లో దీనికి బీజాలు పడ్డాయి అనే వాదన మాత్రం ఆమోదయోగ్యం గా పరిగణించబడింది. ఇంప్రెషనిస్టు చిత్రకారులు అయిన గుస్తావే కోర్బెట్, ఎడ్వార్డ్ మానెట్ వంటి వారి కళాఖండాలలో అప్పటి బోధనాంశ సాంప్రదాయాల పై వ్యతిరేకత పెరుగుతూ కనబడటం, దృశ్య ప్రపంచం యొక్క ప్రతిబింబాలను వాస్తవానికి చేరువగా తీసుకురావటం వంటి శైలులు అగుపించాయి. ఇంప్రెషనిస్టు చిత్రకారులకు వారసులుగా కొనియాడబడే పోస్టు ఇంప్రెషనిస్టు చిత్రకారులు చిత్రీకరించబడే అంశాల యొక్క సాంప్రదాయ పద్ధతులను తిరస్కరించటం, ఈ అంశాలను గమనించటం లో వారి వ్యక్తిగత కళాత్మక దృష్టి ని కళాఖండాలలో వ్యక్తపరచటం వంటి వాటి తో మాడర్నిజం కు మరింత స్పష్టత వచ్చింది.<ref name=":0" />
 
1890 నుండి ఒకదాని తర్వాత మరొకటి వచ్చిన (నియో ఇంప్రెషనిజం, సింబాలిజం, ఫావిజం, క్యూబిజం, ఫ్యూచరిజం, ఎక్స్ప్రెషనిజం, సుప్రీమటిజం, కన్స్ట్రక్టివిజం, మెటా ఫిజికల్ పెయింటింగ్, డి స్టిజ్ల్, డాడా, సర్రియలిజం, సోషల్ రియలిజం, అబ్స్ట్రాక్ట్ ఎక్స్ప్రెషనిజం, పాప్ ఆర్ట్, ఆప్ ఆర్ట్, మినిమలిజం, నియో ఎక్స్ప్రెషనిజం) వంటి కళా ఉద్యమాలు/శైలులు మాడర్న్ ఆర్ట్ యే ప్రధానాంశంగా పాశ్చాత్య దేశాలలో దృశ్య కళల సంస్కృతిని అత్యున్నత స్థాయిలకు తీసుకువెళ్ళాయి. వీటిలో వైవిధ్యం కొట్టొచ్చినట్టు కనబడిననూ, చిత్రలేఖన మాధ్యమం ద్వారానే 20వ శతాబ్దంలో/ఆ తర్వాత వచ్చిన/రాబోయే (సాంకేతిక విప్లవం, విజ్ఙాన విస్తరణ, సాంప్రదాయిక విలువలు/పద్ధతులు అసందర్భంగా కనబడటం, ప్రపంచంలో పాశ్చాత్యం కాని సంస్కృతులు కూడా ఉన్నవి అని తెలిసి రావటం వంటి) మార్పులకు ఆధ్యాత్మక స్పందనను వ్యక్తపరచటం అనే ప్రధాన లక్షణం ఆధునిక పోకడగా కనబడ్డది. <ref name=":0" />
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/మాడర్న్_ఆర్ట్" నుండి వెలికితీశారు